Skip to main content

Female MBBS students: కేర‌ళ‌లోనూ హిజాబ్ వివాదం.. ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లోకి హిజాబ్‌తో అనుమ‌తించాలంటూ ఆందోళ‌న‌

క‌ర్నాట‌క‌లో రేగిన హిజాబ్ వివాదం దేశ‌వ్యాప్తంగా దుమారం లేపిన విష‌యం మ‌ర‌వ‌కముందే కేర‌ళ‌లోనూ ఇలాంటి ప‌రిస్థితులు తలెత్తేలా క‌నిపిస్తున్నాయి. హాస్పిట‌ల్‌లోని ఆపరేషన్ థియేటర్లో హిజాబ్, లాంగ్ స్లీవ్ స్క్రబ్స్ ధరించేందుకు అనుమతి ఇవ్వాల‌ని కొంత‌మంది ఎంబీబీఎస్ విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు.
Hijab
Hijab

తిరువనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన మహిళా ముస్లిం ఎంబీబీఎస్ విద్యార్థుల బృందం ఆపరేషన్ థియేటర్లలో హిజాబ్ ధరించడానికి అనుమతించడం లేదని ఆందోళన చేప‌ట్టింది. అలాగే త‌మ చేతుల‌ను పూర్తి క‌వ‌ర్ చేసే లాంగ్ స్లీవ్ స్క్రబ్ జాకెట్లు, స‌ర్టిక‌ల్‌ హుడ్లను ధరించడానికి త‌మ‌కు  అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ 'కీ' విడుద‌ల‌.. ఈ ప్ర‌శ్న‌ల‌కు మాత్రం..

2020 బ్యాచ్‌కు చెందిన మహిళా మెడికో జూన్ 26న తిరువనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లిన్నెట్ జె మోరిస్‌కు ఈ విష‌యంపై లేఖ రాసింది. ఇది తెలుసుకున్న మ‌రికొంత‌మంది మహిళా వైద్య విద్యార్థినులు ఆ లేఖ‌పై సంతకాలు చేశారు. ఆపరేషన్ థియేటర్ లోపల త‌మ‌ తలలను పూర్తిగా కప్పుకునేందుకు అనుమతించడం లేదని విద్యార్థులు లేఖలో ఫిర్యాదు చేశారు.

Hijab

తమ మత విశ్వాసం ప్రకారం ముస్లిం మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ హిజాబ్ ధరించడం తప్పనిసరి అని విద్యార్థినులు చెబుతున్నారు. అయితే విద్యార్థినుల వాద‌న‌ల‌పై ప్రిన్సిప‌ల్ భిన్నంగా స్పందించింది. ఆపరేషన్ థియేటర్‌ లోపల డాక్ట‌ర్లు ఎలా ఉండాలి, ఎలాంటి డ్రెస్ కోడ్ ధ‌రించాలి అన్న విష‌యాల‌ను ఆమె వివ‌రించారు. ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన డ్రెస్ కోడ్ నే ఎట్టిప‌రిస్థితుల్లోనూ పాటించాల‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.

MBBS : వైద్య విద్యార్థుల‌కు కీల‌క అప్డేట్‌... ఈ ఎగ్జామ్ పూర్తి చేసిన‌వారికే లైసెన్స్‌

Hijab

ఆపరేషన్ థియేటర్ లో ఏమాత్రం అపరిశుభ్రంగా ఉన్న రోగుల‌కు ఇన్ఫెక్ష‌న్ సోకే ప్ర‌మాదం ఉంద‌ని ఆమె హెచ్చ‌రించారు. రోగుల ఆరోగ్యం, భద్రత మ‌న‌కు అత్యంత ప్రాధాన్యమని ఆమె వివ‌రించారు. శస్త్రచికిత్స చేసేటప్పుడు లేదా అక్క‌డ స‌హాయ‌కులుగా ఉన్న‌ప్పుడు నీటిలో మోచేయి వరకు శుభ్రం చేయాల్సి వ‌స్తుంద‌ని, మీరు కోరిన‌ట్లు లాంగ్ స్లీవ్ జాకెట్లు ధరిస్తే శుభ్రం చేసుకోవడం సాధ్య‌ప‌డ‌ద‌ని ఆమె విద్యార్థినుల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పారు. 

MBBS: ఇక‌నుంచి ఒక్కో కాలేజీలో ఒక్కో రేటు... తెలంగాణ‌లో భారీగా పెర‌గ‌నున్న ఫీజు... ఏ కాలేజీలో ఎంతంటే..!

Hijab

ఆపరేషన్ థియేటర్లలో ప్రస్తుతం ఉన్న విధానాలు, పద్ధతులను మార్చేందుకు ఎట్టిప‌రిస్థితుల్లోనూ అనుమ‌తించేది లేద‌ని ప్రిన్సిపాల్ మోరిస్ స్ప‌ష్టం చేశారు. విద్యార్థుల ఆందోళనలను పరిష్కరించడానికి, వారు లేవ‌నెత్తిన స‌మ‌స్య‌ను పరిశీలించడానికి సర్జన్ల కమిటీని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. 

MBBS: ఎంబీబీఎస్‌లో కీల‌క మార్పులు... రెండో ఏడాది నుంచి కాలేజీ మార్పు అస్స‌లు కుద‌ర‌దు... ప‌రీక్ష పేప‌ర్ల‌లోనూ అమ‌లు

ప్ర‌స్తుతం ఈ విష‌యం నెట్టింట వైర‌ల్‌గా మారుతోంది. రోగుల భ‌ద్ర‌త విష‌యంలో ఎలా రాజీ ప‌డ‌తార‌ని కొంత‌మంది కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అమ‌లులో ఉన్న డ్రెస్ కోడ్‌ను వినియోగించేందుకు ఇబ్బందులేంట‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. అలాగే విద్యార్థినుల‌కు నెటిజ‌న్ల త‌మ‌ మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.

Published date : 29 Jun 2023 03:46PM

Photo Stories