Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 2nd కరెంట్ అఫైర్స్
Indian Exim Bank : ఆఫ్రికాకు ఆశాకిరణం భారత్
ఆఫ్రికా దేశాలు తమ నౌకా, వైమానిక, రక్షణ ఉపకరణాలు సమకూర్చుకునేందుకు భారత్‌పైనే ఆధారపడ్డాయని ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ ‘రీఇన్విరోగేటింగ్ ఇండియాస్ ఎకనమిక్ ఎంగేజ్‌మెంట్స్ విత్ సదరన్ ఆఫ్రికా’ నివేదికలో స్పష్టంచేసింది. ‘ 2017–2021 కాలంలో మారిషస్, మొజాంబిక్, సీషెల్స్ వంటి ఆఫ్రికా దేశాల కీలక రక్షణ అవసరాలు తీర్చడంలో భారత్ పెద్దదిక్కుగా మారింది. భారత ఆయుధాలను ఈ దేశాలు భారీమొత్తంలో కొన్నాయి. ఉత్పత్తి సామర్థ్యం పెంపు, మానవతా సాయం, వేరే దేశ సైన్యానికి శిక్షణ అంశాలపైనా భారత్ దృష్టిసారించాలి. అప్పుడే 2025 కల్లా 5 బిలియన్ డాలర్ల రక్షణ ఉత్పత్తుల ఎగుమతి సామర్థ్య లక్ష్యాన్ని భారత్ సాకారం చేసుకోగలదు. ఇందులో రక్షణ ఉత్పత్తుల తయారీసంస్థలైన టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ తమ వంతు భాగస్వామ్య పాత్ర పోషిస్తున్నాయి. ఇక, కొత్త తరం స్వదేశీ సాంకేతికతల సాయంతో నావికారంగంలో మానవరహిత జలాంతర్గత వ్యవస్థలు, డ్రోన్లను అభివృద్ధిచేయాలి’ అని నివేదిక పేర్కొంది. జోహన్నస్‌బర్గ్‌లో భారత్–దక్షిణాఫ్రికా దేశాల అభివృద్ధి భాగస్వామ్యం కోసం సీఐఐ–ఎగ్జిమ్ బ్యాంక్ ప్రాంతీయ సదస్సును నిర్వహించాయి. సదస్సులో ఈ నివేదికను ఆవిష్కరించారు. హిందూ సముద్ర ప్రాంత భద్రత, రక్షణలో భారత్, ఆఫ్రికా దేశాల పాత్ర కీలకమైనదని నివేదిక శ్లాఘించింది. సైబర్ సెక్యూరిటీలోనూ దేశాల పరస్పర సహకారం ప్రధానమని సూచించింది. ఈ సదస్సులో పలు ప్రభుత్వాల ఉన్నతాధికారులు, పరిశ్రమల, వ్యాపార సంస్థల అధినేతలు పాల్గొని ఏఏ అంశాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పటిష్టంచేసుకోవాలో చర్చించారు.
Also read: Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 1st కరెంట్ అఫైర్స్
Mangarh Dham : ఇక జాతీయ స్మారక చిహ్నం
మాన్‌గఢ్ ధామ్‌ను జాతీయ స్మారక చిహ్నంగా కేంద్రం ప్రకటించింది. మాన్‌గఢ్‌లో నవంబర్ 1న జరిగిన కార్యక్రమంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ ముఖ్యమంత్రుల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ ప్రాంత అభివృద్ధికి రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర సీఎంలు రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే ఈ ప్రాంతానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందన్నారు. ‘‘మాన్‌గఢ్ ధామ్‌ను మరింతగా విస్తరించడానికి అభివృద్ధి చేయాలని మనందరికీ బలమైన కోరిక ఉంది. నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చించుకొని ఒక రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయండి’’ అని ప్రధాని అన్నారు. ఈ ధామ్‌ని అభివృద్ధిని చేస్తే కొత్త తరంలో స్ఫూర్తిని నింపిన వాళ్లమవుతామని ప్రధాని వ్యాఖ్యానించారు.
Also read: UNSC: ఉగ్ర ‘టూల్‌కిట్’లో సోషల్ మీడియా
ఆదివాసీల ప్రాబల్యమున్న మాన్‌గఢ్ ప్రాంతమది. బ్రిటిష్ పాలనలో రక్తమోడింది. జలియన్‌వాలాబాగ్ ఘటనకి ఆరేళ్ల ముందు ఇక్కడ తెల్లదొరలు మారణహోమం సాగించి అక్షరాలా 1500 మంది ఆదివాసీల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. ఈ దారుణానికి చరిత్రలో అంతగా గుర్తింపు లభించలేదు. ఈ ప్రాంతం రాజస్థాన్‌లోని బన్‌స్వారా జిల్లాలో గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది. సంఘ సంస్కర్త గోవింద్ గురు 1913లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీలను ఉత్తేజపరిచారు. ఈ ప్రాంతంలో నివసించే గిరిజనుల్ని భిల్ అని పిలుస్తాను. వీరు విలువిద్యలో ఆరితేరినవారు. బానిసత్వ వ్యవస్థ, పన్నుల భారాన్ని నిరసిస్తూ గోవింద్ గురు ఇచి్చన పిలుపుతో గిరిజనులు ఉద్యమించారు. 1913 నవంబర్ 17న బ్రిటీష్ సైనికుల విచక్షణారహిత కాల్పుల్లో 1500 మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు.
Also read: One Nation One Uniform : పోలీసులకి ఒకే యూనిఫాం ఉండాలి : మోదీ
ఒక్క దెబ్బకు మూడు రాష్ట్రాలు
మాన్‌గఢ్ ధామ్‌ను నేషనల్ మాన్యుమెంట్‌గా ప్రకటించడం వెనుక ఆదివాసీల ఓట్లను ఆకర్షించే రాజకీయం దాగుంది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో గిరిజనులు మాన్‌గఢ్ ప్రాంతాన్ని అత్యంత పవిత్రమైన స్థలంగా భావిస్తారు. ఇక్కడ రాజకీయ లబ్ధికి బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. డిసెంబర్లో గుజరాత్, వచ్చే ఏడాది మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీలకు ఎన్నికలున్న నేపథ్యంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఇప్పటికే ఈ ప్రాంతాన్ని జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలంటూ ప్రధానికి రెండు లేఖలు రాశారు. ఆదివాసీల సంక్షేమం కోసం పని చేసే భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) నాలుగు రాష్ట్రాల్లోని 39 జిల్లాల్లో భిల్ ఆదివాసీల ప్రాంతాలతో ప్రత్యేక భిల్ ప్రదేశ్ ఏర్పాటు చేయాలని గళమెత్తుతోంది. గుజరాత్‌లో 16, రాజస్థాన్‌లో 10, మధ్యప్రదేశ్‌లో ఏడు, మహారాష్ట్రలో ఆరు జిల్లాలను కలిసి భిల్ ప్రదేశ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. రాజస్థాన్ జనాభాలో గిరిజనులు 13.48%, గుజరాత్‌లో 14.8%, మధ్యప్రదేశ్‌లో 21.1%, మహారాష్ట్రలో 9.35% ఉన్నారు. రాజస్థాన్‌లో 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భిల్ ఆదివాసీలు అధికంగా ఉన్నారు. ప్రస్తుతం వాటిలో కాంగ్రెస్ 13, బీజేపీ 8, బీటీపీ, స్వతంత్రులు చెరొక స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా 27 సీట్లలో 13 బీటీపీ నెగ్గింది.
Also read: PM Narendra Modi: దేశ రక్షణలో దీసా స్థావరం కీలకం
7th Indian Water Week: జల సంరక్షణపై శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి సూచనలు
దేశంలోని నీటి వనరుల పరిరక్షణకు అవసరమైన సాంకేతికతలను అభివృద్ధి చేయాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. దేశ జల భద్రతలో సాంకేతికత కీలక పాత్ర పోషించనుందని ఆమె అన్నారు. ఏడో విడత ‘ఇండియా వాటర్ వీక్’ను పురస్కరించుకుని శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, పట్టణ ప్రణాళిక అధికారులతో నవంబర్ 1న జరిగిన సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ‘దేశ జనాభా పెరుగుతోంది. జలాశయాలు, నదుల్లో నీటి లభ్యత తగ్గుతోంది. గ్రామాల్లో చెరువులు ఎండిపోతున్నాయి. స్థానిక నదులు కనుమరుగవుతున్నాయి. జల భద్రత ఆందోళనకరంగా మారింది’ అన్నారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సమాజంలోని అన్ని వర్గాల సహకారంతో శుద్ధమైన నీటిని ప్రజలకు అందించడం సవాలుగా మారిందని ముర్ము చెప్పారు. ‘దేశంలోని జలవనరుల్లో 80% వరకు వ్యవసాయ అవసరాలకే వాడుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో నీటి సది్వనియోగం, సాగు నీటి నిర్వహణ చాలా కీలకం’అని రాష్ట్రపతి చెప్పారు. ముఖ్యంగా చిన్నారులు నీటిని పొదుపుగా వాడుకోవడం నిత్య జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని కోరారు.
Also read: Supreme Court: స్థానిక సహకార సంఘాలకు 97వ రాజ్యాంగ సవరణ వర్తించదు
ITR : అందరికీ ఒక్కటే ఐటీఆర్ ఫామ్
ఈ పత్రంలో వర్చువల్ డిజిటల్ అసెట్స్ రూపంలో వచ్చే ఆదాయాన్ని వెల్లడించేందుకు ప్రత్యేక భాగం ఉంటుంది. ట్రస్ట్‌లు, ఎన్‌జీవోలు మినహా మిగిలిన పన్ను చెల్లింపుదారులు అందరూ నూతన ప్రతిపాదిత ఐటీఆర్‌ను ఫైల్ చేసుకోవచ్చంటూ, దీనిపై అభిప్రాయాలు తెలియజేయాలని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) భాగస్వాములను కోరింది. ఐటీఆర్–7 మినహా మిగిలిన అన్ని ఐటీఆర్‌లను విలీనం చేయాలన్నది ప్రతిపాదన. చిన్న, మధ్య స్థాయి పన్ను చెల్లింపుదారుల్లో ఎక్కువ మంది ఐటీఆర్–1, ఐటీఆర్–4 దాఖలు చేస్తుంటారు. ఇంటి రూపంలో ఆదాయం, వేతనం రూపంలో రూ.50 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు ఐటీఆర్–1 దాఖలు చేయవచ్చు. రూ.50 లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, సంస్థలు వ్యాపార ఆదాయం కూడా కలిగి ఉంటే ఐటీఆర్–4ను, వేతన లేదా వ్యాపార ఆదాయంతోపాటు మూలధన లాభాల పన్ను పరిధిలోని వారు ఐటీఆర్–2 దాఖలు చేయాలి.
Also read: EPS నుంచీ డబ్బు తీసుకోవచ్చు
GST : అక్టోబర్‌లో రూ.1.52 లక్షల కోట్లు
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు అక్టోబర్‌లో రూ.1.52 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2021 ఇదే నెలతో పోల్చితే ఈ వసూళ్లు 16.5 శాతం అధికం. ఇక ఈ స్థాయిలో వసూళ్లు జరగడం జీఎస్‌టీ చరిత్రలో రెండవసారి. ఈ ఏడాది ఏప్రిల్‌లో జీఎస్‌టీ వసూళ్లు రికార్డు స్ధాయిలో రూ.1.68 లక్షల కోట్లు నమోదుకాగా, సెప్టెంబర్‌లో ఈ విలువ రూ.1.48 లక్షల కోట్లుగా ఉంది. పండుగల సీజన్‌లో ఎకానమీ ఉత్సాహభరిత క్రియాశీలతను తాజా గణాంకాలు ప్రతిబింబిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు..
- అక్టోబర్‌లో మొత్తం రూ.1,51,718 కోట్ల వసూళ్లు జరిగాయి. ఇందులో సెంట్రల్ జీఎస్‌టీ రూ.26,039 కోట్లు. స్టేట్ జీఎస్‌టీ రూ.33,396 కోట్లు. ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ రూ.81,778 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.37,297 కోట్లుసహా). సెస్ రూ.10,505 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.10,505 కోట్లుసహా)
- జీఎస్‌టీ వసూళ్లు వరుసగా 8 నెలలుగా రూ.1.40 లక్షల కోట్లు పైబడ్డాయి. ఇందులో రెండు నెలలు రూ.1.50 లక్షల కోట్లు దాటాయి.
- 2022 సెప్టెంబర్ నెలలో 8.3 కోట్ల ఈ–వే బిల్లులు జనరేట్ ఆయ్యాయి. 2022 అక్టోబర్ నెలలో ఈ సంఖ్య 7.7 కోట్లుగా ఉంది.
2022 నుంచి ఇలా...
నెల జీఎస్‌టీ ఆదాయం (రూ.కోట్లలో)
జనవరి 2022 1,40,986
ఫిబ్రవరి 1,33,026
మార్చి 1,42,095
ఏప్రిల్ 1,67,650
మే 1,40,885
జూన్ 1,44,616
జూలై 1,48,995
ఆగస్టు 1,43,612
సెప్టెంబర్ 1,47,686
అక్టోబర్ 1,51,718
2022 డిసెంబర్ లో IHW - 22 సదస్సు
మొదటి సారిగా అంతర్జాతీయ ఇంటిగ్రేటివ్ హెల్త్ వెల్‌నెస్ (ఐహెచ్‌డబ్ల్యూ)–22 సదస్సు హైదరాబాద్‌లో జరగనుంది. హార్ట్‌ఫుల్‌నెస్, దాని సహాయక సంస్థలతో కలిసి జరిగే ఈ సదస్సు డిసెంబర్ 16–18 తేదీల్లో హార్ట్‌ఫుల్‌నెస్ ప్రధాన కార్యా లయం కన్హా శాంతివనంలో నిర్వహించనున్నా మని ఆ సంస్థ తెలిపింది. సదస్సుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ, తెలంగాణ ఉద్యానవన శాఖ, రామయ్య యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్, ఎయిమ్స్ రాయ్‌పూర్, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ మద్దతుని స్తున్నాయి. ఈ కాన్ఫరెన్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా 3 వేల మంది హాజరయ్యే అవకాశముందని వెల్లడించింది. ఇందులో వైద్యులు, నర్సు లు, అనుబంధ ఆరోగ్య సంరక్షణ నిపు ణులు, వర్ధమాన పరిశోధకులు, విద్యార్థులు, నాన్ ఫార్మాస్యూటికల్ విధానాల ఔత్సాహికులు పాల్గొంటారని వివరించింది.
Also read: Weekly Current Affairs (Awards) Bitbank: అంబేద్కర్: ఎ లైఫ్' పుస్తకం ఎవరు రాశారు?
YSR Awards 2022 : విజయవాడలో ఘనంగా పురస్కారాల ప్రదానోత్సవం
సమాజంలో మానవత్వపు పరిమళాలు, ఎల్లలు దాటిన కీర్తి పతాకాలు పురస్కారాల పండుగలో పులకించాయి. నిలువెత్తు వ్యక్తిత్వం, మహోన్నత కీర్తి శిఖరం ‘వైఎస్సార్’పురస్కారాలతో సగౌరవంగా సత్కరించి ప్రభుత్వం తన వినమ్రత చాటుకుంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మానవతామూర్తులు, విశిష్ట వ్యక్తులను వరుసగా రెండో ఏడాది రాష్ట్ర అత్యున్నత పురస్కారం ‘‘వైఎస్సార్’’అవార్డులతో ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. వ్యక్తులుగా, సంస్థలుగా సమాజంలో గొప్ప పనులు చేస్తున్న ప్రతి ఒక్కరినీ గౌరవించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డులను నెలకొల్పింది.
Also read: Awards: రాష్ట్రానికి ‘కేంద్ర హోం మినిస్టర్స్ స్పెషల్ ఆపరేషన్ మెడల్’
వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నవంబర్ 1న విజయవాడలో నిర్వహించారు. తొలుత అమరజీవి పొట్టి శ్రీరాములు, దివంగత వైఎస్సార్ విగ్రహాలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 2022 సంవత్సరానికిగానూ వ్యవసాయం, కళలు– సంస్కృతి, సాహిత్యం, మహిళా – శిశు సాధికారత, విద్య, జర్నలిజం, వైద్యం, పరిశ్రమల రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు మొత్తం 30 అవార్డులను గవర్నర్, ముఖ్యమంత్రి ప్రదానం చేశారు. వీటిల్లో 20 వైఎస్సార్ జీవిత సాఫల్య, 10 వైఎస్సార్ సాఫల్య పురస్కారాలున్నాయి. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. వైఎస్సార్ అవార్డులను నెలకొల్పడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం, అవార్డు గ్రహీతల గొప్పతనాన్ని వివరించారు.
Also read: Booker Prize : శ్రీలంక రచయిత షెహాన్ కరుణతిలకకు ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్
మన కీర్తికి సత్కారం: సీఎం జగన్
దశాబ్దాలుగా మన సంస్కృతి, సంప్రదాయాలకు వారధులుగా నిలుస్తున్న వారిని ఈ అవార్డులతో సత్కరిస్తున్నాం. సమాజం కోసం శ్రమించిన మానవతామూర్తులు, మహనీయులను రాష్ట్ర అత్యున్నత అవార్డులతో సత్కరించుకోవడం సంతోషంగా ఉంది. సామాన్యుల్లోని అసామాన్యులకు, మానవతామూర్తుల సేవలకు వందనంగా ‘వైఎస్సార్’అవార్డులు నిలుస్తాయి. తమ శ్రమ, స్వేదంతో రాష్ట్ర చరిత్రను గొప్పగా లిఖిస్తున్న రైతన్నలను ఎక్కడా లేనివిధంగా ప్రతిష్టాత్మక ‘వైఎస్సార్’అవార్డులతో ప్రభుత్వం సత్కరిస్తోంది. మహిళా రక్షణకు నిరంతరం పాటుపడే రక్షణ సారథులను, వెనుకబాటు, అణచివేత, పెత్తందారీ పోకడలపై ఎలుగెత్తిన సామాజిక ఉద్యమకారులను సవినయంగా గౌరవించుకుంటున్నాం. భిన్న కలాలు, గళాలు, పాత్రికేయులు, మన గడ్డపై పుట్టి వైద్య ఆరోగ్య రంగంలో ప్రపంచ కీర్తి గడించిన మహామహులు, అంతర్జాతీయంగా పేరొందిన మన పారిశ్రామిక దిగ్గజాలకు అవార్డులను అందజేస్తున్నాం.
Also read: వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల
Kaleshwara Project : 2 కొత్త కంట్రోల్ రూమ్స్
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన అన్నారం, మేడిగడ్డ పంప్‌హౌజ్‌లు ఇటీవల గోదావరి వరదల్లో నీటమునిగిన నేపథ్యంలో వీటికి శాశ్వ త పరిష్కారం చూపే అంశంపై రాష్ట్ర ప్రభు త్వం దృష్టిసారించింది. భవిష్యత్తులో గోదావరికి భారీ వరదలొస్తే మళ్లీ ఈ పంప్‌హౌజ్‌లు నీటమునిగే చాన్స్ ఉండడంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా వీటికి సంబంధించిన కంట్రోల్ రూమ్స్‌ను ఎత్తైన ప్రాంతంలో కొత్తగా నిర్మించాలని నిర్ణయించింది.
Also read: Standing Finance Committee: కృష్ణా నదిపై రెండంతస్తుల కేబుల్ బ్రిడ్జి
కనీసం 6 మీటర్లు ఎత్తు పెంచి...
అన్నారం, మేడిగడ్డ పంప్‌హౌజ్‌ల లోపలే వీటికి సంబంధించిన కంట్రోల్ రూమ్స్ నిర్మించారు. పంప్‌హౌజ్‌ల సర్వస్ బే ఎత్తు తక్కువగా ఉండడంతో వరదల్లో పంప్‌హౌజ్‌లలోని మోటార్లతో పాటు కంట్రోల్ రూమ్స్ నీట మునిగి భారీ నష్టం వాటిల్లింది. అన్నారం పంప్‌హౌజ్‌ను 128 మీటర్ల ఎత్తులో నిర్మించగా, 129.2 మీటర్ల వరకు వరద వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన కంట్రోల్‌రూమ్‌ను 134 మీటర్ల ఎత్తులో నిర్మించాలని భావిస్తున్నారు. మేడిగడ్డ పంప్‌హౌజ్‌ను 108 మీటర్ల ఎత్తులో నిర్మించగా, 108.2 మీటర్ల వరకు వరద వచ్చింది. దీంతో మేడిగడ్డ పంప్‌హౌజ్ కంట్రోల్‌రూమ్‌ను 112 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నారు. ఇటీవలి గరిష్ట వరదమట్టంతో పోలి్చతే కనీసం 6 మీటర్ల ఎత్తులో వీటి నిర్మాణం జరగనుంది. రెండు అంతస్తులతో కంట్రోల్ రూమ్స్‌ను నిర్మించనున్నట్టు అధికారవర్గా లు తెలిపాయి. భారీ పరిమాణం ఉండే కంట్రోల్ ప్యానెల్స్, స్టార్టర్ ప్యానెల్స్, ఆగ్జిలరీ బోర్డ్స్ వంటి అత్యంత ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాలు కంట్రోల్ రూమ్స్‌లో ఉంటాయి. వరదల్లో నీట మునిగితే మళ్లీ పనికి రావు. వరదల్లో మునిగిన ప్రతిసారి రూ.వందల కోట్లు వెచి్చంచి విదేశాల నుంచి దిగుమతి చేసుకోక తప్పదు. ఈ నేపథ్యంలో ఎత్తైన సురక్షిత ప్రాంతంలో కంట్రోల్ రూమ్స్ నిర్మిస్తేనే భవిష్యత్తులో వచ్చే వరదలతో నష్టాన్ని నివారించడం సాధ్యం కానుందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జరుగుతున్న అన్నారం, మేడిగడ్డ పంప్‌హౌజ్‌ల పునరుద్ధరణ పను లు పూర్తైన తర్వాత కొత్త కంట్రోల్ రూమ్స్‌ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. వేసవిలో పనులు ప్రారంభించే అవకాశాలున్నాయి.
Also read: AP: ప్రపంచ వారసత్వ కట్టడంగా ‘ధవళేశ్వరం’
మోటార్లను ఆరబెట్టి వాడుకోవాల్సిందే
భవిష్యత్తు వరదల నుంచి అన్నారం, మేడిగడ్డ పంప్‌హౌజ్‌లకు రక్షణ కలి్పంచడం సాధ్యం కాదన్న అభిప్రాయానికి నీటిపారుదల శాఖ వచి్చనట్టు తెలిసింది. పంప్‌హౌజ్‌లు నీట మునిగిన ప్రతిసారీ అందులోని మోటార్లను ఆరబెట్టి మళ్లీ కొంత కాలానికి వాడుకోవాల్సిందేనని అధికారులు పేర్కొంటున్నారు. పంప్‌హౌజ్‌లకు వరద రక్షణ గోడలు/కరకట్టలు నిర్మించడం అందులో పనిచేసే ఇంజనీర్లు, సిబ్బందికి సురక్షితం కాదన్న చర్చ జరుగుతోంది.
Also read: State High Court: GO 111లోని ఆంక్షలు అమల్లోనే..
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP