Skip to main content

National Anthem of India: 'జన గణ మన'ను జాతీయ గీతంగా స్వీకరించింది నేడే..! ఎంత వ్యవధిలో ఆలపించాలంటే..

'జన గణ మన'ను జాతీయ గీతంగా స్వీకరించింది ఈరోజే.
History of Indian National Anthem   First Pada of Bharata Bhagya Vidhatha  Indian HeritageIndian Parliament Rajya Sabha  Symbol of Unity and Patriotism

భారత రాజ్యంగ సభ జనవరి 24, 1950లో జన గణ మన గీతాన్ని భారత జాతీయ గీతంగా ఆమోదించింది. అయిదు పాదాలున్న ‘భారత భాగ్య విధాత’లోని మొదటి పాదాన్ని జాతీయ గీతంగా స్వీకరించారు. రవీంద్రనాథ్‌ టాగోర్‌ రాసిన ఈ గీతానికి సంగీత బాణిని సమకూర్చింది కూడా ఆయనే.ఒకసారి మదనపల్లిలోని బీసెంట్‌ థియోసాఫికల్‌ కాలేజ్‌ని 1919లో రవీంద్రనాద్‌ ఠాగూర్‌ సందర్శించాడు. ఆ కాలేజీలో ఉన్నప్పుడు జన గణ మన గీతాన్ని ‘మార్నింగ్‌ స్టార్‌ ఆఫ్‌ ఇండియా’ పేరుతో ఆంగ్లంలోకి అనువదించాడు.

52 సెకండ్లలో జాతీయగీతం..
జాతీయ గీతం పూర్తిగా 52 సెకండ్ల కాలవ్యవధిలో ఆలపించాలి. జాతీయ గీతాన్ని ఈ కింది ప్రభుత్వ కార్యక్రమాలలో, వివిధ సందర్భాలలో పూర్తిగా వినిపించాలి. సివిల్, మిలటరీ ఇన్ స్టిట్యూట్స్, రాష్ట్రపతి, గవర్నర్‌కు గౌరవందనం సందర్భాల్లో ఆలపించాలి. అలాగే రాష్ట్రపతి, గవర్నర్ వంటి ప్రముఖులు లేకున్నప్పటికీ పరేడ్లలో ఆలపిస్తారు. రాష్ట్రప్రభుత్వ అధికార కార్యక్రమాలకు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రజా సందోహ కార్యక్రమాలకు రాష్ట్రపతి వచ్చినప్పుడు, వెళ్తున్నప్పుడు, ఆకాశవాణిలో రాష్ట్రపతి జాతినుద్దేశించి చేసే ప్రంగానికి ముందు, వెనుక ఆలపిస్తారు.

రాష్ట్ర గవర్నర్ తన రాష్ట్ర పరిధిలో అధికారిక కార్యక్రమాలకు వచ్చినప్పుడు, నిష్క్రమించేటప్పుడు, జాతీయ పతాకాన్ని పరేడ్‌కు తెచ్చినప్పుడు, రెజిమెంటల్ కలర్స్ బహుకరించినప్పుడు, నౌకాదళంలో కలర్స్ ఆవిష్కరించినప్పుడు ఈ గీతాన్ని ఆలపిస్తారు. కొన్ని సందర్భాల్లో జాతీయ గీతాన్ని సంక్షిప్తంగా మొదటి, చివరి వరుసలను ఆలపించుకోవచ్చు. అలా ఆలపించడం 52 సెకండ్ల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే? హడావిడిగా ఏదో పాడేశాం అన్నట్లుగానూ లేక సాగదీసినట్లుగా పాకుండా ఉండేదుకు ఇలా వ్యవధిని నిర్ణయించారు. మన జాతీయ గీతాన్ని గౌరవప్రదంగా ఆలపించదగినది అని చెప్పడానికే ఇలా వ్యవధిని ఏర్పాటు చేశారు. 

National Girl Child Day 2024: జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం.. ఈ రోజు చరిత్ర ఇదే..!

1947లో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో జాతీయ గీతం గురించి భారత ప్రతినిధి బృందానికి అడిగినప్పుడు జన గణ మన రికార్డింగ్‌ను జనరల్‌అసెంబ్లీకి అందించారు. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతినిధుల ముందు జాతీయగీతాన్ని ఆలపించారు. అయితే మన జాతీయ గీతాన్ని అన్ని దేశాలు ప్రశంసించాయి. మూడు సంవత్సరాల తర్వాత అంటే 1950 జనవరి 24న భారత రాజ్యాంగంపై సంతకం చేయడానికి అసెంబ్లీ సమాశమైంది. ఈ సమయంలో దేశ మొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌ అధికారికంగా 'జన గణ మన' ను జాతీయ గీతంగా ప్రకటించారు. దీంతో మన గణతంత్ర దినోత్సవానికి రెండు రోజుల ముందు ఇవాళే(జనవరి 24)న 'జన గణ మన'ను జాతీయగీతంగా స్వీకరించింది. 

Published date : 25 Jan 2024 10:38AM

Photo Stories