Skip to main content

Commercial Projects: ఢిల్లీలో నూతన వాణిజ్య భవన్‌ ప్రారంభం

New Commercial Projects in Delhi
New Commercial Projects in Delhi

అభివృద్ధి చెందుతున్న దేశం హోదా నుంచి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడానికి ఎగుమతుల పాత్ర కీలకమైనదిగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశం నుంచి ఎగుమతులను మరింత పెంచుకునేందుకు, కొత్త మార్కెట్లను చేరుకునేందుకు దీర్ఘకాల లక్ష్యాలను విధించుకోవాలని పరిశ్రమకు సూచించారు. ఈ లక్ష్యాలను చేరుకునే మార్గాల గురించి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని కోరారు. ఢిల్లీలో నూతనంగా నిర్మించిన వాణిజ్య భవన్‌ను ప్రధాని మోదీ జూన్ 23న ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2021–22) చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవరోధాలు నెలకొన్నా.. భారత్‌ 670 బిలియన్‌ డాలర్ల వస్తు, సేవలను (రూ.51 లక్షల కోట్లు సుమారు) ఎగుమతి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇందులో వస్తు ఎగుమతులే 418 బిలియన్‌ డాలర్లు ఉన్నట్టు చెప్పారు. 400 బిలియన్‌ డాలర్ల ప్రభుత్వ లక్ష్యానికి మించి ఎగుమతులు సాధించినట్టు తెలిపారు. 

Also read: Adani group: సమాజ సేవకు అదానీ రూ. 60 వేల కోట్ల విరాళం

Published date : 24 Jun 2022 06:00PM

Photo Stories