Skip to main content

Standing Finance Committee: కృష్ణా నదిపై రెండంతస్తుల కేబుల్‌ బ్రిడ్జి

- పైన వాహనాల కోసం నాలుగు వరసల క్యారేజ్‌ వే ∙ దిగువన పర్యాటకుల కోసం గాజు డెక్‌
కేబుల్‌ వంతెన నమూనా
కేబుల్‌ వంతెన నమూనా

దేశంలోనే తొలిసారి రెండు అంతస్తుల కేబుల్‌ వంతెన రాష్ట్రంలో నిర్మాణం కాబోతోంది. కృష్ణానదిపై సోమశిల వద్ద ప్రతిపాదించిన భారీ బ్రిడ్జికి కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ అధీనంలోని స్టాండింగ్‌ ఫైనాన్స్‌ కమిటీ ఆమోదముద్ర వేసింది.  అక్టోబర్ 7న ఢిల్లీలో ఈ కమిటీ భేటీ అయ్యింది. నిర్మాణ సంస్థకు వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చిన రెండేళ్ల కాలంలో ఇది సిద్ధం కానుంది. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతూ కృష్ణా నదిపై నిర్మించే ఈ వంతెనలో పైన వాహనాలు వెళ్లే ప్రధాన క్యారేజ్‌ వే ఉంటుంది. దాని దిగువన పర్యాటకులు నడుచుకుంటూ సోమశిల ప్రకృతి సౌందర్యం, కృష్ణా నదీ పరవళ్లను తిలకించేందుకు వీలుగా గాజు వంతెన (పెడస్ట్రియన్‌ డెక్‌) ఉంటుంది. 

glass bridge

           దిగువ వరస.. పాదచారులు వెళ్లే ఆర్చితో కూడిన గాజు ప్యానెల్‌ కారిడార్‌ ఎంట్రెన్స్‌ నమూనా

Also read: Weekly Current Affairs (Persons) Bitbank: ఆల్ ఇండియా రేడియో న్యూస్ సర్వీసెస్ విభాగానికి డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు

అక్కడ ఎందుకు..?
    తెలంగాణ నుంచి ఏపీలోని నంద్యాల వైపు రోడ్డు మార్గాన వెళ్లేవారికి దూరాభారాన్ని తగ్గించే క్రమంలో కొత్త జాతీయ రహదారిని ప్రతిపాదించారు. నంద్యాల, తిరుపతి వెళ్లాలంటే కర్నూలు మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. అదే కొల్లాపూర్‌ మీదుగా కృష్ణా నదిని దాటేలా వంతెన నిర్మిస్తే ఆ దూరం దాదాపు 90 కి.మీ మేర తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌–శ్రీశైలం రహదారి మీద ఉన్న కోట్రా జంక్షన్‌ నుంచి మల్లేశ్వరం, అక్కడి నుంచి నంద్యాల వరకు 173.73 కి.మీ మేర రహదారిని (హైవే 167 కే) నాలుగు వరసలుగా నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు కృష్ణానదిపై వంతెన అవసరమైంది. అయితే దీన్ని సాదాసీదాగా నిర్మించకుండా, పర్యాటకులను ఆకట్టుకునేలా ఐకానిక్‌ వంతెనగా నిర్మిస్తే బాగుంటుందని అధికారులు ప్రతిపాదించారు. పాపికొండలు తరహాలో ఈ ప్రాంతం అత్యంత రమణీయంగా ఉన్నందున ఇక్కడికి నిత్యం వేలల్లో పర్యాటకులు వస్తారు. గాజు నడక వంతెన నిర్మిస్తే వారు నదీ పరవళ్లను తిలకిస్తూ ప్రత్యేక అనుభూతిని పొందేందుకు అవకాశం ఉంటుందని భావించారు. వాహనాల వంతెన దిగువన గాజు డెక్‌ ఉండేలా రెండంతస్తులుగా డిజైన్‌ చేశారు.

Also read: Weekly Current Affairs (Sports) Bitbank: అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన భారతీయ క్రికెటర్ ఎవరు?

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 08 Oct 2022 07:57PM

Photo Stories