Fiscal deficit: 45 శాతానికి చేరిన ద్రవ్యలోటు
Sakshi Education
ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం.. ద్రవ్యలోటు అక్టోబర్‌తో ముగిసిన నెలకు ఆర్థిక సంవత్సరం మొత్తం లక్ష్యంలో 45 శాతానికి చేరింది.
ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య ఈ విలువ ర.8.03 లక్షల కోట్లని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) వెల్లడించింది. 2023–24లో ద్రవ్యలోటు ర.17.86 లక్షల కోట్లుగా బడ్జెట్ అంచనా వేసింది.
Wholesale inflation: అక్టోబర్‌లోనూ టోకు ద్రవ్యోల్బణం రివర్స్
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువ అంచనాల్లో పోల్చి చూస్తే ఇది 5.9 శాతం. ఆహార రాయితీకి అదనపు నిధుల కేటాయించాల్సిన అవసరం ఏర్పడుతున్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.9 శాతం ద్రవ్యలోటు లక్ష్య సాధన సాధ్యమేనని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ ఇటీవలే అన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఈ రేటు 6.4 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. 2025–26 నాటికి భారత్ ద్రవ్యలోటు లక్ష్యాన్ని 4.5 శాతంగా కేంద్రం నిర్దేశించుకుంది.
Net Direct Tax Collection: ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 22 శాతం వృద్ది
Published date : 01 Dec 2023 03:58PM