Article 370: ఆర్టికల్ 370 రద్దును సమర్ధించిన సుప్రీంకోర్టు
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టింది.
Jammu and Kashmir Reservation Bill: జమ్మూ కశ్మీర్ బిల్లులను ఆమోదించిన లోక్‌సభ
దీనిపై సోమవారం వెలువరించిన తీర్పులో ఆర్టికల్ 370ని రద్దు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో తీసుకున్న నిర్ణయం అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అలాగే పార్లమెంట్ నిర్ణయాన్ని కొట్టిపారేయలేం అని కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బెంచ్ తీర్పు నిచ్చింది.
కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 యుద్ధ నేపథ్యంలో కుదుర్చుకున్న తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని పేర్కొంది. జమ్మూ కశ్మీర్ కు సార్వభౌమాధికారం లేదని, భారత రాజ్యాంగమే ఫైనల్ అని స్పష్టం చేసింది. జమ్ము కశ్మీర్ రాజు నాడు దీనిపై ఒప్పందం చేసుకున్నారని సుప్రీం కోర్టు వివరించింది. ఆర్టికల్ 370 జమ్ముకశ్మీర్లో యుద్ధవాతావరణాన్ని సృష్టించిందని, కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేయడం సరికాదని పేర్కొంది. అలాగే రాష్ట్రపతి అధికారాలను ప్రతిసారి న్యాయపరిశీలనకు తీసుకోవడం సాధ్యంకాదని సీజేఐ స్పష్టం చేశారు.
Mahua Moitra expelled from Lok Sabha: ఎంపీ మహువా మెయిత్రాపై వేటు