Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 1st కరెంట్ అఫైర్స్
Supreme Court: ‘రెండు వేళ్ల’ పరీక్షను ఆపేయాలని, వైద్య పాఠ్యాంశాల్లోంచి కూడా తొలగించాలని కేంద్రానికి సూచన
సాక్షి, న్యూఢిల్లీ: లైంగిక వేధింపులు, అత్యాచార బాధితులకు ‘రెండు వేళ్ల’ పరీక్ష నిర్వహించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఇంత పురోగతి, అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఆ విధంగా పరీక్షలు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది వారిని మరింత బాధించడమేనని స్పష్టం చేసింది. ‘‘రెండువేళ్ల పరీక్ష ఇంకా కొనసాగుతుండటం విచారకరం. ఇది తిరోగమన పోకడే. అప్పటికే లైంగిక దాడికి గురై విపరీతంగా కుంగిపోయిన వారిని పదేపదే బాధితులుగా మార్చి తీవ్రంగా కించపరచడమే’’ అని పేర్కొంది. ‘‘దీన్ని కొనసాగించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. ఎలాంటి శాస్త్రీయతా లేని ఈ పరీక్షను నిషేధించండి’’ అని కేంద్రానికి సూచించింది.
రేప్, లైంగిక వేధింపుల బాధితులు రెగ్యులర్‌గా సెక్స్‌లో పాల్గొనే అలవాటు ఉందా, లేదా అని తేల్చడానికి ఈ రెండు వేళ్ల పరీక్ష నిర్వహిస్తారు. అత్యాచారం, హత్య కేసులో నిందితుని హైకోర్టు విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ జార్ఖండ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం అక్టోబర్ 31న విచారణ జరిపింది.
బాధితురాలికి దేవగఢ్ సదర్ ఆస్పత్రి మెడికల్ బోర్డు రెండు వేళ్ల పరీక్ష జరపడాన్ని ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి కేసుల్లో మహిళ సాక్ష్యం ఆమె లైంగిక చరిత్రపై ఆధారపడి ఉండదని కుండబద్దలు కొట్టింది. ‘‘ఒక మహిళ కేవలం లైంగికంగా చురుకుగా ఉంటుందనే కారణంతో తనపై అత్యాచారం జరిగిందని ఆమె చెప్పే మాటలను నమ్మబోమనడం పితృస్వామ్యపు ఆధిపత్య వ్యవస్థకు సూచిక.
Also read: Weekly Current Affairs (Awards) Bitbank: అంబేద్కర్: ఎ లైఫ్' పుస్తకం ఎవరు రాశారు?
లైంగిక వేధింపులు, అత్యాచార బాధితులకు రెండు వేళ్ల పరీక్ష నిర్వహించడం వారికి కచ్చితంగా బాధాకరమే. కేవలం లైంగికంగా చురుగ్గా ఉండే మహిళపై అత్యాచారం జరగదన్న అపోహతో మాత్రమే ఈ రెండు వేళ్ల పరీక్ష నిర్వహిస్తున్నారు. అందుకే ఈ పరీక్షను నిలిపేయాలని సుప్రీంకోర్టు పదేపదే చెప్పింది. అయినా అవి ఆగడం లేదు’’ అంటూ ఆవేదన వెలిబుచి్చంది.
రేప్ జరిగిందా, లేదా తేల్చేందుకు బాధితురాలి లైంగిక చరిత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాతిపదిక కాబోదని పునరుద్ఘాటించింది. రెండు వేళ్ల పరీక్ష నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీన్ని నిషేధిస్తూ 2014లోనే కేంద్ర ఆరోగ్య శాఖ నిర్దేశకాలు జారీ చేసిందని గుర్తు చేసింది. ‘‘వాటిని మరోసారి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నింటికీ పంపండి.
Also read: Supreme Court: ఐటీ చట్టం సెక్షన్ 66-ఏ కింద ప్రాసిక్యూట్ చేయరాదు
లైంగిక వేధింపులకు గురైన వారిని పరీక్షించడానికి తగిన విధానాన్ని వైద్యులకు తెలియపరిచేందుకు వర్క్‌షాప్‌లు నిర్వహించండి’’ అని కేంద్రాన్ని ఆదేశించింది. రెండు వేళ్ల పరీక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ సూచించకుండా వైద్య పాఠ్యాంశాలను సవరించాలని ఆదేశించింది. లైంగిక వేధింపులు, అత్యాచారాలకు గురై ప్రాణాలతో బయటపడిన వారికి రెండు వేళ్ల పరీక్ష జరపకుండా చూడాలని కేంద్ర ఆరోగ్య శాఖకు ధర్మాసనం సూచించింది. నిందితున్ని విడుదల చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. అతన్ని దోషిగా నిర్ధారిస్తూ ట్రయల్ కోర్టు విధించిన జీవిత ఖైదునే ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.
Formula-1 Racing: చరిత్ర సృష్టించిన వెర్‌స్టాపెన్
మెక్సికో సిటీ: ఫార్ములా వన్ సర్క్యూట్‌లో రెడ్‌బుల్ డ్రైవర్, నెదర్లాండ్స్‌కు చెందిన మ్యాక్స్ వెర్‌స్టాపెన్ చరిత్ర సృష్టించాడు. అక్టోబర్ 30న ఆటోడ్రోమో హెర్మనోస్ రోడ్రిగ్స్‌లో జరిగిన రేస్‌లో వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. 1 గంటా 38 నిమిషాల 36.729 సెకన్లలో రేస్ పూర్తి చేసిన అతను మొదటి స్థానాన్ని అందుకున్నాడు. లూయీస్ హామిల్టన్ (మెర్సిడెజ్), సెర్గెయో పెరెజ్ (రెడ్‌బుల్) రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. తాజా విజయంతో 2022 సీజన్‌లో వెర్‌స్టాపెన్ 14 రేస్‌లలో విజేతగా నిలిచిన ఘనతను సొంతం చేసుకున్నాడు. దాంతో అతను ఒకే సీజన్‌లో విజయాల సంఖ్యపరంగా కొత్త రికార్డును నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఒకే సీజన్‌లో అత్యధిక రేస్‌లు (13) నెగ్గిన ఘనత మైకేల్ షుమాకర్ (2004), సెబాస్టియన్ వెటెల్ (2013) పేరిట ఉండగా ఇప్పుడు దానిని వెర్‌స్టాపెన్ బద్దలు కొట్టాడు. తాజా సీజన్‌లో ఇప్పటి వరకు 20 రేస్‌లు జరగ్గా, పెరెజ్ రెండు నెగ్గడంతో 16 రేస్‌లు రెడ్‌బుల్ ఖాతాలోకే చేరాయి. ఈ సీజన్‌లో హామిల్టన్ ఒక్క రేస్ కూడా నెగ్గలేకపోయాడు. తర్వాతి రేస్ 13 నవంబర్‌నుంచి బ్రెజిల్‌లోని సావో పాలోలో జరుగుతుంది.
Also read: Weekly Current Affairs (Sports) Bitbank: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ T20 2022లో ఏ జట్టు గెలిచింది?
Lula da Silva: బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో డ సిల్వా జయకేతనం
సావ్ పావ్లో: ఉత్కంఠభరితంగా జరిగిన బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో వర్కర్స్ పార్టీ నేత, మాజీ దేశాధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూనా డ సిల్వా (77)ను స్వల్ప ఆధిక్యంతో విజయం వరించింది. అధ్యక్షుడు బోల్సోనారోను ఓడించి 20 ఏళ్ల తర్వాత తిరిగి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. 1985 తర్వాత ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టిన బ్రెజిల్‌లో అధికార పీఠంపై కూర్చున్న వ్యక్తి తదుపరి ఎన్నికల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి! సిల్వాను అమెరికా అధ్యక్షుడు బైడెన్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అభినందించారు.
Russia recruiting: రష్యా సైన్యంలోకి అఫ్గాన్ కమాండోలు
వాషింగ్టన్: అఫ్గానిస్తాన్‌లో అమెరికా సేనలతో కలిసి తాలిబన్లపై పోరాడిన ప్రత్యేక దళాల సైనికులు ఇప్పుడు రష్యాకు క్యూ కడుతున్నారు. రష్యా సైన్యంలో చేరి, ఉక్రెయిన్‌పై యుద్ధంలో పాలుపంచుకుంటున్నారు. వీరంతా అమెరికా సైన్యం శిక్షణ ఇచ్చిన కమాండోలు కావడం విశేషం. అఫ్గాన్ నుంచి అమెరికా సైన్యం వెనక్కి మళ్లిన తర్వాత తాలిబన్ల నుంచి ముప్పును తప్పించుకొనేందుకు ఈ కమాండోలు ఇరాన్‌కు చేరుకున్నారు. వీరిని రష్యా తన సైన్యంలో చేర్చుకొని, ఉక్రెయిన్‌కు పంపిస్తోంది. ఈ విషయాన్ని ముగ్గురు అఫ్గాన్ మాజీ సైనికాధికారులు స్వయంగా వెల్లడించారు. యుద్ధంలో పాల్గొన్నందుకు గాను ఒక్కో జవానుకు రష్యా ప్రతినెలా 1,500 డాలర్ల చొప్పున వేతనం చెల్లిస్తోందని తెలిపారు. నిజానికి ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంలో పాల్గొనడం అఫ్గాన్ కమాండోలకు ఇష్టం లేదని, కానీ, వారికి మరో దారి కనిపించడం లేదని అబ్దుల్ రవూఫ్ అనే మాజీ అధికారులు తెలిపారు.
Also read: Weekly Current Affairs (Persons) Bitbank: CRPF డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
CHINA MANNED SPACE: చైనా రెండో ల్యాబ్ మాడ్యూల్... విజయవంతంగా అంతరిక్షంలోకి
బీజింగ్: సొంత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తియాంగ్‌గాంగ్‌ను నిర్మించుకుంటున్న చైనా ఆ దిశగా మరో ముందడుగు వేసింది. హైనాన్ ప్రావిన్స్‌లోని ప్రయోగకేంద్రం నుంచి దూసుకెళ్లిన లాంగ్ మార్చ్ –5బీ రాకెట్ .. రెండోదైన మెంగ్‌టియాన్ ల్యాబ్ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ‘త్వరలో ప్రధాన కోర్ మాడ్యూల్ తియాన్హీతో మెంగ్‌టియాన్‌ను అనుసంధానిస్తాం. చివరి మాడ్యూల్ ప్రయోగం విజయవంతమైంది’’ అని చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది.
EPS నుంచీ డబ్బు తీసుకోవచ్చు
న్యూఢిల్లీ: సంఘటిత రంగంలోని ఉద్యోగులకు అనుకూలమైన నిర్ణయాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) తీసుకుంది. ఒక ఉద్యోగి ఒక సంస్థలో చేరి ఆరు నెలల్లోపు మానేస్తే, కేవలం తన పీఎఫ్ ఖాతాలోని బ్యాలన్స్ వరకే వెనక్కి తీసుకోగలరు. పెన్షన్ ఖాతా (ఈపీఎస్–95)లోని జమలను తీసుకోవడానికి లేదు. కానీ, ఆరు నెలల సరీ్వసు కూడా లేకుండా ఉద్యోగం మానేసే వారు పెన్షన్ ఖాతాలోని బ్యాలన్స్‌ను సైతం వెనక్కి తీసుకునేందుకు అనుమతించాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అక్టోబర్ 31న నాటి 232వ సమావేశంలో నిర్ణయించింది. ఇక ఈటీఎఫ్‌లలో తన పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన విధానానికీ ఆమోదం తెలిపింది.
2018లో కొనుగోలు చేసిన ఈటీఎఫ్ యూనిట్లకు సంబంధించి లాభాలను వెనక్కి తీసుకుని, 2022–23 సంవత్సరానికి వడ్డీ ఆదాయం లెక్కింపులోకి పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది.
Awards: రాష్ట్రానికి ‘కేంద్ర హోం మినిస్టర్స్ స్పెషల్ ఆపరేషన్ మెడల్’
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నిఘా విభాగం అధిపతి అదనపు డీజీ అనిల్‌కుమార్ నేతృత్వంలోని ఇంటెలిజెన్స్ బృందానికి ‘కేంద్ర హోం మినిస్టర్స్ స్పెషల్ ఆపరేషన్ మెడల్’లభించింది. 2022 సంవత్సరానికి గాను తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. దేశంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, సరిహద్దుల పరిరక్షణ, ఆయుధాల నియంత్రణ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధం, విపత్తు ల్లో సహాయక చర్యలు వంటి కార్యక్రమాల్లో పోలీసులు చేసిన ప్రత్యేక ఆపరేషన్‌లకు గుర్తింపుగా కేంద్రం ఏటా ఈ అవార్డులను అందిస్తోంది. కాగా 2022 సంవత్సరానికి గాను తెలంగాణ, పంజాబ్, ఢిల్లీ, జమ్మూకశీ్మర్‌లలో పోలీసు అధికారులు చేసిన నాలుగు స్పెషల్ ఆపరేషన్లకు, 2021కి సంబంధించి మహారాష్ట్రకు ఈ పురస్కారాన్ని అందించనున్నారు. తెలంగాణ నుంచి 13 మంది సభ్యుల బృందం చేసిన స్పెషల్ ఆపరేషన్‌ను ‘కేంద్ర హోం మంత్రి స్పెషల్ ఆపరేషన్ మెడల్’కు ఎంపిక చేశారు. 2018లో ప్రారంభించిన ఈ పురస్కారాన్ని ఏటా సాధారణంగా 3 ప్రత్యేక ఆపరేషన్లకు ఇస్తున్నారు. అయితే అసాధారణ పరిస్థితుల్లో రాష్ట్రాల పోలీసులను ప్రోత్సహించేందుకు ఈ సారి 5 స్పెషల్ ఆపరేషన్లకు పురస్కారాన్ని ప్రకటించారు.
Also read: Weekly Current Affairs (Awards) Bitbank: 52వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో ఎవరు సత్కరించబడతారు?
అవార్డు లభించింది వీరికే..
తెలంగాణకు సంబంధించి అదనపు డీజీ అనిల్‌కుమార్‌తో పాటు డీఎస్పీ కైతా రవీందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ మొగుళ్ల వెంకటేశ్వర్‌గౌడ్, సబ్‌ఇన్‌స్పెక్టర్లు కుకుడపు శ్రీనివాసులు, మహ్మద్ అక్తర్ పాషా, పాండే జితేందర్ ప్రసాద్, సయ్యద్ అబ్దుల్ కరీం, హెడ్‌కానిస్టేబుల్ సనుగొమ్ముల రాజవర్ధన్‌రెడ్డి, కానిస్టేబుళ్లు మహ్మద్ తాజ్ పాషా, మహ్మద్ ఫరీదుద్దీన్, బచ్చుల లక్ష్మీనారాయణ, కొడ్గల్ కిరణ్‌కుమార్, సయ్యద్ జియా ఉల్ హక్‌లతో కూడిన బృందానికి ఈ పురస్కారం లభించింది. ఈ ఏడాది మేలో నిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌కు సంబంధించి తెలంగాణ అధికారులకు ఈ పురస్కారం ప్రకటించినట్లు కేంద్రం అక్టోబర్ 31న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
‘రిందా ఆపరేషన్’కే ఈ పురస్కారం
పంజాబ్‌తో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మాఫియా డాన్ హరీ్వందర్ సింగ్ అలియాస్ రిందా అనుచరులపై చేసిన ఆపరేషన్‌కే రాష్ట్ర నిఘా బృందానికి స్పెషల్ ఆపరేషన్ మెడల్స్ వచ్చాయి. పాకిస్తాన్‌లో ఉన్న రిందా, భారత్‌లో పేలుళ్లకు పన్నిన కుట్రను ఛేదించడంతో పాటు పంజాబ్ కేంద్రంగా పని చేస్తున్న నిషేధిత సంస్థ బబ్బార్ ఖల్సా ఇంటర్నేషనల్‌కు (బీకేఐ) చెందిన నలుగురు ఉగ్రవాదుల ను నిఘా బృందాలు పట్టుకున్నాయి. పాక్ నుంచి మారణాయుధాలు, పేలుడు పదార్థాలను డ్రోన్ల ద్వారా పంపిన రిందా.. వాటిని తెలంగాణలోని ఆదిలాబాద్‌కు తరలించాల్సిందిగా తన అనుచరులను ఆదేశిస్తూ ఆ లొకేషన్‌ను షేర్ చేశాడు. తెలంగాణ నిఘా అధికారులు చాకచక్యంగా ఈ గుట్టును రట్టుచేశారు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP