Skip to main content

Covid Deaths: కరోనా కరాళనృత్యం.. మృతదేహాలతో బారులుతీరిన బంధువులు

కోవిడ్‌ దెబ్బకు డ్రాగన్‌ దేశం బిక్కుబిక్కుమంటోంది. ఆస్పత్రులకు పోటెత్తుతున్న జనంతో, మృతదేహాలను వెంటేసుకొస్తున్న బంధువులతో శ్మశానాలు దాదాపు నిండిపోయాయి.

కోట్ల మంది పౌరులు కోవిడ్‌ బారినపడి సరైన వైద్యం కోసం కిక్కిరిసిన ఆస్పత్రుల బయట వేచిచూస్తున్నారు. అంతులేని మరణాలకు చైనా ఆలవాలంగా నిలిచిందనే తెలిపే తాజా వీడియో ఒకటి మీడియాలో ప్రత్యక్షమైంది. ఆరోగ్య నిపుణుడు డాక్టర్‌ ఎరిక్‌ ఫెగిల్‌ డింగ్‌ ఈ వీడియోను ట్వీట్‌చేశారు. ఆత్మీయుల అంతిమ సంస్కారం కోసం ఇంకా ఎన్ని గంటలపాటు వేచి ఉండాలో తెలీకుండనే మృతదేహాలను క్యూ లైన్‌లో ఉంచి వేచిచూస్తున్న వందలాది మంది బంధువుల వేదన ఆ వీడియోలో కనిపించింది. కాగా, కట్టుతప్పిన కోవిడ్‌ సంక్షోభాన్ని వేగంగా అదుపుచేసి దేశంలో ఆరోగ్య పరిస్థితిని చక్కదిద్దాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు చైనా అధికారిక వార్తా ప్రసార సంస్థ సీసీటీవీ ఒక ప్రకటన విడుదలచేసింది.  

Covid Cases: 20 రోజుల్లోనే 25 కోట్ల మందికి కరోనా

రోజూ లక్షల్లో కేసులు
ఝెజియాంగ్‌ ప్రావిన్స్‌లో రోజుకు 10 లక్షల కేసులు, తీరప్రాంత క్వింగ్‌దావో సిటీలో రోజుకు 5 లక్షల కేసులు, దోంగ్వాన్‌ సిటీలో రోజూ 2,50,000–3,00,000 కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. సిచువాన్‌ ప్రావిన్స్‌లో లక్షన్నర జనాభాపై జరిపిన సర్వేలో 63 శాతం మంది తమకు కోవిడ్‌ సోకినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది చివరికల్లా చైనాలో 10 నుంచి 20 లక్షలలోపు జనం కోవిడ్‌తో కన్నుమూసే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఉన్నతాధికారి ఒకరు హెచ్చరించారు. 

New Variant BF7 : ఈ కొత్త వేరియంట్‌తో వీరికే ముప్పు ఎక్కువ‌.. ఎందుకంటే...?

 

Published date : 27 Dec 2022 01:13PM

Photo Stories