Supreme Court: స్థానిక సహకార సంఘాలకు 97వ రాజ్యాంగ సవరణ వర్తించదు
Sakshi Education

97వ రాజ్యాంగ సవరణ స్థానిక సహకార సంఘాలకు వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బహుళ రాష్ట్ర సహకార సంఘాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సంఘాలకు మాత్రమే దాన్ని వర్తింపజేయాల్సి ఉంటుందని పేర్కొంది. పరస్పరం సహకరించుకోవాలన్న సూత్రం ప్రాతిపదికనే ప్రజలు ఇలాంటి సంఘాల్లో చేరుతుంటారని, పెట్టుబడిదారులుగా కాదని గుర్తుచేసింది. కోల్‌కతాలోని జోధ్‌పుర్‌పార్కు వద్ద ఓ సహకార సంస్థకు చెందిన వందేళ్లనాటి భవనం(శిథిలావస్థలో ఉంది) కూల్చివేత వ్యవహారంలో దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ జె.బి.పర్దీవాలాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP

Published date : 28 Oct 2022 05:19PM