Chaganti Koteswara Rao: టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు
Sakshi Education
టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్(HDPP) కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో జనవరి 20వ తేదీ హెచ్‌డీపీపీ, ఎస్వీబీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం మూడేళ్లుగా వివిధ పారాయణాలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. గ్రామీణ యువత భాగస్వామ్యంతో మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామస్తులకు భజన, కోలాటం సామగ్రి అందించాలని, మానవాళి శ్రేయస్సుకు యాగాలు, హోమాలు నిర్వహించాలని, ఎస్వీబీసీ తెలుగు, తమిళ చానళ్ల తరహాలో కన్నడ, హిందీ చానళ్లు ప్రాచుర్యం పొందేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు వివరించారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)
Published date : 21 Jan 2023 05:20PM