Skip to main content

Omicron XXB.1.5 Variant : భారత్‌లోకి డేంజరస్‌ వేరియంట్ ప్ర‌వేశం.. తొలి పాజిటివ్‌ కేసు..

ప్రపంచదేశాలు కరోనా వేరియంట్ల కారణంగా మరోసారి ఆందోళనకు గురవుతున్నాయి. ముఖ్యంగా XBB.1.5 ప్రస్తుతం అమెరికాను వణికిస్తోంది. ఈ వేరియంట్‌ భారత్‌లోకి కూడా ప్రవేశించింది.
Omicron XXB.1.5 Variant News
Omicron XXB.1.5 Variant Details

గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ వేరియంట్‌ బారినపడ్డాడు. దీంతో, వైద్యులు అప్రమత్తమయ్యారు. ఇదిలా ఉండగా.. కోవిడ్ XBB.1.5 వేరియంట్‌ను ఇటీవలే అమెరికాలో కనుగొన్నారు. కాగా, XBB.1.5 వేరియంట్‌ను సూపర్‌ వేరియంట్‌ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. XBB.1.5 వేరియంట్‌ గత వేరియంట్‌ BQ.1 తో పోలిస్తే 120 రెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని అమెరిక‌ పరిశోధకులు చెబుతున్నారు.  ఇది అన్ని రకాల వేరియంట్ల కన్నా వేగంగా మన రోగనిరోధక వ్యవస్థను తప్పించుకునే ప్రత్యేకతను కలిగి ఉందని హెచ్చరిస్తున్నారు.

Covid Cases: జనవరిలో పెరగ‌నున్న క‌రోనా కేసులు.. జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం

దీని విస్తరణ..

omicron xbb 1.5

ఈ వేరియంట్‌ను గుర్తించిన 17 రోజుల్లో ఎంతో మంది ఈ వైరస్‌ బారినపడినట్టు వైద్యులు పేర్కొన్నారు. ఈ XBB.1.5 వేరియంట్‌ అమెరికా నుంచి ఇతర దేశాలకు వ్యాప్తి చెందినట్లుగా నిపుణులు గుర్తించారు. దీని విస్తరణ క్రిస్మస్‌ కంటే ముందుగానే ప్రారంభమైందని తెలిపారు. సింగపూర్‌లో కనుగొన్న XBB.1.5 వేరియంట్‌ కంటే 96 శాతం వేగంగా వ్యాపిస్తుందని వారు చెప్తున్నారు. న్యూయార్క్‌లో ఈ కొత్త వేరియంట్‌ అక్టోబర్‌ నెలలోనే వ్యాప్తిచెందడం మొదలైందని ఎరిక్‌ స్పష్టం చేశారు. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ మాదిరిగా లేకపోవడం వల్ల దీని ప్రమాదంపై ప్రజలను ప్రభుత్వం హెచ్చరించలేకపోయిందని నిపుణులు అంటున్నారు. ఇది ఒమిక్రాన్‌ మాదిరిగా కాకుండా ప్రత్యేక రీకాంబినేషన్‌ అని, ఇది ఇప్పటికే పరివర్తన చెందిన రెండు కరోనా వేరియంట్లతో రూపొందినట్లుగా పరిశోధకులు గుర్తించారు.

Corona Variants: ఒక‌టి కాదు.. నాలుగు కొత్త క‌రోనా వేరియంట్లు

ఇది వేగంగా..

Covid Latest News

ఇక.. XBB.1.5 ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతుందోని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వేరియంట్‌ వల్ల అమెరికాలో భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఈ వివరాలను బహిర్గతం చేయడంలేదని చైనాకు చెందిన ఎరిక్‌ కామెంట్స్‌ చేశారు. కేవలం 40 శాతం విస్తరణ వేగం ఉన్నట్లు చెప్పేదంతా అబద్ధమని ఆయన కొట్టిపడేశారు. XBB.1.5 వేరియంట్‌ అమెరికాలోని నగరాల్లో వేగంగా విస్తరిస్తున్నదని వ్యాఖ్యలు చేశారు.

BF.7 : కరోనా కొత్త వేరియంట్‌ ‘బీఎఫ్‌.7’.. ఈ వైరస్‌ సోకితే ఎలా గుర్తించాలంటే..?

Published date : 31 Dec 2022 07:31PM

Photo Stories