Corona Variants: ఒకటి కాదు.. నాలుగు కొత్త కరోనా వేరియంట్లు
అయితే చైనాలో కరోనా విలయతాండవానికి కేవలం ఈ ఒక్క వేరియంట్ మాత్రమే కారణం కాదని, నాలుగు కొత్త వేరియంట్లు కారణం అని భారత కోవిడ్ ప్యానల్ చీప్ ఎన్‌కే అరోడా తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో అరోరా మాట్లాడుతూ.. బీఎఫ్-7 ద్వారా 15% కేసులే నమోదయ్యాయని, బీఎన్, బీక్యూ వేరియంట్ల నుంచి 50%, ఎస్‌వీవీ వేరియంట్ నుంచి 15% కేసులు వచ్చాయన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రమాద ఘంటికలు మోగించిన చైనాలో కోవిడ్ తాజా వ్యాప్తిపై దేశంలో భయాందోళనలు అవసరం లేదన్నారు. చైనా నుంచి సరైన సమాచారం లేనందున భారత్ ముందు జాగ్రత్త, ముందస్తు సన్నాహాలు చేస్తోందన్నారు. ఏది ఏమైనప్పటికీ, చైనా వ్యాప్తికి వైరస్‌ల కాక్టెయిల్ కారణమని స్పష్టంగా తెలుస్తోందని, స్థానిక ఎపిడెమియాలజీ కారణంగా భిన్నంగా ప్రవర్తిస్తోందని అరోరా వ్యాఖ్యానించారు. కోవిడ్ మొదటి, రెండు, మూడు వేవ్‌లో వ్యాపించిన ఇన్‌ఫెక్షన్లు, వ్యాక్సిన్‌ల ద్వారా పొందిన రోగనిరోధక శక్తి కలయికతో ఏర్పడిన హైబ్రిడ్ ఇమ్యూనిటీ కారణంగా భారత్ లాభపడుతుందని చెప్పారు.
New Variant BF7 : ఈ కొత్త వేరియంట్‌తో వీరికే ముప్పు ఎక్కువ.. ఎందుకంటే...?