Guinness Record: గిన్నిస్ రికార్డుకెక్కిన కిడ్నీ స్టోన్.. ఈ రాయి బరువు, పొడవు ఎంతంటే..?
Sakshi Education
జూన్ ఒకటో తేదీన శ్రీలంక రాజధాని కొలంబోలో సైనిక ఆసుపత్రిలో ఓ రోగి కిడ్నీ నుంచి అతిపెద్ద రాయిని డాక్టర్లు విజయవంతంగా బయటకుతీశారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా బయటపడ్డ కిడ్నీ స్టోన్స్‌లో ఇదే పెద్ద రాయిగా రికార్డుకెక్కింది. ఈ రాయి బరువు 801 గ్రాములు, పొడవు 13.37 సెంటీమీటరు. ఇది రెండు ప్రపంచ రికార్డులను బద్ధలు కొట్టడం గమనార్హం. 2004లో భారతదేశంలో 13 సెంటీమీటర్ల పొడవున్న కిడ్నీ స్టోన్‌ను, 2008లో పాకిస్తాన్‌లో 620 గ్రాముల బరువున్న రాయిని బయటకు తీశారు. శ్రీలంకలో వెలికితీసిన రాయి ఆ రెండింటినీ అధిగమించింది.
Colombian children: మృత్యుంజయులు.. విమాన ప్రమాదంలో తప్పిపోయిన 40 రోజుల తరువాత బయటకి వచ్చిన చిన్నారులు..!
Published date : 16 Jun 2023 05:15PM