Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 3rd కరెంట్ అఫైర్స్
ICC T20 ర్యాంకుల్లో సూర్య ‘నంబర్ వన్’
దుబాయ్: టి20 ఫార్మాట్‌లో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా చెలరేగుతున్న సూర్యకుమార్ యాదవ్ ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నవంబర్ 2న విడుదల చేసిన టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ సూర్యకుమార్ నంబర్‌వన్ ర్యాంక్‌కు ఎగబాకాడు.
ఈ ఏడాది ప్రత్యేకించి టి20 ఫార్మాట్‌లో ఇంటా బయటా విశేషంగా రాణిస్తోన్న సూర్య... పాకిస్తాన్ ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్ (842 పాయింట్లు)ను వెనక్కినెట్టాడు. నిలకడగా మెరుపులు మెరిపిస్తున్న యాదవ్ ఖాతాలో 863 రేటింగ్ పాయింట్లున్నాయి. కోహ్లి (897; సెపె్టంబర్ 2014లో) తర్వాత రెండో అత్యుత్తమ రేటింగ్ పాయింట్లను సూర్యకుమార్ నమోదు చేశాడు. గతేడాది మార్చిలో మొదలైన అతని టి20 ప్రయాణంలో అచిరకాలంలోనే ఒక సెంచరీ, 11 అర్ధసెంచరీలు ఉండటం గొప్ప
విశేషం. టి20ల్లో టాప్ ర్యాంక్‌కు చేరిన రెండో భారత బ్యాటర్ సూర్యకుమార్.
- ఈ ఫార్మాట్‌లో కేవలం ‘రన్ మెషిన్’ కోహ్లి మాత్రమే నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు.
- భారత స్టార్ 2014 నుంచి 2017 డిసెంబర్ మధ్య కాలంలో 1013 రోజులు టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. తాజా ర్యాంకుల్లో కోహ్లి 638 పాయింట్లతో పదో ర్యాంకులో ఉన్నాడు.
- బౌలింగ్ జాబితాలో అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (700) తొలి ర్యాంక్‌లో నిలువగా
- శ్రీలంక స్పిన్నర్ హసరంగ (697) రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. గత ప్రపంచకప్ సమయంలో శ్రీలంక బౌలర్ టాప్ ర్యాంకులో ఉన్నాడు. మళ్లీ అగ్రస్థానంపై కన్నేసిన అతనికి రషీద్‌కు మధ్య కేవలం 3 పాయింట్లే తేడా!
- భారత బౌలర్లెవరూ టాప్–10లో లేరు. అశ్విన్ మూడు స్థానాల్ని మెరుగుపర్చుకొని 18వ స్థానంలో ఉన్నాడు.
People Research on India's Consumer Economy Survey: ప్రతి ముగ్గురిలో ఒకరు మధ్యతరగతి
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో మధ్యతరగతి పెరుగుతోంది. దేశంలోని ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ వర్గానికి చెందినవారే. ప్రస్తుతం మొత్తం జనాభాలో మిడిల్‌క్లాస్ 31 శాతం ఉన్నారు. 2004–05లో 14 శాతమున్నది కాస్తా 2021 నాటికి రెండింతలకు పైగా 31శాతానికి పెరిగింది. మరో పాతికేళ్లకు 63 శాతానికి చేరనున్నట్టు ఆర్థిక పరిశోధన సంస్థ పీపుల్స్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్జ్యూమర్ ఎకానమీ (ప్రైస్) ‘ద రైజ్ ఆఫ్ ఇండియాస్ మిడిల్ క్లాస్’ పేరిట నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. ఒక అంచనా ప్రకారం ఏడాదికి రూ.5లక్షల నుంచి 30 లక్షల లోపు ఆదాయమున్న వారిని మనదేశంలో మధ్యతరగతిగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో అమలవుతోన్న ఆర్థిక, రాజకీయ సంస్కరణలకు అనుగుణంగా ఆశించిన ప్రయోజనాలను సాధిస్తే.. అల్పాదాయ వర్గాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని ప్రైస్ నివేదిక అంచనా వేస్తోంది. మధ్యతరగతితోపాటు సంపన్నుల శాతం కూడా భారీగా పెరుగుతోందని ప్రైస్ ఎండీ, సీఈవో రాజేశ్ శుక్లా తెలిపారు.
Also read: Godwit Bird Record : 11 రోజుల్లో నాన్–స్టాప్‌గా 13,558 కిలోమీటర్ల ప్రయాణం
మహారాష్ట్ర టాప్...
దేశంలో మహారాష్ట్ర సంపన్న రాష్ట్రంగా అవతరించింది. 2021లో ఏడాదికి రూ.2 కోట్లకు పైగా ఆర్జిస్తున్న కుటుంబాలు అక్కడ 6.4 లక్షలున్నాయి. 1.81 లక్షల సంపన్న కుటుంబాలతో ఢిల్లీ రెండోస్థానాన్ని ఆక్రమించింది. గుజరాత్ 1.41 లక్షల కుటుంబాలతో మూడోస్థానంలో, తమిళనాడు 1.37 లక్షల కుటుంబాలతో నాలుగోస్థానంలో, పంజాబ్ 1.01 లక్షల కుటుబాలతో ఐదో స్థానంలో నిలిచింది. దేశంలో అత్యంత సంపన్నులుగా పరిగణించే ‘సూపర్‌రిచ్’ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నట్టు ఈ సర్వేతెలిపింది. 1994–95లో 98వేల కుటుంబాలు మాత్రమే సూపర్‌రిచ్ ఉండగా, 2020–21 నాటికి ఈ కుటుంబాల సంఖ్య 18 లక్షలకు చేరుకుంది. సూరత్, నాగ్‌పూర్‌లలో ఈ అత్యధిక ఆదాయ వర్గాల వృద్ధి ఎక్కువగా ఉండడం విశేషం.
Also read: Quiz of The Day (November 03, 2022): భారతదేశంలో పొగాకును ప్రవేశపెట్టింది?
మిడిల్‌క్లాస్ విశ్లేషణ సంక్షిష్టమే...
మనదేశంలో మధ్యతరగతి వర్గీకరణ, విశ్లేషణ కొంత సంక్లిష్టమైనదే. ఈ కేటగిరిలో ఎవరిని, ఏ ప్రాతిపదికన చేర్చాలనే దానిపైనా భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో ఏడాదికి రూ.1.25 లక్షల లోపు ఆదాయమున్న వారిని అల్పాదాయవర్గంగా, ఏడాదికి రూ.5లక్షల నుంచి 30 లక్షల మధ్య సంపాదించే వారిని మధ్యతరగతిగా, ఏడాదికి రూ.2 కోట్లకు పైగా ఆర్జించే వారిగా సంపన్నులుగా అంచనా వేసినట్టు రాజేశ్ శుక్లా తెలిపారు. కొనుగోలు శక్తిని బట్టి ఈ వర్గీకరణ చేశారు. అల్పాదాయ వర్గాల కుటుంబాలు కార్లు కొనుగోలు చేయకపోవడం, అల్పాదాయ–మధ్యతరగతిల మధ్యనున్న ‘అస్పైరర్’ వర్గం కొంతశాతం ఏదో ఒక వాహనాన్ని కొనుగోలు చేశాయి. మధ్యతరగతిలోనే రూ.5లక్షల నుంచి 15 లక్షల మధ్యనున్న ‘సీకర్స్’ కేటగిరిలోని ప్రతి పది కుటుంబాల్లో, 3 కుటుంబాలకు కార్లున్నాయి. ‘కరోడ్‌పతి’ కేటగిరీలో ఉన్న కుటుంబాల్లో అన్నింటికి... మూడు కార్లున్నాయి. అదే తరహాలో అల్పాదాయ కుటుంబాలకు ఏసీలు లేకపోగా, ‘అస్పైరర్’లో వందలో రెండు శాతానికి, సూపర్‌రిచ్ కుటుంబాలకు ఏసీలు కలిగి ఉన్నట్లు ఈ సర్వే పేర్కొంది.
Also read: Mangarh Dham : ఇక జాతీయ స్మారక చిహ్నం
ప్రైస్ సర్వే గణాంకాలు
కేటగిరీ | కుటుంబాలు | జనాభా | ఆదాయం | ఖర్చు | ఆదా |
సంపన్నులు | 3 % | 4% | 23% | 17% | 43% |
మధ్యతరగతి | 30 | 31 | 50 | 48 | 56 |
అసై్పరర్స్ | 52 | 52 | 25 | 32 | 01 |
అల్పాదాయవర్గం | 15 | 13 | 02 | 03 | 00 |
FIBAC 2022: ఆర్థిక వ్యవస్థ పతనాన్ని అడ్డుకున్నాం : RBI గవర్నర్ శక్తికాంతదాస్
ముంబై: ముంబైలో జరిగిన ఎఫ్‌ఐబీఏసీ సమావేశంలో భాగంగా శక్తికాంతదాస్ తన అభిప్రాయాలను వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థను బలమైన, సుస్థిర, ఆశావాదంగా ప్రపంచం చూస్తున్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం ఇప్పుడిక మోస్తరు స్థాయికి దిగొస్తుందన్నారు. ద్రవ్యోల్బణం విషయంలో విరుద్ధమైన అంశాలను కూడా చూడాల్సి ఉంటుందని, ముందస్తుగానే రేట్లను కట్టడి చేయడం వృద్ధికి విఘాతాన్ని కలిగిస్తుందన్న వాస్తవాన్ని గుర్తించాలని దాస్ సూచించారు. ‘‘అలా చేస్తే ఆర్థిక వ్యవస్థ, దేశ పౌరులకు భారంగా మారి ఉండేది. భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేది’’అని దాస్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థను సురక్షిత స్థానానికి చేర్చాల్సి ఉందంటూ, అటువంటి తరుణంలో కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు అవరోధం కలిగించరాదన్నారు. ‘‘కరోనా సమయంలో ద్రవ్యోల్బణం నిర్ధేశిత లక్ష్యం 2–6 శాతం పరిధిలో కొంచెం పెరిగినా పర్వాలేదనే విధంగా ఆర్‌బీఐ సులభతర మానిటరీ పాలసీ చర్యలను అనుసరించింది. ఆర్థిక వృద్ధికి మద్దతుగా ఇలా చేసింది. దీంతో 2021–22, 2022–23లో ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంది’’అని వివరించారు.
Also read: Indian Exim Bank : ఆఫ్రికాకు ఆశాకిరణం భారత్
ప్రభుత్వానికి నివేదిక
ఆర్‌బీఐ ఎంపీసీ గురువారం (ఈ నెల 3న) నాటి సమావేశం ఎజెండాను శక్తికాంతదాస్ వెల్లడించారు. ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంలో ఎందుకు విఫలమైందనే, కారణాలపై చర్చించి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు చెప్పారు. వరుసగా తొమ్మిది నెలల పాటు ద్రవ్యోల్బణం 6 శాతానికి పైనే కొనసాగడానికి దారితీసిన కారణాలను వివరించనున్నట్టు తెలిపారు. వ్యవసాయ రంగ రుణాల ప్రయోగాత్మక డిజిటైజేషన్‌పై దాస్ స్పందిస్తూ.. చిన్న వ్యాపార రుణాలకు సైతం 2023 నుంచి ఇదే విధానాన్ని అనుసరించాలని అనుకుంటున్నట్టు చెప్పారు.
Also read: 2022 డిసెంబర్ లో IHW - 22 సదస్సు
Digital Rupee: ఈ–రూపాయిపై పరీక్షలు మొదలు
టోకు (హోల్‌సేల్) మాదిరే రిటైల్ విభాగంలో ఈ–రూపాయిపై ప్రయోగాత్మక పరీక్షలు ఈ నెల చివరిలోపు మొదలవుతాయని శక్తికాంతదాస్ ప్రకటించారు. కొన్ని బ్యాంకుల ద్వారా హోల్‌సేల్ విభాగంలో ఈ–రూపాయి వినియోగంపై పరీక్షలు నవంబర్ 1న మొదలు కావడం గమనార్హం. సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ/ఈ–రూపాయి)ని విడుదల చేయడం దేశ కరెన్సీ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోతుందని దాస్ పేర్కొన్నారు. వ్యాపార నిర్వహణ విధానాన్ని పూర్తిగా మార్చేస్తుందన్నారు. రూపాయి విలువ క్షీణతను భావోద్వేగాల కోణం నుంచి బయటకి వచ్చి చూడాలన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి రూపాయి క్రమపద్ధతిలోనే చలించిందని చెప్పారు. తద్వారా దీనిపైపై విమర్శలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇతర పెద్ద కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువ క్షీణత తక్కువగా ఉన్నట్టు చెప్పారు. యూఎస్ డాలర్ మినహా మిగిలిన కరెన్సీలతో బలపడినట్టు గుర్తు చేశారు.
Also read: EPS నుంచీ డబ్బు తీసుకోవచ్చు
CBDCతో ప్రయోజనాలు..: ప్రస్తుతం పేపర్ రూపంలో ఉన్న కరెన్సీ నోట్లను ఆర్‌బీఐ ముద్రించి, వ్యవస్థలోకి జారీ చేస్తుంది. ఇలా పేపర్ రూపంలో కాకుండా డిజిటల్ రూపంలో అధికారికంగా జారీ చేసే కరెన్సీని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీగా (సీబీడీసీ) వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పేటీఎం, గూగుల్‌పే వంటి యాప్స్ ద్వారా డిజిటల్ రూపంలో చెల్లించగలుగుతున్నప్పటికీ, ఇందుకోసం వివిధ బ్యాంకుల్లో ఖాతాలు, వాటిలో భౌతికమైన నోట్ల నిల్వలు తప్పనిసరిగా అవసరమవుతోంది. లావాదేవీల సెటిల్మెంట్ రెండు బ్యాంకుల మధ్య, ఆర్‌బీఐ దగ్గర జరగాల్సి ఉంటోంది. అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తి సెటిల్మెంట్‌లో అంతరాయాలు ఏర్పడటంతో పాటు ఈ విధానం కొంత ఖర్చుతో కూడినది. సీబీడీసీ విధానంలో థర్డ్ పార్టీ బ్యాంకు ఖాతాల ప్రస్తావన, అవసరం లేకుండా నేరుగా ఆర్‌బీఐ నిర్వహించే ఖాతాల ద్వారా డిజిటల్ రూపంలో లావాదేవీల సెటిల్మెంట్ పూర్తయిపోతుంది. దీనితో సమయం, వ్యయాలూ ఆదా అవుతాయి. అలాగే ప్రత్యేకంగా పేపర్ కరెన్సీని ముద్రించాల్సిన వ్యయాల భారమూ ఆర్‌బీఐకి కొంత తగ్గుతుంది. డిజిటల్ రూపంలో ఉంటుంది కాబట్టి భౌతిక రూపంలోని నగదు చోరీ భయాలు ఉండవని పరిశీలకుల విశ్లేషణ. అంతే గాకుండా ప్రభుత్వ పథకాల నిధులను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఆర్‌బీఐ ద్వారా లబ్ధిదారులకు చేర్చేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని అంచనా. సీబీడీసీ అనేది పేపర్ రూపంలోని కరెన్సీ నోట్లకు బదులు కాకుండా చెల్లింపు విధానాలకు మరో ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది.
Also read: Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 1st కరెంట్ అఫైర్స్
అంతర్జాతీయంగా..
2022–23లో డిజిటల్ రూపీని అందుబాటులోకి తేనున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించినప్పటి నుండి సీబీడీసీ ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. అటు అంతర్జాతీయంగా పలు దేశాలు సీబీడీసీల జారీ సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నాయి. దాదాపు 90 పైగా సెంట్రల్ బ్యాంకులు వీటిని అధ్యయనం చేస్తున్నాయి. బహమాస్, నైజీరియా, డొమినికా వంటి కొన్ని దేశాలు ఇప్పటికే సీబీడీసీలను ప్రవేశపెట్టాయి.
Also read: Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 2nd కరెంట్ అఫైర్స్
Federal Reserve: ఆరోసారి వడ్డీ 0.75 శాతం పెంపు
న్యూయార్క్: ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్ల పెంపును చేపట్టింది. రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ రిజర్వ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) ద్రవ్యోల్బణ కట్టడే ప్రధాన ఎజెండాగా వరుసగా ఆరోసారి ఫండ్స్ రేట్లను పెంచింది. తాజాగా 0.75 పెంపును ప్రకటించింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 3.75–4 శాతానికి చేరాయి. దీంతో వరుసగా నాలుగోసారి 0.75 శాతం చొప్పున రేట్లను పెంచినట్లయ్యింది. ఈ ఏడాది(2022) ఇప్పటివరకూ ఎఫ్‌వోఎంసీ వడ్డీ రేట్లను 3.75 శాతం హెచ్చించింది. ద్రవ్యోల్బణం గత 40 ఏళ్లలోలేని విధంగా 8 శాతాన్ని అధిగమించడంతో ఫెడ్ ధరల కట్టడికి అత్యంత కీలకమైన వడ్డీ రేట్ల పెంపు మార్గాన్ని ఎంచుకుంది. తాజాగా సెపె్టంబర్‌లోనూ వినియోగ ధరల ఇండెక్స్ 8.2 శాతాన్ని తాకింది.
Also read: ITR : అందరికీ ఒక్కటే ఐటీఆర్ ఫామ్
Twitter: ఇక అమ్మకానికి ట్విట్టర్ ‘బ్లూ టిక్’
న్యూయార్క్: ట్విట్టర్‌లో యూజర్ నేమ్ అధికారికమైనది, ప్రముఖమైనదని నిర్ధారించే వెరిఫికేషన్ బ్లూ టిక్ కోసం ఇక నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందే. సంస్థ కొత్త బాస్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (51) తీసుకున్న ఈ మేరకు ప్రకటించారు. ‘‘ప్రజలకు అధికారం! బ్లూ టిక్‌కు నెలకు 8 డాలర్లు’’ అంటూ నవంబర్ 1న ఆయన ట్వీట్ చేశారు. ఈ చార్జీ కొనుగోలు శక్తి ప్రాతిపదికగా ఒక్కో దేశానికి ఒక్కోలా ఉంటుందని చెప్పుకొచ్చారు. ‘‘బ్లూ టిక్ యూజర్లకు ఇకపై రిప్లైలు, మెన్షన్లు, సెర్చ్‌ల్లో జర్లకు మరింత ప్రయారిటీ దక్కుతుంది. స్పామ్‌లు, స్కామ్‌ల బెడద తగ్గడమే గాక పెద్ద వీడియోలు, ఆడియోలు పోస్ట్ చేసుకోవచ్చు. యాడ్లు సగానికి తగ్గుతాయి’’ అంటూ తాను కల్పించబోయే సౌకర్యాలను ఏకరువు పెట్టారు. ఇకనుంచి రాజకీయ నాయకుల మాదిరిగా ఇతర ప్రముఖులకు కూడా పేరు కింద సెకండరీ ట్యాగ్ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. కానీ ఆయన తాజా నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది వ్యాపార ధోరణికి పరాకాష్ట అంటూ యూజర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ‘‘బ్లూ టిక్ కొనసాగాలంటే ఇకపై నేను నెలకు 20 డాలర్లు చెల్లించాలా? ఏమన్నా అర్థముందా?’’ అంటూ 70 లక్షల మంది ఫాలోవర్లున్న రచయిత స్టీఫెన్ కింగ్ అసంతృప్తి వెలిబుచ్చారు. నిజానికి ట్విట్టరే తనకు ఎదురు డబ్బులు చెల్లించాలంటూ ట్వీట్ చేశారు. బదులుగా మస్క్ కూడా, ‘‘మేం కూడా బిల్లులు చెల్లించాలిగా! కేవలం ప్రకటనలపై ఆధారపడి సంస్థను నడపలేం’’ అంటూ ట్వీట్ చేశారు. ‘‘ఎవరైనా యూజర్ 8 డాలర్లు చెల్లించి తన డిస్‌ప్లే నేమ్‌ను ఎలాన్ మస్క్ అని మార్చుకుని నీ ప్రొఫైల్ పిక్‌నే పెట్టుకుని అచ్చం నీలా ట్వీట్లు చేయడం మొదలు పెడితే అప్పుడేం చేస్తావ్?’’ అంటూ రుబియూ5 అనే యూజర్ మస్క్‌ను ప్రశ్నించాడు. కానీ మస్క్ మాత్రం తగ్గేదే లేదని కుండబద్దలు కొట్టారు. ‘‘ఎవరెన్ని విమర్శలైనా చేయండి. నెలకు 8 డాలర్లు మాత్రం కట్టి తీరాల్సిందే’’ అంటూ ట్వీట్ చేశారు. ట్విట్టర్ తన చేతుల్లోకి వస్తూనే సీఈఓ పరాగ్ అగర్వాల్, లీగల్ హెడ్ విజయ గద్దెతో పాటు మరో ఇద్దరు అత్యున్నతాధికారులను వివాదాస్పద రీతిలో మస్క్ ఇంటికి పంపడం తెలిసిందే. నకిలీ ఖాతాల బెడదను నివారించేందుకు ట్విట్టర్ సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శల నేపథ్యంలో 2009లో బ్లూ టిక్‌ను సంస్థ ప్రవేశపెట్టింది.
Also read: Twitter : కొనుగోలు చేసిన ఎలెన్ మస్క్
Global Investors' Meet 2022: ప్రపంచం ఆశలన్నీ భారత్‌పైనే జీఐ సదస్సులో మోదీ వ్యాఖ్యలు
బనశంకరి: ‘‘మిగతా ప్రపంచమంతా నానా సంక్షోభాల్లో చిక్కిన వేళ భారత్ మాత్రమే అన్ని రంగాల్లోనూ దూసుకుపోతూ అతి పెద్ద ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఆర్థికవేత్తలంతా ముక్త కంఠంతో చెబుతున్న విషయమిది. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా మన దేశంపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విధాన స్థాయిలో విపరీతమైన అలసత్వం, నిర్ణయాల్లో అయోమయం వంటివాటికి బీజేపీ హయాంలో పూర్తిగా తెర దించి పెట్టుబడులకు ఎర్రతివాచీ పరచడం వల్లే ఇదంతా సాధ్యమైందని చెప్పారు.నవంబర్ 2న బెంగళూరులో మొదలైన మూడు రోజుల ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు, ఇన్వెస్ట్ కర్నాటక–2022ను ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘‘గతేడాది భారత్‌కు రికార్డు స్థాయిలో ఏకంగా 8,400 కోట్ల డాలర్ల మేరకు ఎఫ్‌డీఐలు వచ్చాయి. ప్రపంచాన్ని కమ్మేసిన కరోనా కల్లోలం, ఉక్రెయిన్ యుద్ధ భయాల వేళ ఇది చాలా పెద్ద ఘనత. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లన్నీ ఒడిదొడుకులమయంగా సాగుతున్నాయి. కానీ భారత్ మాత్రం ఆర్థికంగా అద్భుతాలు చేసి చూపుతోంది. మన ఆర్థిక వ్యవస్థ పునాదులు అత్యంత పటిష్టంగా ఉండటమే ఇందుకు కారణమని ప్రపంచమంతా విశ్వసిస్తోంది. ఇటీవలి కాలంలో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు మన సన్నద్ధత స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పాయి’’ అన్నారు.
Also read:PM Modi : మన ఉక్కు పరిశ్రమ శక్తికి ఐఎన్‌ఎస్ విక్రాంతే తార్కాణం
వహ్వా కర్నాటక!
పదేళ్ల క్రితం దాకా భారత్‌లో పరిస్థితి పూర్తి చాలా నిరాశాజనకంగా ఉండేదని మోదీ అన్నారు. ‘‘మేమొచ్చాక యువతకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చి ప్రోత్సహించాం. సాహసోపేతమైన సంస్కరణలు, భారీ మౌలిక వ్యవస్థలు, అత్యున్నత నైపుణ్యాల కలబోతగా నూతన భారత నిర్మాణం సాధ్యపడింది. సంప్రదాయేతర ఇంధన రంగంలో భారత విజయాలు ప్రపంచమంతటికీ ఉదాహరణగా నిలిచాయి. కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ ప్రభుత్వాలుండటం వల్ల కర్నాటకకూ డబుల్ ఇంజన్ సామర్థ్యం సమకూరింది. ఫలితంగా చాలా రంగాల్లో రాష్ట్రం అగ్రస్థానంలో దూసుకుపోతోంది. పరిశ్రమల నుంచి ఐటీ, బయోటెక్, స్టార్టప్‌లు, ఇంధన రంగాల దాకా రికార్డు స్థాయి ప్రగతి చరిత్రను లిఖిస్తూ తోటి రాష్ట్రాలకే గాక పలు ఇతర దేశాలకు కూడా సవాలు విసులుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ, టెక్నాలజీ గురించి ఎక్కడ ప్రస్తావన వచ్చినా మొట్టమొదట గుర్తొచ్చేది ‘బ్రాండ్ బెంగళూరు’’ అని కొనియాడారు. ‘బిల్డ్ ఫర్ ద వరల్డ్’ నినాదంతో సదస్సును నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
Also read: Rozgar Mela: 10 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి: ప్రధాని మోదీ
3,024 కొత్త ఫ్లాట్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఎలా ఉండాలన్న అంచనాలన్నింటినీ అందుకునేలా అన్ని సదుపాయాలతో ఢిల్లీని తీర్చిదిద్దుతున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆర్థికంగా వెనకబడ్డ వర్గాల కోసం నిర్మించిన 3,024 కొత్త ఫ్లాట్లను మోదీ బుధవారం ప్రారంభించారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ చేసిందేమీ లేకపోయినా లేని గొప్పలను చెప్పుకుంటూ ప్రచారంపై భారీగా ఖర్చు పెడుతోందంటూ ఎద్దేవా చేశారు. ఆ లెక్కన ఇన్ని పనులు చేస్తున్న తాము ఇంకెంత ప్రచారం చేసుకోవాలని లబ్దిదారులనుద్దేశించి ప్రశ్నించారు. ‘‘మాది పేదల ప్రభుత్వం. ఢిల్లీ అభివృద్ధికి నిత్యం పాటుపడుతున్నాం. ఢిల్లీ మెట్రోను 190 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్లకు విస్తరించాం. చుట్టుపక్కల హైవేలను తీర్చిదిద్దాం. మరెన్నో మౌలిక సదుపాయాలు కల్పించాం’’ అని చెప్పారు.
Also read: Arogyasri 2.0 : రెట్టింపు భరోసా - ఇక 3,255 చికిత్సలకు వర్తింపు
హక్కుల నేత, పద్మభూషణ్ గ్రహీత 'ఇలా భట్' అస్తమయం
అహ్మదాబాద్: మహిళా హక్కుల ఉద్యమకారిణి, సెల్ఫ్ ఎంప్లాయ్‌డ్ విమెన్స్ అసోసియేషన్ (సేవా) వ్యవస్థాపకురాలు ఇలా భట్ (89) నవంబర్ 2న అహ్మదాబాద్‌లో వయో సంబంధ సమస్యలతో కన్నుమూశారు. పద్మభూషణ్ గ్రహీత అయిన ఆమె మహిళా సాధికారికత సాధనకు ఎనలేని కృషి చేసి అంతర్జాతీయ గుర్తింపు పొందారు. అసంఘటిత రంగ మహిళా కార్మిక సంఘం సేవాలో ప్రస్తుతం 20 లక్షల మంది సభ్యులున్నారు. ఇలా భట్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 1933లో జన్మించారు. కొద్ది కాలం పాటు టీచర్‌గా పనిచేశారు. అనంతరం అహ్మదాబాద్ వస్త్ర కార్మిక సంఘం న్యాయ విభాగంలో చేరారు. వస్త్ర రంగంలో పనిచేసే మహిళల కోసం 1972లో సేవాను నెలకొల్పారు. తర్వాత ఇతర రంగాలకూ విస్తరించింది. సేవా ఆధ్వర్యంలో సహకార బ్యాంకు స్థాపన, సూక్ష్మ రుణ ఉద్యమం మొదలయ్యాయి. ఉమెన్స్ వరల్డ్ బ్యాంకింగ్ వ్యవస్థాపకుల్లో ఈమె ఒకరు. గాంధీ సిద్ధాంతాలను ఆచరించే ఇలా భట్ మహాత్ముడు నెలకొల్పిన గుజరాత్ విద్యాపీఠ్‌కు చాన్స్‌లర్‌గా ఈ ఏడాది అక్టోబర్ వరకు కొనసాగారు. రాజ్యసభ సభ్యురాలిగా, ప్రణాళికా సంఘం సభ్యురాలిగాను ఆమె పనిచేశారు. రామన్ మెగసెసె, రైట్ లైవ్లీహుడ్, నివానో శాంతి బహుమతి, ఇందిరాగాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతి అందుకున్నారు. ఆమెకు అమిమాయి, మిహిర్ అనే ఇద్దరు సంతానం ఉన్నారు.
Korean Missile: కొరియాల క్షిపణి పరీక్షలు
సియోల్: కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. దక్షిణకొరియా, అమెరికాలు చేపట్టిన భారీ వైమానిక విన్యాసాలపై గుర్రుగా ఉన్న ఉత్తరకొరియా రెచ్చిపోయింది. నవంబర్ 2న ఒక్క రోజే 23 క్షిపణులను ప్రయోగించింది. ఇందులో ఒక క్షిపణి ఉభయ కొరియాల సరిహద్దులకు సమీపంలోకి దూసుకెళ్లింది. ఈ పరిణామంతో అప్రమత్తమైన దక్షిణ కొరియా రెడ్ అలెర్ట్ ప్రకటించి, ముందు జాగ్రత్తగా పౌరులను భూగర్భ షెల్టర్లలోకి తరలించింది. పలు క్షిపణులను సరిహద్దులకు సమీపంలోకి ప్రయోగించి దీటుగా స్పందించింది.
Israel elections: చారిత్రక విజయం దిశగా నెతన్యాహు పార్టీ
జెరుసలేం: ఇజ్రాయెల్‌లో తాజా ఎన్నికల్లో మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(73) సారథ్యంలోని సంకీర్ణ కూటమి చరిత్రాత్మక విజయం దిశగా సాగుతోంది. వామపక్ష మెరెట్జ్ పార్టీ గట్టి పోటీ ఇస్తున్నా 85 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికే 120 మంది సభ్యుల పార్లమెంట్‌లో 65 సీట్లు నెతన్యాహు కూటమికి దక్కేలా కనిపిస్తున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాక గత నాలుగేళ్లలో దేశంలో ఏకంగా ఐదుసార్లు ఎన్నికలు జరిగాయి. తాజా ఫలితాలతో రాజకీయ సందిగ్ధానికి తెరపడనుంది. నెతన్యాహు కూటమికి 65 వరకు సీట్లు దక్కుతాయని ఎగ్జిట్ పోల్స్‌లోనూ వెల్లడైంది. ఈ కూటమిలో నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ, యూదు మతవాద పార్టీలు ఉన్నాయి.
IN COME-17': మిశ్రధాతువులపై దృష్టిపెట్టాలి: రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీశ్ రెడ్డి
క్షిపణి, వైమానిక వ్యవస్థల్లో బరువును తగ్గించడం చాలా కీలకమైన విషయం కాబట్టి..ఆ పని చేయగల మిశ్రధాతువులను అభివృద్ధి చేసేందుకు పరిశోధన సంస్థలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మిశ్రధాతువుల తయారీ, పరిశోధనల రంగాల్లోని తాజా పరిణామాలను చర్చించే లక్ష్యంతో మంగళవారం మొదలైన ‘ఇన్ కామ్ –17‘ సదస్సు ముఖ్యఅతిథిగా వీడియో ద్వారా సతీశ్ రెడ్డి మాట్లాడుతూ...రక్షణవ్యవస్థ శక్తి సామర్థ్యాల విషయంలో రాజీ పడకుండానే కొత్త మిశ్రధాతువుల అభివృద్ధి చేయాలని కోరారు. అదే సమయంలో కొత్త మిశ్రధాతువులు పర్యావరణ అనుకూలంగానూ ఉండేలా చూసుకోవాలని సూచించారు.
Also read: Kaleshwara Project : 2 కొత్త కంట్రోల్ రూమ్స్
225 టన్నుల బయోప్లాస్టిక్ ఉత్పత్తి...
డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన బయో ప్లాస్టిక్ టెక్నాలజీ ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరికీ అందు బాటులో ఉందని..ఇప్పటికే 25 కంపెనీలద్వారా సుమారు 225 టన్నుల ఉత్పత్తి జరుగుతోందని ఇన్ కామ్ 17 ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ వీరబ్రహ్మం వెల్లడించారు. మరో 45 కంపెనీలు ఈ టెక్నాలజీ కోసం దరఖాస్తు చేసుకున్నాయని తెలిపారు. కార్యక్రమంలో డీజీ ఎంఎస్‌ఎస్ డాక్టర్ బీవీహెచ్ ఎస్ మూర్తి, షార్ డైరెక్టర్ డాక్టర్ రాజరాజన్ తదితరులు పాల్గొన్నారు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP