India Ranks: వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్–2022లో భారత్ స్థానం?
India ranks 150th in World Press Freedom Index: ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలు, ప్రాంతాల్లో పత్రికా స్వేచ్ఛ తీరుతెన్నులను తెలిపే వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్–2022 ఎడిషన్ మే 3న విడుదలైంది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం(వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే) సందర్భంగా విడుదలైన ఈ నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా..
- ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌లో పత్రికా స్వేచ్ఛ సంక్షోభంలో పడింది. పత్రికా స్వేచ్ఛకు అత్యంత ప్రమాదం ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి.
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్–2021లో 142వ స్థానంలో ఉన్న భారత్ మరింత దిగజారి... వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్–2022లో 150వ స్థానానికి పడిపోయింది.
- భారత్‌లో విధి నిర్వహణలో ఏడాదికి ముగ్గురు లేదా నలుగురు పాత్రికేయులు ప్రాణాలు కోల్పోతున్నారు.
- ఈ సూచీలో 2016 నుంచి భారత్ స్థానం దిగజారుతూనే వస్తోంది.
- భారత్‌లో లక్షకు పైగా వార్తా పత్రికలతోపాటు 36 వేల వార పత్రికలు, 380 టీవీ న్యూస్ చానళ్లు ఉన్నాయి.
GK Science & Technology Quiz: "నూర్-2" అనే సైనిక ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం?
వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్–2022 |
|
ర్యాంకు |
దేశం |
1 |
నార్వే |
2 |
డెన్మార్క్ |
3 |
స్వీడెన్ |
4 |
ఎస్తోనియా |
5 |
ఫిన్‌లాండ్ |
6 |
ఐర్లాండ్ |
7 |
పోర్చుగల్ |
8 |
కోస్టా రికా |
9 |
లిథువేనియా |
10 |
లిచెన్‌స్టెయిన్ |
24 |
యునైటెడ్ కింగ్‌డమ్ |
33 |
భూటాన్ |
42 |
అమెరికా |
76 |
నేపాల్ |
138 |
యనైటెడ్ అరబ్ ఎమిరెట్స్ |
146 |
శ్రీలంక |
150 |
భారత్ |
156 |
అఫ్గనిస్తాన్ |
157 |
పాకిస్తాన్ |
162 |
బంగ్లాదేశ్ |
175 |
చైనా |
176 |
మయన్మార్ |
180 |
ఉత్తర కొరియా |
Centre for Monitoring Indian Economy: దేశంలో అత్యధిక నిరుద్యోగిత ఉన్న రాష్ట్రం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్–2022లో 150వ స్థానం పొందిన దేశం?
ఎప్పుడు : మే 03
ఎవరు : భారత్
ఎక్కడ : ప్రపంచంలో..
ఎందుకు : దేశంలో పత్రికా స్వేచ్ఛ సంక్షోభంలో పడినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్