Union Cabinet: జాతీయ జీవ ఇంధన విధానానికి సవరణలు
పెట్రోల్‌లో ప్రస్తుతం ఎంత శాతం ఇథనాల్ కలుపుతున్నారు?
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలన్న లక్ష్యాన్ని తొలుత నిర్ణయించిన 2030కి బదులు 2025–26 కల్లా చేరుకోవాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. దీంతోపాటు దేశ ఇంధన అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా జాతీయ జీవ ఇంధన విధానానికి పలు సవరణలు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో మే 18న సమావేశమై కేంద్ర మంత్రివర్గం వీటికి ఆమోదముద్ర వేసింది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశంలో జీవ ఇంధన ఉత్పత్తిని మరింత ప్రోత్సహించాలని, ప్రత్యేక కేసుల్లో జీవ ఇంధన ఎగుమతులకు కూడా అనుమతివ్వాలని నిర్ణయించింది. పెట్రోల్‌లో ప్రస్తుతం 10 శాతం ఇథనాల్ కలుపుతున్నారు.
India Ranks: వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్–2022లో భారత్ స్థానం?
GK Quiz: "క్రంచ్ టైమ్: నరేంద్ర మోడీస్ నేషనల్ సెక్యూరిటీ క్రైసెస్" పుస్తక రచయిత?
OTT Platform: సొంత ఓటీటీని ప్రారంభించనున్న తొలి రాష్ట్రం?Wheat Exports: గోధుమల ఎగుమతులపై నిషేధం విధించిన దేశం?
GK Important Dates Quiz: అంతర్జాతీయ గనుల అవగాహన దినోత్సవం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలన్న లక్ష్యాన్ని తొలుత నిర్ణయించిన 2030కి బదులు 2025–26 కల్లా చేరుకోవాలని నిర్ణయం
ఎప్పుడు : మే 18
ఎవరు : కేంద్ర మంత్రివర్గం
ఎందుకు : దేశ ఇంధన అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్