Skip to main content

Jr Panchayat Secretary: పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల‌కు గుడ్ న్యూస్‌.... త్వ‌ర‌లోనే రెగ్య‌ల‌రైజేష‌న్.!

తెలంగాణలోని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్‌) క్రమబద్ధీకరించాల‌ని ప్రభుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్ప‌టికే రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న వారి వివరాలివ్వాలని జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించింది. పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల ప్రొబేష‌న్ పీరియ‌డ్‌(నాలుగేళ్ల శిక్షణ కాలం) పూర్తికావొస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వారికి సంబంధించిన సమాచారం సేకరిస్తోంది.
Telangana Govt
Telangana Govt

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామపంచాయతీకి కార్యదర్శులుండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2019లో 9,352 మంది జేపీఎస్‌ల నియామకాలు చేప‌ట్టింది. మొదటి ఏడాది పాటు శిక్షణ కాలం ఉండగా.. దాన్ని నాలుగేళ్లకు పెంచి, వేతనాన్ని రెట్టింపు చేసింది. అప్ప‌టివ‌ర‌కు ఇస్తోన్న రూ.15 వేల‌ను రూ.29 వేల‌కు పెంచింది. అయితే ఏడాదిపాటు ప్రొబెష‌న్ పీరియ‌డ్‌ను నాలుగేళ్ల‌కు పెంచ‌డంతో పాటు ప‌ని ఒత్తిడి భారీగా పెర‌గ‌డంతో ఉద్య‌మ‌బాట ప‌ట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈనెల 28లోగా తమను క్రమబద్ధీకరించకపోతే సమ్మెలోకి వెళ్లే యోచ‌న‌లో ఉన్నారు. దీనికి తోడు మ‌రికొన్ని నెల‌ల్లో అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. ఇందుకు సంబంధించి మ‌రికొద్ది రోజుల్లో పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు గుడ్‌న్యూస్ వినే అవ‌కాశం ఉంది.

చ‌ద‌వండి: క‌ర్నూలు తొలి మ‌హిళా క‌లెక్ట‌ర్‌గా సృజన... తండ్రి ప‌నిచేసిన జిల్లాకే క‌లెక్ట‌ర్‌గా

చ‌ద‌వండి: ఆ మూడు పార్టీల‌కు ఈసీ షాక్‌... ఇన్ని సీట్లు వ‌స్తేనే జాతీయ హోదా.!

Published date : 11 Apr 2023 05:50PM

Photo Stories