Wheat Exports: గోధుమల ఎగుమతులపై నిషేధం విధించిన దేశం?
దేశవ్యాప్తంగా గోధుమలు, గోధుమ పిండి ధరల్ని కట్టడి చేయడానికి వాటి ఎగుమతుల్ని నిషేధిస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది కాలంలో గోధుమలు, గోధుమ పిండి ధరలు ఏకంగా 14–20శాతం వరకు పెరగడంతో ధరల్ని నియంత్రించడానికి ఎగుమతుల్ని నిలిపివేసింది. ఎగుమతులపై నిషేధం నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) మే 14న విడుదల చేసిన నోటిఫికేషన్ స్పష్టం చేసింది.
పొరుగు దేశాలకు..
లెటర్ ఆఫ్ క్రెడిట్ ఆధారంగా 2022, మే 13 వరకు కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం గోధుమల ఎగుమతికి అనుమతినిస్తామని నోటిఫికేషన్ పేర్కొంది. అంతే కాదు ఆహార కొరతనెదుర్కొంటున్న ఇరుగు పొరుగు దేశాలకు కేంద్ర ప్రభుత్వం చెప్పిన దేశాలకు గోధుమల ఎగుమతి జరుగుతుందని స్పష్టం చేసింది.
50 శాతం బంగ్లాదేశ్‌కే..
2021–22 ఆర్థిక సంవత్సరంలో 70 లక్షల టన్నుల గోధుమల ఎగుమతులు జరిగాయి. మొత్తం ఎగుమతుల్లో 50 శాతం బంగ్లాదేశ్‌కే వెళ్లాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆయా దేశాల నుంచి ఎగుమతులు తగ్గిపోయాయి. దీంతో చాలా దేశాలు గోధుమల కోసం భారత్‌పైనే ఆధారపడ్డాయి.
Supreme Court: ఏ చట్టం అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : గోధుమల ఎగుమతులపై నిషేధం విధించిన దేశం?
ఎప్పుడు : మే 14
ఎవరు : భారత్
ఎందుకు : భారత్‌లో గోధుమలు, గోధుమ పిండి ధరల్ని కట్టడి చేయడానికి..