NMC: వైద్య విద్యార్థులకు కీలక అప్డేట్... ఈ ఎగ్జామ్ పూర్తి చేసినవారికే లైసెన్స్
Sakshi Education
ఎంబీబీఎస్ 2019 బ్యాచ్ ఫైనలియర్ విద్యార్థులకు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (NExT) వచ్చే ఏడాది రెండు దశల్లో ఉంటుందని అధికారవర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నిర్వహించే ఈ పరీక్షల మొదటిదశ 2024 ఫిబ్రవరిలో ఉండే అవకాశం కనిపిస్తోంది.
ఈ దశ ముగిశాక విద్యార్థులు ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్‌లో ఉంటారు. మొదటిదశ పరీక్షలో వారు చూపిన ప్రతిభను పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి పరిగణనలోకి తీసుకుంటామని నేషనల్ మెడికల్ కమిషన్.. ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు వర్గాలు తెలిపాయి. ఇంటర్న్‌షిప్ తర్వాత నెక్ట్స్ రెండోదశను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఇకనుంచి ఒక్కో కాలేజీలో ఒక్కో రేటు... తెలంగాణలో భారీగా పెరగనున్న ఫీజు... ఏ కాలేజీలో ఎంతంటే..!
రెండు దశలు పూర్తిచేసినవారు భారత్‌లో ఆధునిక వైద్య ప్రాక్టీసుకు లైసెన్సు, రిజిస్ట్రేషను పొందేందుకు అర్హులవుతారు. విదేశాల్లో వైద్యవిద్య చదివి భారత్‌లో ప్రాక్టీసు చేయాలనుకునేవారు సైతం ఇదేవిధంగా నెక్ట్స్ రెండు దశలతోపాటు ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాల్సి ఉంటుంది. నెక్ట్స్ మాక్ టెస్ట్‌లు జులై 28న నిర్వహించనున్నారు. అర్హులైన విద్యార్థులు జూన్ 28 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి.
MBBS internship: ఎంబీబీఎస్‌లో కీలక మార్పులు... రెండో ఏడాది నుంచి కాలేజీ మార్పు అస్సలు కుదరదు... పరీక్ష పేపర్లలోనూ అమలు
Published date : 28 Jun 2023 04:15PM