Skip to main content

Issues in 2022 : భార‌త్‌లో 2022లో సంచలనం రేపిన ఘర్షనలు..

సైన్యంలో తాత్కాలిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకం దేశవ్యాప్తంగా అగ్గిరాజేసింది.

యువకులకు నాలుగేళ్లు సైన్యంలో పనిచేసే అవకాశం మాత్రమే కల్పించడంతో పాటు పింఛన్‌ సదుపాయం కూడా లేని ఈ పథకానికి జూన్‌ 14న కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, తెలంగాణ, ఒడిశా, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఆందోళనలు హింసకు దారితీశాయి.

Hijb issues

➤ కర్ణాటకలో ఉడిపిలో కళాశాలలో జనవరిలో హిజాబ్‌ ధరించి వచ్చినందుకు కొందరు ముస్లిం అమ్మాయిలను తరగతి గదుల్లోకి రానివ్వకపోవడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. వీరికి పోటీగా కొందరు విద్యార్థులు కాషాయ దుస్తులు ధరించి రావడంతో మతఘర్షణలకు దారి తీసింది. కర్ణాటక ప్రభుత్వం ఫిబ్రవరి 5న హిజాబ్‌పై నిషేధం విధిస్తే మార్చి 15న హైకోర్టు దానిని సమర్థిస్తూ తీర్పు చెప్పింది. అక్టోబర్‌ 13న సుప్రీంకోర్టు భిన్న తీర్పులు వెలువరించడంతో తుది నిర్ణయం భారత ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని బెంచ్‌ చేతుల్లోకి  వెళ్లింది.  
➤ గుజరాత్‌లోని మోర్బిలో అక్టోబర్‌ 30 కుప్పకూలిపోయిన కేబుల్‌ వంతెన దుర్ఘటనలో 138 మంది మరణించారు. మానవ తప్పిదాల కారణంగానే ఈ వంతెన కుప్పకూలిపోయింది. ఒకేసారి వంతెనపైకి వంద మంది వెళ్లడానికి మాత్రమే వీలుంటే, నిర్వాహకులు 500 మందిని పంపడంతో ప్రమాదం జరిగింది.  
➤ ఢిల్లీలో నివాసముంటున్న శ్రద్ధా వాకర్‌ అనే యువతిని ఆమెతో సహజీవనం చేస్తున్న అఫ్తాబ్‌ పూనెవాలె మే 18న గొంతు కోసి హత్య చేయడంతో పాటు ఆమె మృతదేహాన్ని 35 ముక్కలు చేసి చుట్టుపక్కల అడవుల్లో పారేసిన ఘటన దేశంలో సంచలనం సృష్టించింది. మృతదేహం ముక్కల్ని ఫ్రిజ్‌లో ఉంచి రోజుకి కొన్ని పారేసిన వైనం ఒళ్లు జలదరించేలా చేసింది. నవంబర్‌ 11న అఫ్తాబ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Best Moments in India 2022 : భారత్‌లో 2022లో జరిగిన చరిత్మ్రాక మెరుపులు ఇవే..

Published date : 28 Dec 2022 05:52PM

Photo Stories