Skip to main content

Canada raises cost of living: కెనడాలో చదుకోవాలనుకునే విద్యార్ధులకు షాక్‌!

జీవన వ్యయం పెరిగిపోతున్న తరుణంలో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కీలక నిర్ణయం తీసుకున్నారు.
Trudeau government increases student deposit for international students  Canada Raises Cost Of Living Requirements For International Students
Canada Raises Cost Of Living Requirements For International Students

 ఇతర దేశాల నుంచి కెనడాలో చదువుకునేందుకు వచ్చే విద్యార్ధుల డిపాజిట్‌ మొత్తాన్ని భారీగా పెంచారు. ప్రస్తుతం ఆ మొత్తం 10వేల డాలర్లు (రూ.6.14లక్షలు) ఉండగా దాన్ని ట్రూడో ప్రభుత్వ 20,635 డాలర్లు (రూ.12.7లక్షల)కు పెంచింది. జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. 

Russia Presidential Elections: మార్చిలో రష్యా అధ్యక్ష ఎన్నికలు

సాధారణంగా భారతీయ విద్యార్ధులు కెనడాకు వెళ్లాలంటే..వారి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కనీసం రూ.6.14 లక్షలు ఉండాలి. అలా ఉంటేనే కెనడాకు వచ్చిన తర్వాత ఉపాధి లేకపోయినా ఆర్ధిక ఇబ్బందులు ఉండవనే ఈ షరతు విధిస్తుంది. ఇలా కెనడాయే కాదు.. ఇతర దేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్ధులు ఆయా దేశాల్ని బట్టి డిపాజిట్‌ మొత్తాన్ని సంబంధిత వీసా అధికారులకు చూపించాల్సి ఉంటుంది. కెనడా రూ.6.14లక్షల డిపాజిట్‌ నిబంధనను 2000 నుంచి కొనసాగిస్తూ వచ్చింది.

కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ థ్రెషోల్డ్‌లో మార్పులు

ఈ నేపథ్యంలో కెనడా కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ థ్రెషోల్డ్‌ను మారుస్తున్నామని, తద్వారా పెరిగిపోతున్న కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇబ్బందుల నుంచి విద్యార్ధులకు ఉపశమనం కలుగుందని కెనడా ఇమ్మిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ అన్నారు. 

India-Kenya Summit: కెన్యా వ్యవసాయరంగ ఆధునికీకరణకు భారత్ సాయం

Published date : 11 Dec 2023 09:52AM

Photo Stories