Kurnool Collector Srujana: కర్నూలు తొలి మహిళా కలెక్టర్‌గా సృజన... తండ్రి పనిచేసిన జిల్లాకే కలెక్టర్‌గా
2013 ఐఏఎస్ బ్యాచ్...
కర్నూలు జిల్లాకు కలెక్టర్‌గా 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన గుమ్మళ్ల సృజన నియమితులయ్యారు. ప్రస్తుతం పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా పని చేస్తున్న ఈమె జిల్లాకు 55వ కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్‌గా ఆమెకు ఇది తొలి పోస్టింగ్. ఈమె తండ్రి బలరామయ్య 2008లో కర్నూలు కలెక్టర్‌గా పని చేశారు. ఇప్పటి వరకు 54 మంది కర్నూలులో పని చేయగా.. అందరూ పురుషులే.
చదవండి: ఆ మూడు పార్టీలకు ఈసీ షాక్... ఇన్ని సీట్లు వస్తేనే జాతీయ హోదా.!
వైజాగ్ కమిషనర్‌గా...!
విశాఖ మహా నగరపాలక సంస్థ కమిషనర్‌గా విధులు నిర్వహించే సమయంలో సృజన మంచి పేరు సంపాదించుకున్నారు. మొదటి వేవ్ కరోనా ప్రారంభసమయానికి అంటే 2020 ఏప్రిల్‌కి ఆమె పండంటి బిడ్డకు జన్మనించి నెల రోజులే అయ్యింది. ఆ సమయంలో కరోనా నియంత్రణలో భాగంగా విశాఖపట్నం లాంటి మహానగరంలో మున్సిపల్ కమిషనర్ అవసరం ఎంతమేర ఉంటుందో అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా నియంత్రణకు తన అవసరం ఎంత ఉందో తెలిసిన సృజన.. వెంటనే విధుల్లో చేరారు. బిడ్డను భర్త, తల్లికి అప్పజెప్పి తన విధులకు హాజరయ్యారు. కేవలం ఆఫీస్‌కే పరిమితం కాకుండా.. క్షేత్ర స్థాయిలో పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. ప్రజలకు నిత్యావసరాలు అందజేయడంలో కీలక పాత్ర పోషించి, మంచి ఆఫీసర్‌గా ఖ్యాతి సంపాదించుకున్నారు.
చదవండి: ఇకపై వాట్సాప్‌లో సచివాలయాల సేవలు... ఏపీలో మరో విప్లవాత్మక నిర్ణయం
రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా...
మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) కమిషనర్‌గా పనిచేసిన అనంతరం 2021 అక్టోబర్‌లో పరిశ్రమలశాఖ డైరెక్టర్‌గా గుమ్మళ్ల సృజన బదిలీపై వెళ్లారు.