Skip to main content

India GDP growth Rate: అంచనాలను దాటిన‌ జీడీపీ

భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2023–24 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్‌) అంచనాలను మించి 7.6 శాతంగా నమోదయ్యింది.
India Experiences Strong Q2 GDP Growth  India beats expectations with GDP growth of 7.6% "Economic Update  India Records 7.6% GDP Growth in Q2
India beats expectations with GDP growth of 7.6%

చైనా వృద్ధి రేటు ఇదే కాలంలో 4.9 శాతంగా నమోదుకావడంతో ప్రపంచంలో తన వేగవంతమైన ఎకానమీ హోదాను సైతం భారత్‌ మరోసారి ఉద్ఘాటించింది. సమీక్షా త్రైమాసికంలో తయారీ, మైనింగ్, సేవలు చక్కటి పనితీరును ప్రదర్శించాయి. వ్యవసాయ రంగం మాత్రం బలహీన ఫలితాన్ని నమోదుచేసుకుంది.

Fiscal deficit: 45 శాతానికి చేరిన‌ ద్రవ్యలోటు

మొదటి త్రైమాసికంలో భారత్‌ ఎకానమీ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదయ్యింది. రెండవ త్రైమాసికంలో ఈ రేటు 6.5 శాతానికి పరిమితం అవుతుందన్న అంచనాలను మించి పటిష్ట ఫలితం నమోదుకావడం పట్ల ఆర్థికవేత్తలు, విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో వృద్ధి 6.2 శాతం కావడం గమనార్హం.   2022–23లో భారత్‌ జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం.  2023–24లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) అంచనావేస్తోంది.     

రంగాల వారీగా వృద్ధి తీరు ఇలా...

వస్తువులు, సేవల ఉత్పత్తికి సంబంధించి గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌ (జీవీఏ)విలువల ప్రకారం... జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) రంగాల వారీగా విడుదల చేసిన ఫలితాలు పరిశీలిస్తే...
తయారీ: మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో  దాదాపు 78 శాతం వాటా కలిగిన  ఈ రంగంలో వృద్ధి భారీగా 13.9 శాతంగా నమోదయ్యింది. 2022 ఇదే కాలంలో అసలు వృద్ధిలేకపోగా 3.8 శాతం క్షీణత నమోదయ్యింది.  
► గనులు, తవ్వకాలు: ఈ రంగంలో 0.1 శాతం క్షీణత సమీక్ష కాలంలో 10 శాతం వృద్ధిలోకి మారింది.  
►విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవలు: వృద్ధి రేటు 6.1 శాతం నుంచి 10.1 శాతానికి ఎగసింది.  
►నిర్మాణం: వృద్ధి రేటు 5.7 శాతం నుంచి 13.3 శాతానికి ఎగసింది.  
►వ్యవసాయం: ఎకానమీలో దాదాపు 15 శాతం వాటా ఉన్న ఈ కీలక రంగంలో వృద్ధి రేటు (2022 ఇదే కాలంతో పోల్చిచూస్తే) 2.5 శాతం నుంచి 1.2 శాతానికి తగ్గింది.  
►ఫైనాన్షియల్, రియల్టి, ప్రొఫెషనల్‌ సేవలు: 7.1% నుంచి వృద్ధి 6 శాతానికి పడిపోయింది.

 

India's GDP: త్వ‌ర‌లో 4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌

Published date : 02 Dec 2023 01:01PM

Photo Stories