Ukraine Dam Destruction: ఉక్రెయిన్‌లోని డ్యామ్‌పై రష్యా దాడి.. బాంబుల ధాటికి బద్దలైన రిజర్వాయర్..!
దీంతో జూన్ 6వ తేదీ తెల్లవారుజామున మూడుగంటల ప్రాంతంలో ఖేర్సన్ పరిధిలోని నీపర్ నదిపై నిర్మించిన కఖోవ్కా డ్యామ్ ధ్వంసమై పెద్ద ఎత్తున నీరు దిగువ ప్రాంతాల వైపు ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోండంటూ ముంపుప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు. ప్రస్తుతం మాస్కో అధీనంలో ప్రాంతంలో ఈ డ్యామ్ ఉంది. జలవిద్యుత్ కేంద్రానికి నిలయమైన ఈ డ్యామ్‌ను పేల్చేయడంతో ఉక్రెయిన్‌ను కరెంట్ కష్టాలు మరింతగా చుట్టుముట్టనున్నాయి.
డ్యామ్ పేల్చి రష్యా ఈ ప్రాంతంలో పర్యావరణ విధ్వంసానికి దిగిందని ఉక్రెయిన్ ఆరోపించింది. ప్రస్తుతం రష్యా ఆక్రమణలో ఉన్న జపోరిజియా అణు విద్యుత్ కేంద్రానికి నీటి అవసరాలతోపాటు క్రిమియా దక్షిణ ప్రాంత తాగు నీటి అవసరాలను ఈ డ్యామ్ తీరుస్తోంది. డ్యామ్ బద్దలై భారీఎత్తున నీరు దిగువప్రాంతాలకు వెళ్తుండటంతో ముంపు గ్రామాల ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు. దాదాపు 100 గ్రామాలు, పట్టణాలను వరద ముంచెత్తనుందని ఒక ప్రభుత్వేతర సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. ఉక్రెయిన్‌పైకి రష్యా దురాక్రమణకు దిగి 15 నెలలు గడిచిన ఈ తరుణంలో యుద్ధం ఇలా డ్యామ్‌పై దాడితో కొత్త మలుపు తీసుకుంది.
Earth Commission: భూమికి డేంజర్ బెల్స్.. ప్రతి ఖండంలోనూ.. ఎటు చూసినా రెడ్ సిగ్నళ్లే
ఇటు 22 వేలు.. అటు 16 వేలు..
అయితే ఈ డ్యామ్ పేల్చివేతతో ఎవరు లబ్ధిపొందుతారనేది తెలియట్లేదు. ఎందుకంటే రష్యా ఆక్రమిత ప్రాంతాలతోపాటు ఉక్రెయిన్ అధీనంలోని భూభాగాలనూ ఈ వరదనీరు ముంచెత్తనుంది. రష్యా అధీనంలోని వరదముప్పు ప్రాంతాల్లో 22,000 మంది నివసిస్తుండగా, ఉక్రెయిన్ అధీనంలోని ప్రాంతాల్లో 16వేల మంది నివాసమున్నారు. వరద భయంతో అక్కడి వారిని రైళ్లు, బస్సుల్లో రెండు ప్రభుత్వాల అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాడి నేపథ్యంలో జాతీయ భద్రతా మండలితో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ‘దాడిలో రష్యా 80 జనావాసాల్లోని ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది’ అని జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తంచేశారు.
రష్యా సేనలను తరిమికొట్టే పనిలో ఉన్న ఉక్రెయిన్ ప్రభుత్వానికి ఈ డ్యామ్ సమస్య యుద్ధంలో అవరోధంగా తయారైంది. ‘డ్యామ్ బద్దలవడంతో అణువిద్యుత్‌ప్లాంట్‌కు నీటి సరఫరా ఆగిపోతుంది. అయితే, డ్యామ్ నుంచి నీటి సరఫరా ఆగిపోయినా అణువిద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌కు ఇప్పటికిప్పుడు వచ్చే నష్టమేమీ లేదు’ అని ఐరాస అంతర్జాతీయ అణుఇంథన సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. రష్యాకు గతంలోనూ డ్యామ్‌లను పేల్చేసే చెడ్డ అలవాటు ఉందని అమెరికా మాజీ శాస్త్రవేత్త డేవిడ్ హెల్మెస్ వ్యాఖ్యానించారు.
Venice Grand: ఆసక్తికర ఘటన.. రాత్రికి రాత్రే రంగు మారిన కెనాల్ నీరు.. కారణమేమిటంటే..?