Jammu and Kashmir Reservation Bill: జమ్మూ కశ్మీర్ బిల్లులను ఆమోదించిన లోక్‌సభ
Sakshi Education
లోక్‌సభలో జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు-2023, జమ్మూకశ్మీర్ రీఆర్గనైజేషన్ (సవరణ) బిల్లు-2023ను కేంద్రం ప్రవేశపెట్టింది.
ఆరు గంటల పై చిలుకు చర్చ అనంతరం సభ వాటిని ఆమోదించింది. జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2023పై పార్లమెంట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ కశ్మీర్‌లో 47 అసెంబ్లీ సీట్లు, జమ్ములో 43 అసెంబ్లీ సీట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.
Centre approves defence acquisition projects: రక్షణ కొనుగోలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కేంద్రం
జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో పీఓకేకు 24 ప్రత్యేక స్థానాలు కేటాయించినట్లు తెలిపారు. పీఓకే కూడా మన భూభాగమే కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. కశ్మీర్ పండిట్లకు ప్రత్యేకంగా 2 సీట్లను రిజర్వ్ చేసినట్లు తెలిపారు. ఈ బిల్లుతో జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ స్థానాలు 90కి చేరాయి.
PMGKY Scheme: మరో ఐదేళ్లు పాటు ఉచిత రేషన్‌ను పొడగించిన కేంద్రం
Published date : 07 Dec 2023 12:55PM