Skip to main content

Lakhimpur Kheri Violence: లఖిమ్‌పూర్‌ ఖేరి ఘటన పర్యవేక్షణకు మరో కమిషన్‌: సుప్రీంకోర్టు

Supreme 650x350

లఖిమ్‌పూర్‌ ఖేరి హింసాత్మక ఘటనలో ఉత్తరప్రదేశ్‌ సిట్‌ దర్యాప్తును నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా రోజువారీ పర్యవేక్షించడానికి మరో రాష్ట్రానికి చెందిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య న్యాయ కమిషన్‌పై సంతృప్తిగా లేమని పేర్కొంది. లఖిమ్‌పూర్‌ఖేరి ఘటనపై నవంబర్‌ 8న సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఘటనపై న్యాయ పర్యవేక్షణకు పంజాబ్‌ హరియాణా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులైన జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ జైన్‌ లేదా జస్టిస్‌ రంజిత్‌ సింగ్‌లలో ఒకరిని నియమిస్తామని ధర్మాసనం పేర్కొంది.

లఖిమ్‌పూర్‌ ఖేరి ఘటనపై అలహాబాద్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ప్రదీప్‌కుమార్‌ శ్రీవాస్తవతో కూడిన ఏక సభ్య న్యాయ కమిషన్‌ను యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం విదితమే.
 

చ‌ద‌వండి: 18 ఏళ్లలోపు వారి కోసం భారత్‌లో అనుమతి పొందిన తొలి టీకా?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : లఖిమ్‌పూర్‌ ఖేరి హింసాత్మక ఘటనపై పర్యవేక్షణకు మరో రాష్ట్రానికి చెందిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమిస్తాం  
ఎప్పుడు : నవంబర్‌ 8
ఎవరు    : సుప్రీంకోర్టు
ఎందుకు  : ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య న్యాయ కమిషన్‌ పర్యవేక్షణ తీరుపై సంతృప్తిగా లేనందున...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 09 Nov 2021 06:43PM

Photo Stories