Journey to Maha Kumbhamela 2025 : కుంభమేళకు పరుగు ప్రయాణం.. అగ్నివీరుడి సాహసం.. కానీ!!

సాక్షి ఎడ్యుకేషన్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో భారీ ఎత్తున జరుగుతున్న కుంభమేళాలో ఇప్పటివరకూ 50 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. కుంభమేళా నేపధ్యంలో పలు విషయాలు వైరల్‌గా మారుతున్నాయి. ఇదేవిధంగా కొందరు రాత్రికిరాత్రే ఫేమస్ అవుతున్నారు. మరోవైపు సాహసం చేసి, కుంభమేళాకు తరలివస్తున్నవారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఒకరే రూపేష్.
రోజుకు పది గంటలు
2024లో దేశరక్షణ విభాగంలో ‘అగ్నివీర్’గా ఎంపికైన రూపేష్ గత జనవరి 23న కుంభమేళాకు పరుగును ప్రారంభించాడు. సహరసా(బీహార్) నుంచి ప్రారంభమైన అతని పరుగు ప్రయాణం యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు చేరుకునేందుకు 17 రోజులు పట్టింది.
Unani Medicine: యునాని వైద్యంపై అంతర్జాతీయ సదస్సు
1,100 కి.మీ.. రోజుకు 10 గంటపాలు పరుగుపెడుతూ ఫిబ్రవరి 8 మధ్యాహ్నం 12 గంటలకు పవిత్ర త్రివేణీ సంగమానికి చేరుకున్నాడు. రూపేష్ ఈ సాహసోపేత పరుగులో పలు ఆటంకాలను ఎదుర్కొన్నాడు.
ఆర్థిక సాయంగా..
కుంభమేళా ప్రాంతానికి పరుగు చేపట్టిన రూపేష్ ఫిబ్రవరి ఒకటిన అనారోగ్యానికి గురయ్యాడు. ఇదేవిధంగా మార్గం మధ్యలో అతని ఫోను, పర్సును దొంగలు లాక్కెళ్లిపోయారు. ఈ సమయంలో స్థానికులు అతనికి సహాయం అందించారు. ఐదారు వేల రూపాయల వరకూ ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు.
Maha Kumbh Maghi Purnima: మాఘి పూర్ణిమ.. మహా కుంభమేళాకి 2 కోట్ల మంది
రూపేష్ చేపట్టిన ఈ పరుగు యాత్ర ప్రారంభంలో స్నేహితులిద్దరు అతని వెంట వచ్చారు. అయితే భక్తియార్‌పూర్ చేరుకోగానే వారిద్దరూ పూర్తిగా అలసిపోవడంతో వెనుదిరిగారు. అటువంటి పరిస్థితిలోనూ రూపేష్ ధైర్యాన్ని కోల్పోక 1,100 కిలోమీటర్ల తన పరుగుయాత్రను పూర్తిచేశాడు.
నిర్ణయంపై ఎగతాళి
రూపేష్ 2024లో ఇండియన్ ఆర్మీలో ‘అగ్నివీర్’గా ఎంపియ్యారు. ప్రస్తుతం డిగ్రీ చేస్తున్నాడు. మారథాన్‌లో భారత్ బంగారు పతకం తేవాలనేది రూపేష్ కల. ఈ సందర్భంగా రూపేష్ తండ్రి రామ్‌ప్రవేశ్ యాదవ్ మాట్లాడుతూ కుంభమేళాకు పరిగెడుతూ వెళ్లాలనుకున్న తన కుమారుని నిర్ణయాన్ని విని చాలామంది ఎగతాళి చేశారని, అయితే రూపేష్ ఇప్పుడు తన లక్ష్యాన్ని పూర్తి చేయడం ఆనందంగా ఉన్నదన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)