8th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్... భారీగా వేతనాల పెంపు..! కనీస వేతనం ఎంతంటే
వచ్చే ఏడాది అంటే 2024లో దేశవ్యాప్తంగా లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో దాదాపు రెండు కోట్ల మంది ఉద్యోగులు పని చేస్తున్నట్లు సమాచారం. వీరందరికి ఎన్నికలకు ముందే తీపి కబురును అందించేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
చదవండి: సాధారణ రైతు బిడ్డ... రూ.2 కోట్ల ప్యాకేజీతో అదరగొట్టాడు
ఇందులో భాగంగా ఏడాది అంటే 2023లోనే 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. వేతన సంఘం సిఫార్సుల మేరకే కేంద్రం.. ప్రభుత్వ ఉద్యోగాలను పెంచుతుంది. ప్రతి పదేళ్లకు ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేయడం.. తర్వాత ఆ సిఫార్సులను కేంద్రం అమలు చేస్తూ వస్తుండడం సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది.
చదవండి: 10జీపీఏ విద్యార్థులకు రూ.10వేలు నగదు పురస్కారం
7వ వేతన సంఘాన్ని 2013లో ఏర్పాటు చేశారు. అప్పుడు పే కమిషన్ చేసిన సిఫార్సులను 2016లో కేంద్రం అమలు చేసింది. కేంద్ర ప్రభుత్వ కనీస వేతనం రూ.18 వేలుగా ఉండాలని 7వ పే కమిషన్ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును కేంద్రం అమలు చేసింది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు వేతనం రూ.18,000 నుంచి రూ.56,900గా ఇప్పటివరకు ఉంది.
చదవండి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్... హెచ్‌ఆర్‌ఏ పెంపు
అయితే తాజాగా ఏర్పాటు చేయనున్న వేతన సంఘం.. ఉద్యోగి కనీస వేతనాన్ని రూ.24 వేలుగా నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రానికి కూడా ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. అలాగే నూతన సంఘం ఫిట్మెంట్‌ను కూడా భారీగా పెంచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలలో ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేలా సంఘం సిఫార్సులు ఉండే అవకాశం ఉంది. వేతన సంఘం ఏర్పాటు, వాటి సిఫార్సులు... సిఫార్సులను ఆమోదించడం... ఇవన్నీ చకచకా జరిగిపోయేలా కనిపిస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగానే వేతనాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.