Skip to main content

Union Budget Highlights: 2022–23 ఏడాది మొత్తం బడ్జెట్‌ విలువ ఎన్ని లక్షల కోట్లు?

Nirmala

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ఫిబ్రవరి 1న లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ 2022–23ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన అనంతరం.. లోక్‌సభ మరుసటి రోజుకు వాయిదా పడింది. దాదాపు గంటన్నరపాటు బడ్జెట్‌ ప్రసంగం కొనసాగింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తం రూ. 39 లక్షల 45 వేల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2022–23 ఏడాది మొత్తం వనరుల సమీకరణ రూ. 22.84 లక్షల కోట్లు కాగా, ద్రవ్యలోటు 6.9 శాతం. రూ.17 లక్షల కోట్ల లోటు బడ్జెట్‌.

వేతన జీవులకు నిరాశ..
ప్రస్తుత బడ్జెట్‌లో వేతన జీవులకు నిరాశ ఎదురైంది. ఆదాయ పన్నులో ఎలాంటి మార్పులేదు. ఇన్‌కంటాక్స్‌ స్లాబ్‌లలో ఎలాంటి మార్పులేదు. ఐటీ శ్లాబుల్లో కేంద్రం  ఎలాంటి మార్పులు చేయలేదు. 

దేశంలో 4 మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌లు..
తెలుగు రాష్ట్రాల్లో నదుల అనుసంధానానికి ప్రణాళికలు రూపొందించామని మంత్రి నిర్మల తెలిపారు. ప్రత్యేకంగా డిజిటల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో 4 మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

ఈ– విద్య కోసం 200 టీవీ చానెళ్ల ఏర్పాటు..
ఆతిథ్య రంగానికి రూ. 5లక్షల కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. మైక్రో, చిన్న తరహా పరిశ్రమలకు రూ. 2 లక్షల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. పీఎం ఈ– విద్య కోసం 200 టీవీ చానెళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రాంతీయ భాషల్లో 1–12 తరగతుల వరకు వర్తింపచేయనున్నారు.

వ్యవసాయ క్షేత్రాల పర్యవేక్షణకు కిసాన్‌ డ్రోన్‌లు..
దేశ వ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల.. బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. చిన్న రైతులు, చిన్న పరిశ్రమలకు అనుగుణంగా రైల్వే నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ క్షేత్రాల పర్యవేక్షణకు కిసాన్‌డ్రోన్‌లను అభివృద్ధి చేశామని తెలిపారు. దేశవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయానికి ప్రొత్సాహం ఇస్తున్నామని నిర్మల పేర్కొన్నారు.

కృష్ణా,పెన్నా, కావేరి నదుల అనుసంధానానికి ప్రణాళిక..
పట్టణ ప్రాంతాల్లో రోప్‌వేల నిర్మాణం జరుగుతుందని మంత్రి నిర్మల తెలిపారు. అదే విధంగా, సరుకు రవాణాకు మరిన్ని కేటాయింపులు చేయనున్నట్లు వెల్లడించారు. 2023 నాటికి 2 వేల కి.మీ రైల్వే లైన్లు పెంచుతామని పేర్కొన్నారు. భూరికార్డులను డిజిటలైజేషన్‌ చేస్తామని వివరించారు.

Union Budget 2022-23: ఐదేళ్లలో 60 లక్షల మందికి ఉ‍ద్యోగాలు..ప్రణాళిక ఇలా

Union Budget 2022 Live Updates: వచ్చే మూడేళ్లలో కొత్తగా 400 వందే భారత్‌ రైళ్లు

Union Budget History and Facts: మొట్ట మొదటి కేంద్ర బడ్జెట్ ఎంతో తెలుసా?

Union Budget 2022 Live Updates: నిర్మలా సీతారామన్‌ అరుదైన ఘనత.. తొలి మహిళగా రికార్డు

Parliament Budget Session 2022: లోక్‌సభలో 2021–2022 ఆర్థిక సర్వే

 Union Budget-2022 Updates: యువతకు భారీగా ఉద్యోగాల కల్పన.. జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయి..

Work From Home: ఉద్యోగులకు ఈసారి బడ్జెట్‌లో భారీ బెనిఫిట్స్‌..!

Published date : 01 Feb 2022 01:17PM

Photo Stories