Skip to main content

Rani Lakshmibai Death Anniversary: జూన్ 18వ తేదీ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి వర్ధంతి

జూన్ 18వ తేదీ ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు రాణి ఝాన్సీ లక్ష్మీబాయి వర్ధంతి.
Rani Lakshmibai Death Anniversary   history  of lakshmibai

ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఈమె 1828 నవంబర్ 19న వారణాసిలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే, భాగీరథీబాయిలు. వీరు ఒక ప్రముఖ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. ఆమె తల్లి చాలా తెలివైనది, ఆధ్యాత్మిక ధోరణి మెండుగా కలది. చిన్నతనంలోనే ఆమెకు కత్తియుద్ధం, గుర్రపు స్వారీ, తుపాకీ కాల్చడం వంటి విద్యలలో శిక్షణ లభించింది.

1842 సంవ‌త్స‌రంలో, 13 ఏళ్ల వయసులోనే లక్ష్మీబాయి ఝాన్సీ రాజు గంగాధరరావును వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ద్వారా ఆమె ఝాన్సీ రాణిగా మారారు. దురదృష్టవశాత్తు, గంగాధరరావు 1851లో మరణించారు. వారసుడు లేకపోవడంతో, ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకోవాలని భావించింది. 

World Blood Donor Day: ప్రతి ఏడాది జూన్ 14వ తేదీ ప్రపంచ రక్తదాతల దినోత్సవం

1857 తిరుగుబాటు..
➤ 1857లో భారత స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వారిపై మొదటి యుద్ధం ప్రారంభమైంది. 
➤ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఈ తిరుగుబాటులో ప్రముఖ పాత్ర పోషించింది.
➤ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి ఝాన్సీ రాజ్యాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నించింది. 
➤ గ్వాలియర్ కోటను స్వాధీనం చేసుకోవడంలో ఝాన్సీ కీలక పాత్ర పోషించింది.
➤ 1858 జూన్ 18వ తేదీ గ్వాలియర్ యుద్ధంలో  బ్రిటిష్ సైన్యంపై  భారీ దాడి చేసిన ఝాన్సీ రాణి వీరమరణం పొందారు.

World Day Against Child Labour: జూన్ 12వ తేదీ ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం.. 

Published date : 19 Jun 2024 01:28PM

Photo Stories