Skip to main content

Indigenous Battle Tank : తేలికపాటి స్వదేశీ యుద్ధ ట్యాంకు సిద్ధం

release of indigenous battle tank is expected in 2027  Indian defense technology trialsNew Indian military tank testing

తూర్పు లద్ధాబ్‌ ప్రాంతంలో.. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు భారత్‌ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ ట్యాంకు ‘జొరావర్‌’ పరీక్షలకు సిద్ధమైంది. తాజాగా దీనికి సంబంధించిన పరీక్షలు మొదలయ్యాయి. ఈ ట్యాంకును పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), ఎల్‌ అండ్‌ టీ సంయుక్తంగా రూపొందించాయి. 25 టన్నుల బరువుండే జొరావర్‌ ట్యాంకును వాయు మార్గంలోనూ రవాణా చేయవచ్చు. 350కిపైగా జొరావర్‌ ట్యాంకులను మోహరించాలని భారత సైన్యం భావిస్తోంది. ప్రధానంగా పర్వతమయ సరిహద్దు ప్రాంతంలో వీటిని రంగంలోకి దించాలనుకుంటోంది.

Reservation for Ex Agniveer : మాజీ అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్లు

చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి శరవేగంగా మోహరించేందుకు వీలుగా దీన్ని డిజైన్‌ చేశారు. డీఆర్‌డీఓ ఇంకా ఎల్ అండ్ డీ సంస్థ‌లు దీనిని రెండు సంవ‌త్స‌రాల కాలంలోనే రికార్డు స్థాయిలో అభివృద్ధి చేశారు. ఈ ఫ్యాక్ట‌రీని సంద‌ర్శించిన డీఆర్‌డీవో అధిపతి సమీర్‌ కామత్.. మ‌రో మూడేళ్ల‌లో అంటే 2027వ సంవ‌త్స‌రంలో దీనిని సైన్యంలోకి ప్ర‌వేశ పెట్టే అవ‌కాశం ఉంటుంద‌ని తెలిపారు.

Anti Narcotics Helpline: యాంటి నార్కోటిక్స్ హెల్ప్ లైన్ నంబర్ ఇదే..

Published date : 16 Jul 2024 03:38PM

Photo Stories