Skip to main content

ITR : అందరికీ ఒక్కటే ఐటీఆర్‌ ఫామ్‌

పన్ను చెల్లింపుదారులు అందరికీ అనుకూలమైన ఒకే ఒక్క ఆదాయపన్ను రిటర్నుల పత్రాన్ని (ఐటీఆర్‌ ఫామ్‌) తీసుకురావాలంటూ  ఆర్థిక శాఖ ప్రతిపాదించింది.
One ITR form for all
One ITR form for all

ఈ పత్రంలో వర్చువల్‌ డిజిటల్‌ అసెట్స్‌ రూపంలో వచ్చే ఆదాయాన్ని వెల్లడించేందుకు ప్రత్యేక భాగం ఉంటుంది. ట్రస్ట్‌లు, ఎన్‌జీవోలు మినహా మిగిలిన పన్ను చెల్లింపుదారులు అందరూ నూతన ప్రతిపాదిత ఐటీఆర్‌ను ఫైల్‌ చేసుకోవచ్చంటూ, దీనిపై అభిప్రాయాలు తెలియజేయాలని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) భాగస్వాములను కోరింది. ఐటీఆర్‌–7 మినహా మిగిలిన అన్ని ఐటీఆర్‌లను విలీనం చేయాలన్నది ప్రతిపాదన. చిన్న, మధ్య స్థాయి పన్ను చెల్లింపుదారుల్లో ఎక్కువ మంది ఐటీఆర్‌–1, ఐటీఆర్‌–4 దాఖలు చేస్తుంటారు. ఇంటి రూపంలో ఆదాయం, వేతనం రూపంలో రూ.50 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు ఐటీఆర్‌–1 దాఖలు చేయవచ్చు. రూ.50 లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, సంస్థలు వ్యాపార ఆదాయం కూడా కలిగి ఉంటే ఐటీఆర్‌–4ను, వేతన లేదా వ్యాపార ఆదాయంతోపాటు మూలధన లాభాల పన్ను పరిధిలోని వారు ఐటీఆర్‌–2 దాఖలు చేయాలి. 

Also read: EPS నుంచీ డబ్బు తీసుకోవచ్చు

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 02 Nov 2022 03:38PM

Photo Stories