Centre approves defence acquisition projects: రక్షణ కొనుగోలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కేంద్రం
Sakshi Education
రూ.2.23 లక్షల కోట్ల విలువైన రక్షణ సంబంధిత కొనుగోలు ప్రాజెక్టులకు భారత రక్షణ శాఖ రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ) గురువారం ప్రాథమికంగా ఆమోదం తెలియజేసింది.
Centre approves defence acquisition projects
ఈ ప్రాజెక్టుల్లో భాగంగా 97 తేజస్ తేలికపాటి యుద్ధ విమానాలు, 156 ప్రచండ్ హెలిక్టాపర్లను త్రివిధ దళాల కోసం రక్షణ శాఖ కొనుగోలు చేయనుంది. రూ.2.23 లక్షల కోట్లతో కొనుగోలు చేస్తే యుద్ధ విమానాలు, హెలికాప్టర్లలో 98 శాతం స్వదేశంలోనే తయారవుతాయని రక్షణ శాఖ పేర్కొంది.