Covid Cases: జనవరిలో పెరగనున్న కరోనా కేసులు.. జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
ప్రజలందరూ కరోనా జాగ్రత్తలు పాటిస్తే ఫోర్త్ వేవ్ ముప్పుని ఎదుర్కోవచ్చునని కేంద్ర ఆరోగ్య శాఖ భావిస్తోంది. వచ్చే నెలలో కేసుల సంఖ్య పెరిగినప్పటికీ ఆస్పత్రి పాలవడం, మరణాలు వంటివి సంభవించకపోవచ్చంది. ‘‘తూర్పు ఆసియా దేశాలను కరోనా వణికించిన తర్వాత 30–35 రోజుల పాటు భారత్‌ను ఈ ఏడాది జనవరిలో థర్డ్ వేవ్ వణికించింది. ఇదొక ట్రెండ్. అందుకే అందరూ జాగ్రత్తలు పాటిస్తే వచ్చే జనవరిలో ముప్పును దాటొచ్చు’’ అని ఓ ప్రభుత్వ అధికారి చెప్పారు. గత రెండు రోజుల్లో వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఎంపిక చేసిన 6 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 39 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
Corona Virus: కరోనా ఫోర్త్ వేవ్‌తో మనకు ముప్పు లేదు
చైనా నుంచి వచ్చిన ప్రయాణికులందరికీ కరోనా పరీక్షలు తప్పనిసరి చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. చైనా నుంచి భారత్ రావాలంటే నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన వచ్చే వారం నుంచి అమలు చేసే ఆలోచనలో ఉంది. చైనాతో పాటు జపాన్, దక్షిణ కొరియా, హాంగ్‌కాంగ్, థాయ్‌లాండ్, సింగపూర్‌ల నుంచి వచ్చే వారికి కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ మంజూరు చేయడం తప్పనిసరి చేయనుంది. మరోవైపు చైనాలో కరోనా వాస్తవ పరిస్థితుల్ని ప్రభుత్వం బయటకు వెల్లడించకపోవడంతో అక్కడ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించాలని అమెరికా యోచిస్తోంది. కరోనాలో కొత్త వేరియెంట్లు పుట్టుకొచ్చి పలు దేశాలు మూడు, నాలుగు కోవిడ్–19 వ్యాక్సిన్ డోసులు అందిస్తున్న వేళ మన దేశంలో నాలుగో డోసు అవసరంపై చర్చ మొదలైంది. భారత్‌లో ఫ్రంట్‌లైన్, ఆరోగ్య సిబ్బందికి నాలుగో డోసు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ యోచిస్తోంది. అయితే వైద్య నిపుణులు నాలుగో డోసు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు.