Temple Floor Collapse: ఇండోర్ ఆలయంలో విషాదం.. 36కు చేరిన మరణాలు
ఇండోర్‌లోని బేలేశ్వర్ మహాదేవ్ ఝులే లాల్ ఆలయంలో మార్చి 30న మెట్ల బావి పైకప్పు కూలింది. గల్లంతైన వారందరినీ వెలికితీశారు. ‘‘కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనలో గల్లంతైనట్లు భావిస్తున్న మొత్తం 36 మృతదేహాలను వెలికితీశాం. గాయపడిన మరో 17 మందిని ఆస్పత్రులకు తరలించాం. ఇద్దరిని ప్రథమ చికిత్స అనంతరం ఇళ్లకు పంపించి వేశాం’’ అని అధికారులు తెలిపారు.
‘‘అన్వేషణ కార్యక్రమాన్ని ఆపలేదు. బావిలో పడిన స్లాబ్ శిథిలాలను, పూడిక మొత్తం తొలగించే పని ఇంకా కొనసాగుతోంది’’ సహాయ, రక్షణ కార్యక్రమాల్లో ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది పాలుపంచుకుంటున్నారు. ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ సంయుక్త బృందం బావిలోకి క్రేన్‌ను, ట్రాలీని దించి, మృతదేహాలను బయటకు తీసుకువచ్చింది.
Pan-Aadhaar Link: మీ ఆధార్-పాన్ లింక్ అయ్యిందా.. లేదా.. తెలుసుకోండిలా.. లింక్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా..?
శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా స్థానిక పటేల్‌నగర్‌లోని బేలేశ్వర్ మహాదేవ్ ఝులేలాల్ ఆలయంలో పూజా కార్యక్రమాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కొందరు భక్తులు బావిపై కట్టిన స్లాబ్‌పై నిలబడి ఉండగా అది హఠాత్తుగా కూలింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున అందజేస్తామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు.