Skip to main content

Pan-Aadhaar Link: మీ ఆధార్-పాన్ లింక్ అయ్యిందా.. లేదా.. తెలుసుకోండిలా.. లింక్ చేయ‌క‌పోతే ఏమ‌వుతుందో తెలుసా..?

మ‌న ద‌గ్గ‌ర ఉన్న‌ రెండు గుర్తింపు కార్డులు పర్మనెంట్ అకౌంట్ నంబర్ (PAN), ఆధార్ కార్డు.
Pan-Aadhaar Link

ఈ రెండింటిని లింక్ చేయాల‌ని, లేదంటే పాన్ కార్డు పని చేయకుండా పోతుందని ఇప్ప‌టికే ఆదాయపు పన్ను శాఖ ఆదేశాలు జారీ చేసింది. పాన్‌తో ఆధార్ అనుసంధానం గడువు మార్చి 31తో ముగియాల్సి ఉండగా.. దీనిని కేంద్రం మరో మూడు నెలలు అంటే జూన్‌ 30 వరకు పొడ‌గించింది.  

మీ ఆధార్-పాన్ లింక్ అయ్యిందా..?
☛ మీ పాన్ కార్డుకు ఆదార్ లింక్ అయ్యిందా లేదా తెలుసుకోవ‌డానికి ముందుగా ఆదాయపు పన్నుశాఖ‌ అధికారిక వెబ్ సైట్ incometaxindiaefiling.gov.in లోకి వెళ్లండి. 
☛ అక్క‌డ హోం పేజీలో ఉన్న Link Aadhaar Status పై క్లిక్ చేయండి. 
☛ మీ పాన్‌, ఆధార్ నెంబ‌ర్ల‌ను ఎంట‌ర్ చేయండి. 
☛ View Link Aadhaar Status పై క్లిక్ చేయండి.
☛ మీ ఆధార్ లింక్ అయ్యింటే Your PAN BXXXXXXXXQ is already linked to given Aadhaar 2XXXXXXXXXX0 అని వ‌స్తుంది. లేదంటే Your PAN BXXXXXXXXQ is Not linked to given Aadhaar 2XXXXXXXXXX0 అని వ‌స్తుంది.

PAN-Aadhaar link: పాన్‌తో ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..?

ఆన్‌లైన్ ద్వారా ఆధార్-పాన్ లింక్ చేయండిలా..
☛ ఆదాయపు పన్ను శాక అధికారిక వెబ్ సైట్ eportal.incometax.gov.in లేదా incometaxindiaefiling.gov.in లోకి లాగిన్ కావాలి.
☛ ఒక‌వేళ మీరు రిజిస్టర్ కాకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
☛ మీ పాన్ కార్డ్ లేదా ఆధార్ నంబర్ మీ యూజర్ ఐడీగా క్రియేట్ చేసుకోవాలి.
☛ తర్వాత మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, పుట్టిన‌రోజు ద్వారా పోర్టల్‌లో లాగిన్ కావాలి. అనంత‌రం స్క్రీన్‌పై పాపప్ నోటిఫికేషన్ కనిపిస్తుంది.
☛ ఒకవేళ పాపప్ నోటిఫికేషన్ కనిపించకపోతే.. క్విక్ లింక్స్ సెక్షన్‌లోకి వెళ్లాలి.
☛ ఆ తర్వాత లింక్ ఆధార్ ఆప్షన్ ఎంచుకోండి.
☛ ఆధార్ కార్డులో ఉన్నట్టుగా ఆధార్ నంబర్, పేరు, పాన్ నంబర్ ఎంటర్ చేయండి.
☛ ఒక‌వేళ పుట్టినరోజు లేకుండా పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే I have only year of birth in Aadhaar card పై క్లిక్ చేయండి.
☛ తర్వాత అక్క‌డ క‌నిపించే క్యాప్షా కోడ్‌ను ఎంటర్ చేయండి.
☛ ఆధార్, పాన్ కార్డు వివరాలు సరిపోతే.. మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
 
నోట్: పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వివరాలు తప్పనిసరిగా ఒకే విధంగా ఉండాలి. లేక‌పోతే ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాలి.

 

Income tax slabs: ఏప్రిల్ నుంచి మార‌నున్న ప‌న్ను విధానం.. ప‌న్ను చెల్లింపుదారులు గుర్తించుకోవాల్సిన అంశాలివే..

పాన్‌కు ఆధార్ లింక్ చేయ‌క‌పోతే ఏమ‌వుతుంది?
☛ పాన్ కార్డు ఇక‌పై ప‌నిచేయదు.
☛ ఆదాయ ప‌న్ను రిట‌ర్స్న్ జారీ చేయ‌లేరు.
☛ స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన లావాదేవీలు జ‌రుప‌లేరు.
☛ బ్యాంక్‌లో 50 వేల రూపాయ‌లు మించి ఎఫ్‌డీ చేయ‌లేరు.
☛ బ్యాంక్‌లో 50 వేల రూపాయ‌లకు మించి విత్‌డ్రా చేయ‌లేరు.
☛ టీడీఎస్ అమౌంట్ ఎక్కువ‌గా క‌ట్ అవుతుంది.

UPI Payments: రూ.2 వేలు మించి ఫోన్‌పే, గూగుల్‌పే చెస్తే అదనపు చార్జీలు.. ఎవ‌రికి వ‌ర్తిస్తుందంటే..

Published date : 30 Mar 2023 01:13PM

Photo Stories