Venice Grand: ఆసక్తికర ఘటన.. రాత్రికి రాత్రే రంగు మారిన కెనాల్ నీరు.. కారణమేమిటంటే..?
మే 28న కాలువ రంగు మారిపోవడంతో అక్కడి ప్రజలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వెనెటో రీజియన్ రాజధాని వెనిస్‌లో గ్రాండ్ కెనాల్ (Grand Canal) నీరు అసాధారణ రీతిలో ఆకుపచ్చ రంగులోకి మారిపోయింది. తెల్లవారు జామున రియాల్టో బ్రిడ్జి వద్ద తొలుత అది గమనించిన కొందరు స్థానికులు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని పోలీసులకు వెనెటో రీజియన్ ప్రెసిడెంట్ లూకా జాయియా ఆదేశించారు. ఇక నీరు రంగు మారిన పరిణామం రకరకాల ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (07-13 మే 2023)
ఇది ఆల్గే(నాచు) వల్ల సంతరించుకుంది కాదని పరిశోధకులు ప్రకటించారు. దీంతో బహుశా ఎవరైనా నిరసకారులు లేదంటే ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా వాళ్లను కనిపెట్టే పనిలో పోలీసులు ఉన్నారు. ఇదిలా ఉండగా వెనిస్ గ్రాండ్ కెనాల్ ఇలా రంగు మారడం ఇదే తొలిసారి కాదు. గతంలో 1968లో అర్జెంటీనా ఆర్టిస్ట్ నికోలస్ గార్సియా ఉద్దేశపూర్వకంగానే గ్రాండ్ కెనాల్‌లో ఫ్లూరెసెయిన్ అనే డైని కలిపారు. ఆ టైంలో వెనిస్ ఇంటర్నేషనల్ థియేటర్ ఫెస్టివల్ జరగాల్సి ఉండగా పర్యావరణ సమస్యలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో ఆ టైంలో ఆయన ఆ పని చేశారు.
The water in the Grand Canal in Venice has turned bright green.
— Animal World (@dragon_of_time_) May 28, 2023
Has grown significantly. pic.twitter.com/N7js56Vmiy