Skip to main content

Latest Top Current Affairs: టీమిండియాను వెనక్కునెట్టిన పాక్‌

వివిధ పోటీ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల కోసం సాక్షి ఎడ్యుకేష‌న్ అందిస్తున్న నేటి టాప్ టెన్ క‌రెంట్ అఫైర్స్ ఇవే...
India-Pakistan
India-Pakistan

సుప్రీంకోర్టులో కేంద్రానికి షాక్‌.. కేజ్రీవాల్‌ సర్కార్‌కు భారీ ఊరట
ఢిల్లీ పాలనా వ్యవహారాల నియంత్రణ  లెఫ్టినెంట్ గవర్నర్‌దా? లేక ప్రభుత్వానిదా ? అన్న విషయంపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది. ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేవన్న గత తీర్పును తోసిపుచ్చింది. 2019 నాటి సింగిల్ జడ్జి తీర్పుతో ఏకీభవించబోమని స్పష్టం చేసింది. ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారి అని, నిజమైన అధికారాలు అసెంబ్లీకే ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.

arvind kejriwal

అధికారుల నియామకం సహా ఢిల్లీ ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఉంటాయని తెలిపింది. శాంతిభద్రతలు,  భూ వ్యవహారాలపై మాత్రమే కేంద్రానికి అధికారం ఉంటుందని పేర్కొంది. ఈమేరకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. 

చ‌ద‌వండి: వచ్చే ఏడాది మే 26న సివిల్స్‌ ప్రిలిమ్స్‌

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేకు సుప్రీంలో ఎదురుదెబ్బ
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే కు ఊరటనిచ్చేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన్ను తిరిగి నియమించలేమని వ్యాఖ్యానించింది. ఆయన బలపరీక్షను ఎదుర్కోకుండా స్వచ్ఛందంగా రాజీనామా చేయడమే అందుకు కారణమని వెల్లడించింది. శివసేన పార్టీలో తలెత్తిన సంక్షోభంపై ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం, శిందే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

Maharashtra

ఈ సంక్షోభ సమయంలో గవర్నర్ వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. ‘ఉద్ధవ్ ఠాక్రే మెజార్టీ కోల్పోయారని నిర్ధారణకు వచ్చేందుకు గవర్నర్ వద్ద తగిన సమాచారం లేనప్పుడు.. సభలో మెజార్టీని నిరూపించుకోమని ప్రభుత్వాన్ని పిలవడం సబబు కాదు. గవర్నర్ విచక్షణాధికారాలను అమలు చేసిన తీరు చట్టపరంగా లేదు ’అని వెల్లడించింది.

కేరళ రికార్డు...
శాంతి భద్రతల పరిరక్షణ, విపత్తు నిర్వహణ సమయంలో ఉప‌యోగించేందుకు వీలుగా అన్ని జిల్లాల్లో డ్రోన్ నిఘా వ్య‌వ‌స్థ‌ను దేశంలోనే తొలిసారిగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 20 జిల్లాలకు ఒక్కో డ్రోన్‌ను అందించారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రోన్‌ పైలెట్‌లకు లైసెన్స్‌లు పంపిణీ చేశారు.

Kerala

దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ డ్రోన్ సాఫ్ట్‌వేర్‌ను ఆయన ఆవిష్కరించారు. డ్రోన్‌ ఆపరేషన్‌పై ప్రత్యేక శిక్షణ కోసం 25 మంది పోలీసు సిబ్బందిని మద్రాసులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీకి పంపారు. మరో 20 మందికి కేరళలోని డ్రోన్ ల్యాబ్‌లో ప్రాథమిక శిక్షణ ఇచ్చారు.

చ‌ద‌వండి: కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు బంపర్ న్యూస్‌... భారీగా వేత‌నాల పెంపు..!

మాతాశిశు మరణాలు భారత్‌లోనే అత్యధికం
ప్రపంచవ్యాప్తంగా 2020లో మాతాశిశు మరణాలు, నవజాత శిశువుల మరణాలు అధికంగా చోటుచేసుకున్న 10 దేశాల జాబితాలో భారత్‌ ముందుంది. దక్షిణాఫ్రికాలోని కేప్‌ టౌన్‌లో ఈ నెల 8 నుంచి అంతర్జాతీయ మాతాశిశు ఆరోగ్య సదస్సు ప్రారంభమైంది.

Maternal And Infant Mortality

ఈ సందర్భంగా ఐరాసతో అనుబంధమున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌, యుఎన్‌ఎఫ్‌పీఏ విడుదల చేసిన నివేదికలో 2020-21లో ప్రపంచమంతటా 2.9 లక్షల గర్భిణి మరణాలు, 19 లక్షల గర్భస్థ శిశు మరణాలు, 23 లక్షల నవజాత శిశు మరణాలు సంభవించిన‌ట్లు వివ‌రాలు ఉన్నాయి. 2020-21లో ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా మరణాలు 45 లక్షలు నమోదు కాగా, వాటిలో 7.88లక్షల మరణాలు భారత్‌ లోనే సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన జననాల్లో 17 శాతం భారత్‌లోనే చోటుచేసుకున్నాయి.

ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో రవీంద్రుడి శాంతినికేతన్‌
నోబెల్‌ బహుమతి గ్రహీత, ప్రఖ్యాత సాహిత్యకారుడు రవీంద్రనాథ్‌ టాగూర్‌ నడయాడిన పశ్చిమ బెంగాల్‌ బీర్‌భూమ్‌ జిల్లాలోని శాంతినికేతన్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో శాంతినికేతన్‌ను చేర్చాలని సలహా మండలి అయిన ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆన్‌ మాన్యుమెంట్స్‌ అండ్‌ సైట్స్‌(ఐసీవోఎమ్‌వోఎస్‌) ప్రతిపాదించింది.

Santiniketan

ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మంగళవారం  ట్విటర్‌లో తెలిపారు. టాగూర్‌ 162వ జయంతి భారత్‌కు ఈ శుభవార్త అందినట్లు ఆయన పేర్కొన్నారు. 

విడాకులు తీసుకుంటున్న ఫిన్లాండ్‌ ప్రధాని సనా మారిన్‌
అతిచిన్న వయసులోనే దేశ అత్యున్నత పదవి చేపట్టి ఫిన్లాండ్‌లో డైనమిక్‌ ప్రధానిగా పేరు తెచ్చుకున్న సనా మారిన్ ఇటీవల పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అయితే తాజాగా ఆమె త‌న‌ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. భర్త మార్కస్‌ రైకోనెన్ నుంచి విడాకులు తీసుకుంటున్న‌ట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు.

finland

విడాకుల‌కు క‌లిసే ద‌ర‌ఖాస్తు చేస్తుకున్న‌ట్లు తెలిపారు. గ‌త 19 ఏళ్లుగా కలిసే ఉన్నాం. ఇప్పటికీ మేం మంచి స్నేహితులుగా ఉంటామ‌ని తెలిపారు. వ్యాపారవేత్త, మాజీ ప్రొఫెషనల్‌ ఫుట్‌బాలర్‌ అయిన మార్కస్‌ రైకోనెస్‌తో సనా మారిన్ సహజీవనం చేశారు. ఆ స‌మ‌యంలో వీరికి ఓ కుమార్తె జన్మించింది. సనా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత 2020లో వీరు పెళ్లి చేసుకున్నారు.

చ‌ద‌వండి: సాధార‌ణ రైతు బిడ్డ‌... రూ.2 కోట్ల ప్యాకేజీతో అద‌ర‌గొట్టాడు

టీమిండియాను వెనక్కునెట్టిన పాక్‌
ఐసీసీ తాజాగా (మే 11) విడుదల చేసిన వన్డే టీమ్‌ ర్యాంకింగ్స్‌లో పాకి​స్తాన్‌.. టీమిండియాను వెనక్కునెట్టి రెండో స్థానానికి ఎగబాకగా, ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని కాపాడుకుంది. గడిచిన వారం రోజులుగా టాప్‌ త్రీ జట్ల మధ్య దోబూచులాట ఆడుతున్న అగ్రస్థానం​.. వార్షిక అప్‌డేట్‌ తర్వాత ఆసీస్‌ ఖాతాలోకి చేరింది. ప్రస్తుతానికి ఆసీస్‌ టాప్‌ ప్లేస్‌ను నిలబెట్టుకున్నప్పటికీ.. పాయింట్ల పరంగా  చేస్తే, ఆ స్థానం​ శాశ్వతం కాదని తెలుస్తోంది.

india - pak

టాప్‌ త్రీలో ఉన్న ఆసీస్‌, పాక్‌, భారత్‌ల మధ్య వ్యత్యాసం కేవలం 3 పాయింట్లు మాత్రమే. ప్రస్తుతం​ ఆసీస్‌ ఖాతాలో 118, పాక్‌ ఖాతాలో 116, భారత్‌ ఖాతాలో 115 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. తాజా ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌, పాక్‌, భారత్‌ల తర్వాత న్యూజిలాండ్‌ (104), ఇంగ్లండ్‌ (101),  సౌతాఫ్రికా (101), బంగ్లాదేశ్‌ (97), ఆఫ్ఘనిస్తాన్‌ (88), శ్రీలంక (80), వెస్టిండీస్‌ (72) వరుసగా నాలుగు నుంచి పది స్థానాల్లో నిలిచాయి.

ముగ్గురి డీఎన్‌ఏతో జన్మించిన శిశువు
బ్రిటన్ శాస్త్రవేత్తలు సంచాలనాత్మక శాస్త్రీయ ప్రయోగంలో విజయం సాధించారు. ఆ దేశంలో తొలిసారి ఓ శిశువు ముగ్గురి డీఎన్‌ఏలతో జన్మించింది. ఇందులో 99.8 శాతం డీఎన్‌ఏ తల్లిదండ్రలదే కాగా.. మిగతా శాతం మహిళా దాతది. వినాశకరమైన మైటోకాండ్రియల్ వ్యాధులతో పిల్లలు పుట్టకుండా నిరోధించే ప్రయత్నంలో భాగంగా బ్రిటన్ శాస్త్రవేత్తలు ఈ సాంకేతికతను ఉయోగిస్తున్నారు. దీనికి మైటోకాండ్రియల్ డోనేషన్ ట్రీట్‌మెంట్‌(ఎండీటీ)గా నామకరణం చేశారు.  

dna

ఈ పద్ధతిలో ఆరోగ్యవంతమైన మహిళా దాత అండాల కణజాలన్ని ఉపయోగించి ఐవీఎఫ్‌ పిండాలను సృష్టిస్తారు. తద్వారా పిల్లలకు  తల్లుల ద్వారా మైటోకాండ్రియా సోకకుండా నిరోధిస్తారు. మైటోకాండ్రియా వ్యాధులను నిరోధించేందుకు ఇతర మహిళల అండాల కణజాలాన్ని ఉపయోగిస్తున్నారు. ఫలితంగా పిల్లలు మైటోకాండ్రియా వ్యాధుల బారినపడకుండా చేస్తున్నారు.

షూటింగ్‌ ప్రపంచకప్‌లో రిథమ్‌కు కాంస్యం
ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ రైఫిల్‌/పిస్టల్‌ పోటీల్లో భారత షూటర్‌ రిథమ్‌ సంగ్వాన్‌ మెరిసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో ఆమె కాంస్యం నెగ్గింది. ఫైనల్లో ఆమె 219.1 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది. అన్నా కొరకాకి (241.3- గ్రీస్‌), ఒలీనా కోస్తెవిచ్‌ (240.6- ఉక్రెయిన్‌) వరుసగా స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకున్నారు.

Rithyam

తెలంగాణ షూటర్‌ ఇషా సింగ్‌ ఆరో స్థానంలో నిలిచింది. అంతకుముందు అర్హత రౌండ్లో రిథమ్‌ (581) మూడు, ఇషా (579) ఆరో స్థానాన్ని దక్కించుకున్నారు. కానీ 24 రౌండ్ల ఫైనల్లో ఇషా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. చివరి వరకూ పోరాడిన రిథమ్ కాంస్యం నెగ్గింది. 

చ‌ద‌వండి: రెండు కోట్ల ప్యాకేజీతో అద‌ర‌గొట్టిన హైద‌రాబాదీ అమ్మాయి

జీఎస్టీ నిబంధనల్లో మార్పులు.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్!
జీఎస్టీ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. పీటీఐ కథనం ప్రకారం.. రూ.5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు ఆగస్టు 1 నుంచి బిజినెస్-టు-బిజినెస్ (B2B) లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ లేదా ఈ -ఇన్‌వాయిస్‌ని రూపొందించడం తప్పనిసరి. ప్రస్తుతం రూ.10 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలకు ఈ -ఇన్‌వాయిస్‌ నిబంధన అమలులో ఉంది.

gst

కేంద్ర ఆర్థిక శాఖ మే 10 నాటి నోటిఫికేషన్ ద్వారా ఈ -ఇన్‌వాయిస్ నమోదు పరిమితిని తగ్గించింది. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు  B2B లావాదేవీలకు సంబంధించి ఈ -ఇన్‌వాయిస్‌లను సమర్పించాలి. ఈ నిబంధన ఆగస్ట్ 1 నుంచి అమలులోకి వస్తుంది.
 

Published date : 11 May 2023 07:05PM

Photo Stories