Kaleshwara Project : 2 కొత్త కంట్రోల్ రూమ్స్
భవిష్యత్తులో గోదావరికి భారీ వరదలొస్తే మళ్లీ ఈ పంప్‌హౌజ్‌లు నీటమునిగే చాన్స్ ఉండడంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా వీటికి సంబంధించిన కంట్రోల్ రూమ్స్‌ను ఎత్తైన ప్రాంతంలో కొత్తగా నిర్మించాలని నిర్ణయించింది.
Also read: Standing Finance Committee: కృష్ణా నదిపై రెండంతస్తుల కేబుల్ బ్రిడ్జి
కనీసం 6 మీటర్లు ఎత్తు పెంచి...
అన్నారం, మేడిగడ్డ పంప్‌హౌజ్‌ల లోపలే వీటికి సంబంధించిన కంట్రోల్ రూమ్స్ నిర్మించారు. పంప్‌హౌజ్‌ల సర్వస్ బే ఎత్తు తక్కువగా ఉండడంతో వరదల్లో పంప్‌హౌజ్‌లలోని మోటార్లతో పాటు కంట్రోల్ రూమ్స్ నీట మునిగి భారీ నష్టం వాటిల్లింది. అన్నారం పంప్‌హౌజ్‌ను 128 మీటర్ల ఎత్తులో నిర్మించగా, 129.2 మీటర్ల వరకు వరద వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన కంట్రోల్‌రూమ్‌ను 134 మీటర్ల ఎత్తులో నిర్మించాలని భావిస్తున్నారు. మేడిగడ్డ పంప్‌హౌజ్‌ను 108 మీటర్ల ఎత్తులో నిర్మించగా, 108.2 మీటర్ల వరకు వరద వచ్చింది. దీంతో మేడిగడ్డ పంప్‌హౌజ్ కంట్రోల్‌రూమ్‌ను 112 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నారు. ఇటీవలి గరిష్ట వరదమట్టంతో పోలి్చతే కనీసం 6 మీటర్ల ఎత్తులో వీటి నిర్మాణం జరగనుంది. రెండు అంతస్తులతో కంట్రోల్ రూమ్స్‌ను నిర్మించనున్నట్టు అధికారవర్గా లు తెలిపాయి. భారీ పరిమాణం ఉండే కంట్రోల్ ప్యానెల్స్, స్టార్టర్ ప్యానెల్స్, ఆగ్జిలరీ బోర్డ్స్ వంటి అత్యంత ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాలు కంట్రోల్ రూమ్స్‌లో ఉంటాయి. వరదల్లో నీట మునిగితే మళ్లీ పనికి రావు. వరదల్లో మునిగిన ప్రతిసారి రూ.వందల కోట్లు వెచి్చంచి విదేశాల నుంచి దిగుమతి చేసుకోక తప్పదు. ఈ నేపథ్యంలో ఎత్తైన సురక్షిత ప్రాంతంలో కంట్రోల్ రూమ్స్ నిర్మిస్తేనే భవిష్యత్తులో వచ్చే వరదలతో నష్టాన్ని నివారించడం సాధ్యం కానుందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జరుగుతున్న అన్నారం, మేడిగడ్డ పంప్‌హౌజ్‌ల పునరుద్ధరణ పను లు పూర్తైన తర్వాత కొత్త కంట్రోల్ రూమ్స్‌ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. వేసవిలో పనులు ప్రారంభించే అవకాశాలున్నాయి.
Also read: AP: ప్రపంచ వారసత్వ కట్టడంగా ‘ధవళేశ్వరం’
మోటార్లను ఆరబెట్టి వాడుకోవాల్సిందే
భవిష్యత్తు వరదల నుంచి అన్నారం, మేడిగడ్డ పంప్‌హౌజ్‌లకు రక్షణ కలి్పంచడం సాధ్యం కాదన్న అభిప్రాయానికి నీటిపారుదల శాఖ వచి్చనట్టు తెలిసింది. పంప్‌హౌజ్‌లు నీట మునిగిన ప్రతిసారీ అందులోని మోటార్లను ఆరబెట్టి మళ్లీ కొంత కాలానికి వాడుకోవాల్సిందేనని అధికారులు పేర్కొంటున్నారు. పంప్‌హౌజ్‌లకు వరద రక్షణ గోడలు/కరకట్టలు నిర్మించడం అందులో పనిచేసే ఇంజనీర్లు, సిబ్బందికి సురక్షితం కాదన్న చర్చ జరుగుతోంది.
Also read: State High Court: GO 111లోని ఆంక్షలు అమల్లోనే..
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP