Brain Eating Amoeba : కేరళలో మెదడును తినే అమీబా వ్యాప్తి
కేరళలో మెదడును తినే అమీబా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతుండటం కలవరం సృష్టిస్తోంది. మెదడును తినే అమీబా ప్రధానంగా మురికి నీళ్ల ద్వారానే మనుషులకు వ్యాపిస్తోందని, దీనివల్ల పిల్లలకు ఎక్కువ ప్రమాదం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రజలు, ముఖ్యంగా పిల్లలు మురికి నీళ్లు ఉండే కుంటలు, చెరువుల్లో స్నానం చేయొద్దని సూచించింది. స్విమ్మింగ్ పూల్స్‌ను, నీళ్లు నిల్వ ఉండే ఇతర ప్రాంతాల్లో క్లోరినేషన్ చేపట్టాలని అధికారులను ఆదేశించింది.
Reservation for Ex Agniveer : మాజీ అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్లు
కాగా ‘నేగ్లేరియా ఫోలెరీ’ అనే అమీబా వల్ల ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఈ వ్యాధిని అమీబిక్ మెనింజోఎన్‌సెఫలైటిస్ (నేగ్లేరియాసిస్) అని పిలుస్తారు. వేడిగా, మురికిగా ఉండే నీళ్లలో ఈ అమీబా స్వేచ్ఛగా జీవిస్తుంది. మనుషుల ముక్కు ద్వారా ఇది మెదడుకు చేరి బ్రెయిన్ సెల్స్‌ను డ్యామేజ్ చేస్తుంది. ప్రధానంగా పిల్లలకు ఇది ప్రాణాంతకంగా మారుతుంది.