Zika virus in Karnataka: కర్ణాటకలో జికా వైరస్ కలకలం
చిక్కబళ్లాపూర్ పరిధిలోని ఓ దోమలో జికా వైరస్ బయటపడినట్లు ఇప్పటికే వైద్యులు తెలిపారు. దీంతో తెల్కబెట్టా పరిధిలోని ఐదు కిలోమీటర్ల మేర వైద్య ఆరోగ్యశాఖ అలర్డ్ జారీ చేసింది. అనుమానాస్పద జ్వరం కేసులను పరీక్షలకు పంపాలని ఆదేశించారు.
NASA captures Delhi poor air quality: ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత
'రాష్ట్రమంతా కలిపి దాదాపు 100 శాంపిళ్లను పరీక్షలకు పంపాం. చిక్కబళ్లాపూర్ నుంచి వచ్చిన ఆరు కేసుల్లో ఒకటి మాత్రమే పాజిటివ్‌గా నమోదైంది.' అని జిల్లా ఆరోగ్య శాఖా అధికారి డాక్టర్ ఎస్ మహేశ్ తెలిపారు. అత్యధిక జ్వరం లక్షణాలు ఉన్న ముగ్గుర్ని పర్యవేక్షణలో ఉంచామని చెప్పారు. ప్రస్తుతం వారు ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు.
ఏడెస్ దోమ కాటు ద్వారా జికా వైరస్ వ్యాధి వ్యాపిస్తుంది. ఇది డెంగ్యూ, చికున్‌గున్యా వంటి ఇన్‌ఫెక్షన్లకు కూడా కారణమౌతుంది . 1947లో ఉగాండాలో తొలిసారిగా ఈ వైరస్‌ను గుర్తించారు. గత డిసెంబర్‌లో కర్ణాటకాలోని రాయ్‌చూర్ జిల్లాలో ఐదేళ్ల బాలునికి జికా వైరస్ సోకింది. మహారాష్ట్రాలోనూ మరో వ్యక్తి దీని బారిన పడ్డారు.
Supreme rejects same-sex marriage: స్వలింగ వివాహాల చట్టబద్ధతను నిరాకరించిన సుప్రీం