Skip to main content

UPSC Exam Calendar 2024: వచ్చే ఏడాది మే 26న సివిల్స్‌ ప్రిలిమ్స్‌

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 2024లో నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. అఖిల భారత సర్వీసు పరీక్షలతో పాటు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు/ శాఖల్లోని ఉద్యోగాలకు సంబంధించి నియామక పరీక్షలకు యూపీఎస్సీ నిర్వ‌హిస్తూ వ‌స్తోంది.
Union Public Service Commission
Union Public Service Commission

సివిల్ సర్వీసెస్(ప్రిలిమ్స్), ఐఎఫ్‌ఎస్‌(ప్రిలిమ్స్‌) ప‌రీక్ష‌కు సంబంధించి నిర్వ‌హించే ప్రిలిమ్స్ మే 26వ జ‌ర‌గ‌నుంది. అయితే వ‌చ్చే ఏడాది ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ప‌రీక్ష తేదీల్లో మార్పులు చోటు చేసుకునే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ ప‌రీక్ష తేదీల్లో మార్పులు చేస్తే ఆ విష‌యాన్ని యూపీఎస్సీ అధికారికంగా వెల్ల‌డిస్తుంది. 

Sheshadrini Reddy IPS Success Story : ఆన్‌లైన్‌లో స్ట‌డీమెటీరియల్‌ ఫాలో అవుతూ.. ఐపీఎస్ సాధించానిలా.. కానీ

యూపీఎస్సీ 2024లో నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌..

Exam Name Date
సివిల్ సర్వీసెస్(ప్రిలిమ్స్), ఐఎఫ్‌ఎస్‌(ప్రిలిమ్స్‌) ఎగ్జామ్ మే 26వ తేదీ
ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ, సీడీఎస్‌ ఎగ్జామ్‌(1)  ఏప్రిల్ 21వ తేదీ
ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌(ప్రిలిమ్స్‌) ఎగ్జామ్‌    ఫిబ్ర‌వ‌రి 18వ తేదీ
కంబైన్డ్‌ జియో-సైంటిస్ట్‌(ప్రిలిమ్స్‌) ఫిబ్ర‌వ‌రి 18వ తేదీ
సీఐఎస్‌ఎఫ్‌ ఏసీ(ఈఎక్స్‌ఈ) ఎల్‌డీసీఈ  మార్చి 10వ తేదీ
ఐఈఎస్‌/ ఐఎస్‌ఎస్‌ ఎగ్జామ్‌ జూన్ 21వ తేదీ
కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ జులై 14వ తేదీ
సీఏపీఎఫ్‌(ఏసీ) ఎగ్జామ్‌ ఆగ‌స్ట్ 4వ తేదీ
ఎస్‌వో/ స్టెనో(జీడీ-బి/జీడీ-1) ఎల్‌డీసీఈ డిసెంబ‌ర్ 7వ తేదీ

      

Published date : 11 May 2023 05:05PM
PDF

Photo Stories