Skip to main content

Twitter : కొనుగోలు చేసిన ఎలెన్ మస్క్

దాదాపు ఆరేడు నెలలకు పైగా నడుస్తున్న మస్క్–ట్విటర్‌ ప్రహసనానికి ఎట్టకేలకు తెరపడింది. ముందుగా ఇచ్చిన 44 బిలియన్‌ డాలర్ల ఆఫర్‌ మేరకు మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ను అమెరికన్‌ ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేశారు. డీల్‌ పూర్తయిన వెంటనే తన ప్రణాళికలను కూడా చకచకా అమలు చేయడం ప్రారంభించారు.
Acquisition of Twitter by Elon Musk
Acquisition of Twitter by Elon Musk

ఈ మొత్తం వ్యవహారంలో తనను బాగా ఇబ్బంది పెట్టారని భావిస్తున్న ట్విటర్‌ సీఈవో పరాగ్‌ అగ్రవాల్, లీగల్‌ ఎగ్జిక్యూటివ్‌ విజయ గద్దెతో పాటు సీఎఫ్‌వో నెడ్‌ సెగాల్, జనరల్‌ కౌన్సిల్‌ షాన్‌ ఎడ్జెట్‌లపై తక్షణం వేటు వేశారు. వారిలో ఒకరిని అవమానకరమైన రీతిలో .. ట్విటర్‌ ఆఫీసు నుండి దాదాపు గెంటివేసినంత పని చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తాజా పరిణామంతో ట్విటర్‌ వ్యాపారం, ఉద్యోగులు, వాటాదారుల భవిష్యత్‌పై కొన్నాళ్లుగా నెలకొన్న అనిశ్చితికి తెరపడినట్లయింది. కానీ, కంపెనీని కొంటే 75 శాతం మందిని తీసేస్తానంటూ మస్క్‌ గతంలో చేసిన ప్రకటనతో ఉద్యోగుల్లో ఇంకా భయాందోళనలు నెలకొన్నాయి. అయితే, అలాంటిదేమీ ఉండబోదంటూ మస్క్‌ హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు, మస్క్‌ చేతికి చేరిన నేపథ్యంలో అక్టోబర్ 28న నుండి ట్విటర్‌ షేర్లలో ట్రేడింగ్‌ నిలి్చపోయింది. 

Also read: Weekly Current Affairs (Economy) Bitbank: భారతదేశ GDP వృద్ధి అంచనాను ప్రపంచ బ్యాంకు ఎంత శాతానికి తగ్గించింది?

మంచి రోజులు.. 
గురువారం పొద్దుపోయాకా టేకోవర్‌ను పూర్తి చేసిన మస్క్‌ .. ట్విటర్‌ లోగో అయిన ’పిట్ట’ను తలపించేలా ’పక్షికి స్వేచ్ఛ’ ఇచ్చానంటూ ట్వీట్‌ చేశారు. అంతకుముందు బుధవారం రోజున చేతిలో ’వాష్‌ బేసిన్‌ సింకు’ పట్టుకుని, స్వయంగా ట్విటర్‌ కార్యాలయానికి వెళ్లి మస్క్‌ .. అక్కడ హల్‌చల్‌ చేశారు. ఆపైన ప్రకటనకర్తలను ఉద్దేశించి కూడా ఒక సందేశం పంపారు. హింసకు తావు లేకుండా ఎలాంటి విషయంపై అయినా ఆరోగ్యకరమైన చర్చ జరిగే వేదికగా తీర్చిదిద్దేందుకే ట్విటర్‌ను తాను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టేకోవర్‌ పూర్తయ్యాక శుక్రవారం రోజున ‘ఇక నుంచి అన్నీ మంచి రోజులే‘ అంటూ మరో ట్వీట్‌ చేశారు.  

Also read: Weekly Current Affairs (Persons) Bitbank: CRPF డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?

నిబంధనలు పాటించాల్సిందే: భారత్‌
ట్విటర్‌ ఎవరి చేతిలో ఉన్నా భారత్‌లో కార్యకలాపాలు సాగించాలంటే నిబంధనల ప్రకారం పనిచేయాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. కంపెనీని మస్క్‌ టేకోవర్‌ చేసినంత మాత్రాన దేశంలో నిబంధనలు మారిపోవని ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ పేర్కొన్నారు. సోషల్‌ మీడియా కంపెనీలకు భారత్‌ భారీ మార్కెట్‌గా  ఉంటోంది. అయితే, ఇటీవలి కొత్త ఐటీ నిబంధనల విషయంలో ట్విటర్‌కి, ప్రభుత్వానికి మధ్య విభేదాలు తలెత్తాయి. టెస్లా కార్ల దిగుమతి సుంకాలు, స్టార్‌లింక్‌ శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల విషయంలో భారత ప్రభుత్వంతో మస్క్ కు కూడా విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో  నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  

Also read: Weekly Current Affairs (Economy) Bitbank: భారతదేశ GDP వృద్ధి అంచనాను ప్రపంచ బ్యాంకు ఎంత శాతానికి తగ్గించింది?

ముందుకి .. వెనక్కి .. 
ఈ ఏడాది జనవరి నుంచి ట్విటర్‌లో కొద్దికొద్దిగా షేర్లు కొనుక్కుంటూ వచి్చన మస్క్‌ ... ఏప్రిల్‌ నాటికి 3 బిలియన్‌ డాలర్ల విలువ చేసే 9 శాతం పైగా వాటాలు దక్కించుకున్నారు. అదే నెలలో షేరు ఒక్కింటికి 54.20 డాలర్లు ఇచ్చి 44 బిలియన్‌ డాలర్లకు కంపెనీని కొనేస్తానంటూ ఆఫర్‌ ఇచ్చారు. దీనిపై కొంత ఊగిసలాడిన ట్విటర్‌ ఆ తర్వాత ఆఫర్‌కు అంగీకరించింది. అయితే, ఆఫర్‌ ఇచ్చేసినప్పటికీ ఆ తర్వాత ఏదో రకంగా దీన్నుంచి బైటపడేందుకు మస్క్‌ అన్ని ప్రయత్నాలు చేశారు. నకిలీ ఖాతాల వివరాలు ఇవ్వడం లేదంటూ ఒకసారి, కంపెనీ విధానాల్లో లొసుగులపై ప్రజావేగు ఆరోపణలను అడ్డం పెట్టుకుని మరోసారి .. డీల్‌ను రద్దు చేసుకుంటానంటూ ప్రకటనలు చేశారు. దీంతో మస్‌్కను ట్విటర్‌ న్యాయస్థానానికి లాగింది. ‘తన వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగపడదనే ఉద్దేశంతోనే ట్విటర్, దాని షేర్‌హోల్డర్లకు ఇచి్చన మాటను మస్క్‌ తప్పుతున్నారు‘ అని ఆరోపించింది. దీనికి మస్క్‌ కూడా కౌంటర్‌ పిటీషన్‌ వేశారు. ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి అక్టోబర్‌లో విచారణకు వచి్చంది. ఈ దశలో తనపై వేసిన దావాను వెనక్కి తీసుకుంటే అప్పట్లో చెప్పిన రేటు ప్రకారమే కొంటానంటూ ట్విటర్‌కు మస్క్‌ మరో ఆఫర్‌ ఇచ్చారు. కానీ డీల్‌ను మరింత జాప్యం చేసేందుకే ఆయన దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారంటూ ట్విటర్‌ లాయర్లు అభ్యంతరం చెప్పారు. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 28లోగా డీల్‌ సంగతి తేల్చాలని, లేకపోతే తదుపరి నవంబర్‌లో విచారణ ఎదుర్కొనాల్సి వస్తుందంటూ మస్‌్కకు న్యాయస్థానం స్పష్టం చేసింది.

Also read: Weekly Current Affairs (National) Bitbank: రాష్ట్రంలో "వందేమాతరం" కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?

పరాగ్, విజయ అంటే అందుకే అయిష్టం.. 
మస్క్‌ చేతికి ట్విటర్‌ వచి్చన వెంటనే ఉద్వాసనకు గురైన పరాగ్‌ అగ్రవాల్‌ .. గతేడాది నవంబర్‌లోనే సంస్థ సహ–వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే స్థానంలో సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. బాంబే ఐఐటీలోనూ, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలోనూ విద్యాభ్యాసం చేసిన అగ్రవాల్‌ .. దాదాపు దశాబ్దం క్రితం ట్విటర్‌లో చేరారు. తర్వాత సీఈవోగా ఎదిగారు. ట్విటర్‌ టేకోవర్‌ వ్యవహారంలో మస్‌్కతో బహిరంగంగాను, ప్రైవేట్‌గాను అగ్రవాల్‌ పోరాటం సాగించారని, అందుకే ఆయనపై మస్క్‌ కత్తిగట్టారని న్యూయార్క్‌ టైమ్స్‌ పోస్ట్‌ పేర్కొంది. అలాగే హైదరాబాదీ అయిన లీగల్‌ ఎగ్జిక్యూటివ్‌ విజయ గద్దె (48) విషయానికొస్తే .. అభ్యంతరకర ట్వీట్లు చేస్తున్నారంటూ ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాను రద్దు చేయడం ద్వారా ఆమె వార్తల్లోకెక్కారు. ’కంటెంట్‌ను క్రమబదీ్ధకరించడంలో ట్విటర్‌ నిర్ణయాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నారు’ అంటూ విజయపై కూడా మస్క్‌ విమర్శలు గుప్పించారు. కంపెనీ తన చేతికి వచ్చీ రాగానే ఆమెను తప్పించారు. అయితే, ఉద్వాసనకు గురైన టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లకు భారీగానే పరిహారం ముట్టనుంది. వారి వాటాలను కొనుగోలు చేసేందుకు, అర్ధాంతరంగా తొలగించినందుకు గాను పరిహారం కింద ఆయా ఉద్యోగులకు మస్క్‌ దాదాపు 200 మిలియన్‌ డాలర్లు చెల్లించుకోవాల్సి రానుంది. అత్యధికంగా విజయకు 74 మిలియన్‌ డాలర్లు, అగ్రవాల్‌కు 65 మిలియన్‌ డాలర్లు, సెగాల్‌కు 66 మిలియన్‌ డాలర్లు లభించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 29 Oct 2022 06:45PM

Photo Stories