Good News: భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై మెట్లదారి భక్తులకు శీఘ్రదర్మనం
Sakshi Education
రత్నగిరి సత్యదేవుని సన్నిధికి మెట్లదారిన వచ్చే భక్తులకు ఉచితంగా శీఘ్రదర్శనం కల్పించనున్నారు. ఇందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 27న డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో ఒక భక్తుడు మెట్లదారి భక్తులకు ఉచిత శీఘ్ర దర్శనం కల్పించేలా కూపన్లు ఇవ్వాలని కోరాడు.
దీనిపై ఈఓ సానుకూలంగా స్పందించారు. అదే రోజు సాయంత్రం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ మేరకు ఆయన ప్రతిపాదించారు. ధర్మకర్తల మండలి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించడంతో మే 1వ తేదీ జరగునున్న దివ్యకల్యాణ మహోత్సవం నాటికి శీఘ్రదర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
చదవండి: భక్తులకు గుడ్ న్యూస్... నడక భక్తులకు ఇకపై టోకెన్ల జారీ
చదవండి: ప్రవేశాలకు వేళాయే.... కేంద్రీయ విద్యాలయాలకు ఇలా అప్లై చేసుకోండి
Published date : 05 Apr 2023 05:51PM