Mann Ki Baat: ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ

అంతరిక్షం నుంచి క్రీడల దాకా పలు అంశాలను ప్రస్తావించారు.
స్థూలకాయ సమస్యపై చర్చ: దేశంలో స్థూలకాయుల సంఖ్య పెరిగిపోతుండడంపై ఆందోళన వ్యక్తంచేశారు. పలు పరిశోధనల ప్రకారం, ప్రతి ఎనిమిది మందిలో ఒకరు స్థూలకాయంతో బాధపడుతున్నారని తెలిపారు. చిన్నారుల్లో ఈ సమస్య పెరిగిపోవడం ఆందోళనకరమని చెప్పారు. ఈ నేపథ్యంలో, వంటనూనెల వినియోగాన్ని కనీసం 10 శాతం తగ్గించుకోవాలని ప్రజలకు సూచించారు.
మహిళల స్ఫూర్తి: భారత్‌లో మహిళలు అనేక రంగాల్లో విజయాలు సాధిస్తున్నారని, ఈ స్ఫూర్తిని గౌరవించాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ఖాతాలను మహిళా విజేతలకు అప్పగిస్తానని చెప్పారు.
ఇస్రో సెంచరీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 100వ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన సందర్భంగా, భారతదేశం అంతరిక్ష పరిశోధనలో ఓ కొత్త మైలురాయిని చేరినట్లైందని చెప్పారు.
జంతుజాలం పరిరక్షణ: జింక మహిళ అనూరాధ రావు గురించి మాట్లాడుతూ, ఆమె జంతువుల సంరక్షణ కోసం చేస్తున్న పోరాటాన్ని ప్రస్తావించారు. వచ్చే నెలలో 'వరల్డ్ వైల్డ్‌లైఫ్ డే' సందర్భంగా, జంతుజాల పరిరక్షణకు అంకితమైన వారిని ప్రోత్సహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
PM Modi: దేశానికి ప్రపంచస్థాయి నాయకులు అవసరం.. ‘సోల్’ సదస్సులో ప్రధాని మోదీ