Supreme Court: ఐటీ చట్టం సెక్షన్ 66-ఏ కింద ప్రాసిక్యూట్ చేయరాదు
సమాచార సాంకేతిక చట్టం(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్)-2000లోని సెక్షన్ 66-ఏ.. రాజ్యాంగ విరుద్ధమని 2015లో శ్రేయాసింఘాల్ కేసులో సుప్రీంకోర్టు ప్రకటించినందున.. ఆ సెక్షన్ కింద దేశ పౌరులను ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న అన్ని కేసుల్లో 66-ఏ సెక్షన్ ను తొలగించాలని అన్ని రాష్ట్రాల డీజీపీలు, హోంశాఖ కార్యదర్శులను ఆదేశించింది. కంప్యూటర్ లేదా ఏదైనా సమాచార సాధనం ద్వారా హానికర/అసహ్యకరమైన సందేశం పంపించడాన్ని నేరంగా పరిగణిస్తూ.. మూడేళ్ల వరకూ జైలు, జరిమానా విధించడానికి ఈ సెక్షన్ వీలు కల్పిస్తుంది. అయితే, సెక్షన్ 66-ఏ పౌరుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరిస్తుందని పేర్కొంటూ.. 2015లో సుప్రీంకోర్టు దానిని రద్దు చేసింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP