US State Secretary: అయిదేళ్ల తర్వాత బీజింగ్‌కు బ్లింకెన్.. చైనా విదేశాంగ మంత్రితో కీలక చర్చలు
Sakshi Education
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ జూన్ 18న చైనా రాజధాని బీజింగ్‌కు చేరుకున్నారు. చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్‌తో ఆయన భేటీ అయ్యారు.
తైవాన్ అంశం, ఉక్రెయిన్ యుద్ధం తదితర కీలక అంశాలపై వారు చర్చలు జరిపారు. అనంతరం అధికార విందులో పాల్గొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బ్లింకెన్ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కూడా కలుస్తారని సమాచారం. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సమయంలో బ్లింకెన్ చేపట్టిన ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాధారణ సంబంధాలపై ఇరుపక్షాలు ఆసక్తితో ఉన్నప్పటికీ, బ్లింకెన్ పర్యటనతో కీలక పరిణామాలకు అవకాశాలు తక్కువని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ వ్యాఖ్యానించడం గమనార్హం.
Nepal PM Prachanda India Visit: నేపాల్ ప్రధాని ప్రచండతో మోదీ ద్వైపాక్షిక చర్చలు
Published date : 19 Jun 2023 05:00PM