Temple Floor Collapse: ఆలయంలో విషాదం.. 14 మంది భక్తులు మృతి
Sakshi Education
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో బావి పైకప్పు కూలి 14 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా స్థానిక పటేల్‌నగర్‌లోని బేలేశ్వర్ మహాదేవ్ ఝులేలాల్ ఆలయంలో పూజా కార్యక్రమాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కొందరు భక్తులు బావిపై కట్టిన స్లాబ్‌పై నిలబడి ఉండగా అది హఠాత్తుగా కూలింది. సుమారు 35 మంది బావిలో పడిపోయారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సాయంత్రం వరకు 19 మందిని కాపాడగలిగారు.
మరో 14 మంది చనిపోయినట్లు కలెక్టర్ ఇళయరాజా చెప్పారు. వీరిలో 10 మంది మహిళలేనన్నారు. విశాలమైన పురాతన బావిపై స్లాబ్ వేసి, దానిపై ఆలయం నిర్మించినట్లు స్థానికులు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున అందజేస్తామని సీఎం చౌహాన్ ప్రకటించారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)
Published date : 31 Mar 2023 04:15PM