Anti-Ship Missiles: నౌకా విధ్వంసక క్రూజ్ క్షిపణుల కొనుగోలు.. రష్యాతో భారత్ ఒప్పందం
Sakshi Education
భారత నావికాదళ పోరాట సామర్థ్యాలను గణనీయంగా పెంచే నౌకా విధ్వంసక క్రూజ్ క్షిపణుల కొనుగోలుకు భారత్ రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ క్షిపణుల రాకతో భారత నావికాదళంలోని జలాంతర్గాముల పోరాట సామర్థ్యం మరింత పెరుగుతుంది. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఇరు దేశాల ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకం చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 4వ తేదీ ఈ విషయాన్ని వెల్లడించింది.
రష్యా ప్రతినిధి వ్యాచెస్లావ్ వోలోడిన్ మాట్లాడుతూ.. భారత్-రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి 100 బిలియన్ డాలర్లను చేరుకుంటుందని తెలిపారు.
Pakistan PM: పాకిస్తాన్ మాజీ ప్రధానికి 14 ఏళ్ల జైలు శిక్ష.. ఆయన భార్యకి కూడా..
Published date : 06 Feb 2025 01:15PM